హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio Recharge: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రీఛార్జ్ ఇలా కూడా చేయొచ్చు

Jio Recharge: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రీఛార్జ్ ఇలా కూడా చేయొచ్చు

Jio Recharge: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రీఛార్జ్ ఇలా కూడా చేయొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)

Jio Recharge: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రీఛార్జ్ ఇలా కూడా చేయొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Reliance Jio Recharge | రిలయెన్స్ జియో కస్టమర్లకు శుభవార్త. రీఛార్జ్ చేసే పద్ధతిని మరింత సులభతరం చేసింది రిలయెన్స్ జియో. ఇ-వ్యాలెట్ లాంటివి అవసరం లేకుండానే సులువుగా రీఛార్జ్ చేసే అవకాశం కల్పిస్తోంది.

  మీరు రిలయెన్స్ జియో సబ్‌స్క్రైబరా? జియో నెట్వర్క్ ఉపయోగిస్తున్నారా? మీ మొబైల్ నెంబర్‌కు రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా? రీఛార్జ్ చేయడానికి అనేక మార్గాలున్న సంగతి తెలిసిందే. జియో వెబ్‌సైట్‌ లేదా మైజియో యాప్‌లో రీఛార్జ్ చేయడం సులువే. ఇవి కాకుండా పేటీఎం, గూగుల్ పే, అమెజాన్ పే లాంటి వ్యాలెట్స్ నుంచి కూడా రీఛార్జ్ చేయొచ్చు. అయితే ఇవేవీ అందుబాటులో లేకపోయినా మీరు మీ జియో నెంబర్‌కు రీఛార్జ్ చేసే అవకాశముంది. ఇందుకోసం మీ దగ్గర ఏటీఎం కార్డు ఉంటే చాలు. మీకు దగ్గర్లో ఉన్న ఏటీఎంకు వెళ్లి నిమిషాల్లో రీఛార్జ్ చేయొచ్చు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సిటీ బ్యాంక్, డీసీబీ బ్యాంక్, ఏయూఎఫ్ బ్యాంక్, స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు ఏటీఎంలల్లో ఈ సదుపాయం ఉంది. మరి ఏటీఎంలో జియో రీఛార్జ్ ఎలా చేయాలో స్టెప్స్ తెలుసుకోండి.

  Reliance Jio Recharge: ఏటీఎంలో జియో నెంబర్‌కు రీఛార్జ్ చేయండిలా


  ముందుగా ఏటీఎంలో మీ డెబిట్ కార్డును ఇన్సర్ట్ చేయండి.

  మెనూలో 'Recharge' ఆప్షన్ సెలెక్ట్ చేయండి.

  ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. 10 అంకెలు మాత్రమే ఎంటర్ చేయాలి. కంట్రీ కోడ్ అంటే 91 ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు.

  ఆ తర్వాత ఏటీఎం పిన్ ఎంటర్ చేయండి.

  మీరు ఎంత రీఛార్జ్ చేయాలనుకుంటారో అంత అమౌంట్ టైప్ చేయండి.

  ఆ తర్వాతి స్టెప్‌లో కన్ఫామ్ చేయండి.

  స్క్రీన్ పైన రీఛార్జ్ మెసేజ్ కనిపిస్తుంది. మీ అకౌంట్‌లోంచి డబ్బులు డెబిట్ అవుతాయి.

  మీ మొబైల్ నెంబర్‌కు జియో నుంచి మెసేజ్ వస్తుంది.

  ఇవి కూడా చదవండి:

  Jio New Plans: రిలయెన్స్ జియో ప్రకటించిన 5 కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వివరాలివే...

  Banks Merger: మీకు ఈ బ్యాంకులో అకౌంట్ ఉందా? అయితే అలర్ట్

  Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టేందుకు డబ్బులు లేవా? ఇలా చేయండి

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Jio, Reliance Jio

  ఉత్తమ కథలు