• HOME
  • »
  • NEWS
  • »
  • TECHNOLOGY
  • »
  • GOOD NEWS SMARTPHONE USERS GOOGLE WORKING ANDROID 12 OPERATING SYSTEM KNOW EXPECTED FEATURES SS GH

Android 12: త్వరలోనే ఆండ్రాయిడ్ 12 వర్షన్... ఈ సమస్యకు చెక్

Android 12: త్వరలోనే ఆండ్రాయిడ్ 12 వర్షన్... ఈ సమస్యకు చెక్

Android 12: త్వరలోనే ఆండ్రాయిడ్ 12 వర్షన్... ఈ సమస్యకు చెక్ (ప్రతీకాత్మక చిత్రం)

Android 12 | ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలో ఆండ్రాయిడ్ 12 రాబోతోంది. ఆకట్టుకునే ఫీచర్స్ ఏవో తెలుసుకోండి.

  • Share this:
ప్రస్తుతం దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఆండ్రాయిడ్ 10 వర్షన్‌తో వస్తున్నాయి. గూగుల్ తన పిక్సెల్ ఫోన్లలో మాత్రం ఆండ్రాయిడ్ 11ను కూడా అందిస్తుంది. అన్ని ఫోన్లలో ఆండ్రాయిడ్ 11 ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానప్పటికీ, అప్పుడే Android 12ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది గూగుల్. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఆండ్రాయిడ్ 11కు కొనసాగింపుగా దీనిలో నూతన ఫీచర్లను జోడించి కొత్త వెర్షన్ను అందుబాటులోకి తేనుంది. ఫిబ్రవరిలో విడుదలకానున్న ఈ వెర్షన్, సెప్టెంబర్ కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆండ్రాయిడ్ 12ను ప్రారంభంలో Google Pixel 5, Google Pixel 4A, Google Pixel 6 వంటి గూగుల్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్లలో వినియోగించనున్నారు. ప్రారంభంలో, దీన్ని అతి కొద్ది హ్యాండ్‌సెట్‌లలో మాత్రమే ఉపయోగించే అవకాశం ఉంది.

Amazon Prime Video: ఎయిర్‌టెల్ యూజర్లు రూ.89 చెల్లిస్తే చాలు... అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్‌స్క్రిప్షన్

Xiaomi Mi 10i: తొలి సేల్‌లో 1,00,000 స్మార్ట్‌ఫోన్స్ అమ్మిన షావోమీ... ఈ మోడల్ ప్రత్యేకత ఇదే

అన్ని మొబైల్ తయారీ సంస్థలు తమ హ్యాండ్సెట్లలో ఆండ్రాయిడ్ 12ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని కోసం 2022 వేచి చూడాల్సిందేనని వారు స్పష్టం చేస్తున్నారు. కాగా, Android 12 డెవలప్ చేయడానికి, కొత్త ఫీచర్లను జోడించడానికి గూగుల్ సంస్థ ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ (AOSP) గెరిట్‌ను పరిశీలిస్తుంది. అంతేకాక, ఫోన్ స్టోరేజ్ స్పేస్‌ను క్లియర్ చేయడానికి, ఉపయోగించని యాప్స్(Apps)ను ‘హైబర్నేట్’ చేయడానికి ఆప్షన్ను కూడా దీనిలో జోడించనున్నట్లు తెలుస్తోంది.

Tata Sky: మీ ఇంట్లో టాటా స్కై కనెక్షన్ ఉందా? అయితే ఈ కారు గెలుచుకోవచ్చు

WhatsApp: వాట్సప్ వద్దా? అయితే 5 మెసేజింగ్ యాప్స్ ట్రై చేయొచ్చు

వినియోగంలో లేని యాప్స్ అన్నీ ‘హైబర్నేట్’ స్టేట్లోకి


అయితే, ఈ ఆండ్రాయిడ్ 12లో అందిస్తున్న ఫీచర్లపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు గూగుల్. దీనిలో హైబర్నెట్ ఫీచర్ను జోడిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఫీచర్ ద్వారా వినియోగంలోని లేని యాప్స్ ఆటోమేటిక్గా హైబర్నేట్ స్థితిలోకి వెళ్తాయా?.. లేక, వినియోగదారులే స్వయంగా తాము ఉపయోగించని యాప్స్ను హైబర్నేట్ స్టేట్లోకి ప్రవేశపెట్టాలా? అనే ప్రశ్నలపై ఎటువంటి స్పష్టతనివ్వలేదు. అంతేకాక, ఆండ్రాయిడ్ 11లో ప్రవేశపెట్టిన ఆటో- రివోకింగ్ పర్మిషన్ ఫీచర్ వలె దీనిలో కూడా ఆటోమేటిక్ హైబర్నేట్ ఫీచర్‌ను జోడించనున్నట్లు టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. మొబైల్ ఫోన్లో పరిమిత స్టోరేజి స్పేస్ ఉండటంతో, ఎక్కువ మీడియా ఫైళ్లు, యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవడానికి సాధ్యపడదు. ఈ ఇబ్బందిని తొలగించడానికి ఆండ్రాయిడ్ 12 వెర్షన్లో హైబర్నేట్ ఫీచర్ను చేర్చనున్నట్లు తెలుస్తోంది. దీంతో, స్టోరేజ్ స్పేస్ అయిపోతుందనే భయం లేకుండా స్మార్ట్‌ఫోన్ ఆపరేట్ చేయవచ్చు.
Published by:Santhosh Kumar S
First published: