హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1పై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్ అయితే సూపర్ అంతే..!

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1పై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్ అయితే సూపర్ అంతే..!

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1పై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్ అయితే సూపర్ అంతే..!

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1పై భారీ డిస్కౌంట్‌.. ఆఫర్ అయితే సూపర్ అంతే..!

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో మాక్‌బుక్‌ ఎయిర్‌ M1పై భారీ డిస్కౌంట్‌ లభించనుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌ (Electronics)పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ (Flipkart Big Billion Days Sale) సందడి మొదలైంది. ఇప్పటికే ప్లస్ మెంబర్స్‌కు ఆఫర్ సేల్ లైవ్‌లోకి వచ్చింది. రేపటి నుంచి సేల్ యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో ఎలక్ట్రానిక్స్‌ (Electronics)పై ఫ్లిప్‌కార్ట్‌ భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. దాదాపు అన్ని కంపెనీలకు చెందిన ప్రొడక్టులపై స్పెషల్ డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో యాపిల్‌ మాక్‌బుక్‌ ఎయిర్‌ M1 (MacBook Air M1) చేరింది. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌లో మాక్‌బుక్‌ ఎయిర్‌ M1పై భారీ డిస్కౌంట్‌ లభించనుంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ చేసిన తాజా ట్వీట్‌లో ఈ వివరాలు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌ 8GB RAM, 256GB స్టోరేజ్‌తో బేస్ మ్యాక్‌బుక్ ఎయిర్ M1 వేరియంట్‌ను రూ.92,900కి విక్రయిస్తోంది. 16GBRAM + 256GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,12,900గా ఉంది. మాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ల్యాప్‌టాప్‌ 2020లో రూ.92,000 ధరతో మార్కెట్లోకి లాంచ్‌ అయింది.

అయితే తాజా ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1 ల్యాప్‌టాప్‌ను రూ.70,000 లోపు సొంతం చేసుకునే అవకాశం ఉందని ముకుల్ శర్మ పేర్కొన్నారు. ఆయన షేర్‌ చేసిన ఫ్లిప్‌కార్ట్‌ లింక్‌లో మ్యాక్‌బుక్ ఎయిర్(M1) 16GB మోడల్‌ను ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2022లో రూ.69,490కి లభిస్తుందని ఉంది. అంతకంటే తక్కువకు దక్కించుకునే అవకాశం ఉందని టిప్‌స్టర్‌ ముకుల్‌ శర్మ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

* మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 స్సెసిఫికేషన్లు

మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 ల్యాప్‌టాప్‌ 2,560×1,600 రిజల్యూషన్‌తో 13.3-అంగుళాల IPS రెటీనా డిస్‌ప్లేతో వస్తుంది. ఈ ల్యాప్‌టాప్ 8-కోర్ CPU, 7/8-కోర్ GPU, 16-కోర్ న్యూరల్ ఇంజిన్‌ ఉన్న Apple M1 చిప్ ద్వారా పని చేస్తుంది. డివైజ్‌ గరిష్టంగా 16GB RAM, 2TB వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఇది కూడా చదవండి :  ఆఫర్ల జాతర.. అమెజాన్ , ఫ్టిప్‌కార్ట్ సేల్స్ లో రూ.40వేలలోపు బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

* మొబైల్స్‌, ల్యాప్‌టాప్స్‌పై డిస్కౌంట్లు

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఏసర్‌ 11th Gen i5, లెనోవో 11th G i3, వివోబుక్‌14 R7, లెనోవోR5 512GB, ఏసర్‌ 11 i3 256GB వంటి ల్యాప్‌టాప్‌లపై వినియోగదారులు ప్రత్యేక డిస్కౌంట్లు అందుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ సందర్భంగా మొబైల్స్‌పై ప్రత్యేక డీల్స్‌ అందుబాటులోకి రానున్నాయి. శాంసంగ్‌ కంపెనీ గెలాక్సీ S21 FE 5G, గెలాక్సీ S22+, గెలాక్సీ F13, గెలాక్సీ F23 5G సహా ప్రీమియం గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై 57 శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించింది. ఈ సేల్‌లో ఒప్పో , పోకో, మొటరోలా, ఇన్ఫినిక్స్‌ వంటి బ్రాండ్‌లపై కూడా భారీ డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Apple, Flipkart, Flipkart Big Billion Days, Tech news

ఉత్తమ కథలు