Home /News /technology /

GOOD NEWS NOW YOUTUBE PREMIUM AND YOUTUBE MUSIC PREMIUM ANNUAL PLANS AVAILABLE SS

YouTube Plan: యాన్యువల్ ప్లాన్ ప్రకటించిన యూట్యూబ్... ధర ఎంతంటే

YouTube Plan: యాన్యువల్ ప్లాన్ ప్రకటించిన యూట్యూబ్... ధర ఎంతంటే
(ప్రతీకాత్మక చిత్రం)

YouTube Plan: యాన్యువల్ ప్లాన్ ప్రకటించిన యూట్యూబ్... ధర ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

YouTube Plan | యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం వార్షిక ప్లాన్స్ (Annual Plan) వచ్చేశాయి. ఇప్పటివరకు మంత్లీ, క్వార్టర్లీ ప్లాన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు యాన్యువల్ ప్లాన్స్‌ని యూట్యూబ్ ప్రకటించింది. ఎంత చెల్లించాలో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...
    యూట్యూబ్ యూజర్ల కోసం యాన్యువల్ ప్లాన్స్ వచ్చేశాయి. యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) పేరుతో ప్రత్యేక సేవలు లభిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ సేవలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం మంత్లీ, క్వార్టర్లీ సర్వీస్ మాత్రమే అందుబాటులో ఉంది. అంటే ప్రతీ నెల లేదా ప్రతీ మూడు నెలలకు ఓసారి సబ్‌స్క్రిప్షన్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. తొలిసారిగా గూగుల్ యూట్యూబ్ ప్రీమియం యాన్యువల్ సర్వీస్‌ను (Annual Plan) ప్రకటించింది. ఈ ఆఫర్ కొన్ని రోజులే ఉంటుంది. యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే జనవరి 23 వరకే అవకాశం ఉంటుంది. యూట్యూబ్ ప్రీమియం యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.1,159 చెల్లించాలి.

    ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం మంత్లీ ప్లాన్ నెలకు రూ.129 ఉండగా, ఫ్యామిలీ ప్లాన్‌లో ఐదుగురు కుటుంబ సభ్యులకు కలిపి రూ.189 మంత్లీ ప్లాన్ తీసుకోవచ్చు. ఇక స్టూడెంట్స్ కోసం నెలకు రూ.79 ప్లాన్ అందుబాటులో ఉంది. స్టూడెంట్ ప్లాన్‌కు వెరిఫికేషన్ తప్పనిసరి. ఇప్పుడు రూ.1,159 ధరతో యాన్యువల్ ప్లాన్ తీసుకొచ్చింది. యూట్యూబ్ యాన్యువల్ ప్రీమియం మాత్రమే కాదు... యూట్యూబ్ మ్యూజిక్ యాన్యువల్ ప్రీమియం సర్వీస్ కూడా ప్రారంభమైంది. యూట్యూబ్ మ్యూజిక్ యాన్యువల్ ప్లాన్ ధర రూ.889. యూట్యూబ్ మ్యూజిక్‌లో కూడా ఇప్పటివరకు మంత్లీ, క్వార్టర్లీ ప్లాన్స్ మాత్రమే ఉండేవి. ఇప్పుడు యాన్యువల్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది.

    SBI Loan Offer: ఎస్‌బీఐ శుభవార్త... రైతులకు తక్కువ వడ్డీకే రుణాలు

    యూట్యూబ్ మ్యూజిక్ మంత్లీ ప్లాన్ ధర రూ.109 కాగా, క్వార్టర్లీ ప్లాన్ ధర రూ.309. స్టూడెంట్ ప్లాన్ నెలకు రూ.59 మాత్రమే. ఇప్పుడు రూ.889 ధరతో యాన్యువల్ ప్లాన్ లభిస్తోంది. యూట్యూబ్ ప్రీమియం, యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం మంత్లీ ప్లాన్, క్వార్టర్లీ ప్లాన్లతో పోలిస్తే యాన్యువల్ ప్లాన్స్ చాలా తక్కువ ధరకే లభిస్తుండటం విశేషం. జనవరి 23 తర్వాత యాన్యువల్ ప్లాన్స్ అందుబాటులో ఉంటాయా? లేక ధరలు పెరుగుతాయా? అన్న స్పష్టత లేదు.

    ఈ యాన్యువల్ ప్లాన్స్ ఇండివిజువల్ ప్లాన్స్ మాత్రమే. అంటే స్టూడెంట్ ప్లాన్, ఫ్యామిలీ ప్లాన్ తీసుకోవాలనుకునేవారికి యాన్యువల్ ప్లాన్ అందుబాటులో ఉండదు. ఇప్పటికే మంత్లీ ప్లాన్, క్వార్టర్లీ ప్లాన్ తీసుకున్నవారు యాన్యువల్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. వారి ప్రస్తుత ప్లాన్ వేలిడిటీ పూర్తైన తర్వాత యాన్యువల్ ప్లాన్ ప్రారంభమవుతుంది.

    Flipkart Offer: ఈ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌పై స్పెషల్ డిస్కౌంట్... ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్

    యూట్యూబ్ ప్రీమియం ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసినవారు యాడ్స్ లేకుండా యూట్యూబ్ వీడియోస్ చూడొచ్చు. వీడియోలు డౌన్‌లోడ్ చేసి ఆఫ్‌లైన్‌లో ప్లే చేయచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో వీడియో ప్లే చేస్తూ ఇతర యాప్స్ ఉపయోగించొచ్చు. లేదా స్క్రీన్ ఆఫ్ చేయొచ్చు. ఇక యూట్యూబ్ మ్యూజిక్ ప్రీమియం సర్వీస్‌లో యాడ్స్ లేకుండా పాటలు వినొచ్చు. మ్యూజిట్ డౌన్‌లోడ్ చేసి ఆఫ్‌లైన్‌లో వినొచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్ ప్లే చేయొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Youtube

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు