Samsung: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి... లేటెస్ట్ రేట్స్ ఇవే

Smartphone Price Cut | సాంసంగ్ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించింది. జీఎస్‌టీ పెరిగినప్పుడు ధరల్ని పెంచిన సాంసంగ్... ఇప్పుడు రేట్స్ తగ్గించింది.

news18-telugu
Updated: May 4, 2020, 4:03 PM IST
Samsung: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి... లేటెస్ట్ రేట్స్ ఇవే
Samsung: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి... లేటెస్ట్ రేట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే శుభవార్త. రెండు సాంసంగ్ స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి. సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్, సాంసంగ్ గెలాక్సీ ఎం21 స్మార్ట్‌ఫోన్ల ధరల్ని తగ్గించింది కంపెనీ. వీటిలో సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు 4 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.22,999 కాగా 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.24,999. అయితే ఇటీవల జీఎస్‌టీ పెరగడంతో ఈ ఫోన్ల ధరలు కూడా పెరిగాయి. కానీ మళ్లీ రేట్లను తగ్గించింది సాంసంగ్. 4 జీబీ + 128 వేరియంట్ రూ.18,599 ధరకే లభిస్తోంది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్ ధర రూ.20,561. ఇక సాంసంగ్ గెలాక్సీ ఎం21 ధర కూడా తగ్గింది. జీఎస్‌టీ పెరగడంతో 4జీబీ+64జీబీ వేరియంట్ రూ.14,222 ధరకు, 6జీబీ+64జీబీ వేరియంట్ రూ.16,329 ధరకు పెరిగింది. ఇప్పుడు ఈ రెండు వేరియంట్ ధరలు తగ్గాయి. ప్రస్తుతం అమెజాన్‌లో 4జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.12,699 కాగా, 6జీబీ+64జీబీ వేరియంట్ ధర రూ.14,999.

సాంసంగ్ గెలాక్సీ ఏ50ఎస్ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఇన్ఫినిటీ-యూ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే
ర్యామ్: 4 జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 128 జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 9611
రియర్ కెమెరా: 48+8+5 మెగాపిక్సెల్ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై
కలర్స్: ప్రిస్మ్ క్రష్ వయొలెట్, ప్రిస్మ్ క్రష్ బ్లాక్, ప్రిస్మ్ క్రష్ వైట్
ధర:
4 జీబీ + 128 జీబీ- రూ.18,599
6 జీబీ + 128 జీబీ- రూ.26,900

సాంసంగ్ గెలాక్సీ ఎం21 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్
ర్యామ్: 4జీబీ, 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: ఎక్సినోస్ 9611
రియర్ కెమెరా: 48+8+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 6,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10+వన్ యూఐ 2.0
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: మిడ్‌నైట్ బ్లూ, రేవెన్ బ్లాక్
ధర:
4జీబీ+64జీబీ- రూ.12,699
6జీబీ+128జీబీ- 14,999

ఇవి కూడా చదవండి:

SBI Personal Loan: తక్కువ వడ్డీకే ఎస్‌బీఐలో పర్సనల్ లోన్... తీసుకోవచ్చు ఇలా

Jan Dhan account: నేటి నుంచి జన్ ధన్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్... చెక్ చేయండిలా

Jan Dhan account: నేటి నుంచి జన్ ధన్ అకౌంట్‌లోకి మనీ ట్రాన్స్‌ఫర్... చెక్ చేయండిలా
First published: May 4, 2020, 4:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading