SIM Connection: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక ఈ పని ఇంకా ఈజీ

SIM Connection | సిమ్ కార్డ్ యూజర్లకు శుభవార్త. టెలికామ్ డిపార్ట్‌మెంట్ కొత్త గైడ్‌లైన్స్ తీసుకురానుంది. ఈ గైడ్‌లైన్స్‌తో మొబైల్ యూజర్లకు మేలు జరగనుంది.

news18-telugu
Updated: August 25, 2020, 4:32 PM IST
SIM Connection: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక ఈ పని ఇంకా ఈజీ
మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక ఈ పని ఇంకా ఈజీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు మీ ప్రీపెయిడ్ నెంబర్‌ను పోస్ట్‌పెయిడ్‌లోకి మార్చాలనుకుంటున్నారా? ఇప్పుడు ఈ పని చేయాలంటే కస్టమర్ కేర్‌కు కాల్ చేయాలి. మీరు కోరుకునే నెట్వర్క్ ఆఫీసుకు వెళ్లాలి. ఫామ్ ఫిల్ చేయాలి. డాక్యుమెంటేషన్ పూర్తైన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తైన తర్వాత కొత్త సిమ్ యాక్టివేట్ అవుతుంది. ఇదంతా చాలా పెద్ద ప్రాసెస్. కనీసం వారం రోజులైనా పడుతుంది. కానీ త్వరలో గైడ్‌లైన్స్ మార్చబోతోంది టెలికాం డిపార్ట్‌మెంట్. కేవలం ఒక్క ఓటీపీతో మీరు ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌కు మారొచ్చు. మీకు కావాల్సిన ప్లాన్ ఎంచుకోవచ్చు. ఇప్పట్లాగా ఆఫీసుకి వెళ్లి, డాక్యుమెంట్స్ ఇచ్చి, వెరిఫికేషన్ చేయించాల్సిన అవసరం లేదు. ఈ గైడ్‌లైన్స్ రెండు వారాల్లో రిలీజ్ కానున్నాయి.

Jio IPL Special Plans: జియో నుంచి కొత్త ప్లాన్స్... ఐపీఎల్ మ్యాచ్‌లు ఫ్రీగా చూడొచ్చు

EPFO: మీ పీఎఫ్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఎంతో ఉమాంగ్ యాప్‌లో తెలుసుకోండిలా

టెలికామ్ డిపార్ట్‌మెంట్ కొత్త గైడ్‌లైన్స్ అమలులోకి వచ్చాయంటే మొబైల్ యూజర్ ప్రీపెయిడ్ నుంచి పోస్ట్‌పెయిడ్‌లోకి సులువుగా మార్చొచ్చు. దీనివల్ల కస్టమర్లకు పెద్ద పని తగ్గినట్టవుతుంది. లేకపోతే కనెక్షన్ పోస్ట్‌పెయిడ్‌లోకి మారేవరకు ఎదురుచూపులు తప్పవు. ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. కస్టమర్లు తమ అడ్రస్ ప్రూఫ్‌ను ఆ కంపెనీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తే చాలు. అంతేకాదు... జమ్మూకాశ్మీర్‌లో ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రీపెయిడ్ సిమ్ కార్డులు పనిచేయవు. పోస్ట్‌పెయిడ్ సిమ్ కార్డులు మాత్రమే పనిచేస్తాయి. కాబట్టి జమ్మూ కాశ్మీర్‌కు వెళ్లే కస్టమర్లు ఓటీపీ ద్వారా తమ సిమ్ కార్డును పోస్ట్‌పెయిడ్‌లోకి ఈజీగా మార్చుకోవచ్చు.
Published by: Santhosh Kumar S
First published: August 25, 2020, 4:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading