Good News: భారతీయులకు త్వరలో e-passport... ఫీచర్లు ఇవే

e-passport | ఇ-పాస్‌పోర్టులతో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల దగ్గర వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా సులువుగా, వేగంగా పూర్తవుతుంది. చిప్‌లో 64 కేబీ మెమొరీ ఉంటుంది. అందులో 30 ప్రయాణాలకు సంబంధించిన సమాచారం స్టోర్ అవుతుంది.

news18-telugu
Updated: January 24, 2019, 1:14 PM IST
Good News: భారతీయులకు త్వరలో e-passport... ఫీచర్లు ఇవే
Good News: భారతీయులకు త్వరలో e-passport... ఫీచర్లు ఇవే (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: January 24, 2019, 1:14 PM IST
E-passport... భారత పౌరులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న హైటెక్ పాస్‌పోర్ట్ ఇక త్వరలో రాబోతోంది. ఇ-పాస్‌పోర్ట్ జారీ చేయాలన్న ప్రతిపాదనకు 2017లోనే అడుగులు పడ్డాయి. మొదటి దశలో దౌత్యవేత్తలు, అధికారులకు ఇవ్వాలన్న కసరత్తు జరుగుతోంది. రెండో దశలో పౌరులకు ఇ-పాస్‌పోర్ట్ ఇస్తారు. త్వరలో ఇ-పాస్‌పోర్ట్స్ ఇస్తామని ప్రవాస్ భారతీయ దివస్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా చెప్పడంతో అసలు ఇ-పాస్‌పోర్ట్ ఫీచర్లు ఎలా ఉంటాయన్న ఆసక్తి అందరిలో నెలకొంది.

ఇది కూడా చదవండి: Channel Selector Application: ఛానెళ్ల ఎంపికకు ట్రాయ్ కొత్త అప్లికేషన్... ఇలా సెలెక్ట్ చేసుకోండి

ఇ-పాస్‌పోర్ట్ అంటే ఏంటీ?



క్రెడిట్‌ కార్డ్, డెబిట్ కార్డ్‌లకు ఉన్నట్టుగానే ఇ-పాస్‌పోర్ట్‌లో చిప్ ఉంటుంది. పోస్టల్ స్టాంప్ కన్నా చిన్నగా ఉంటుంది ఈ చిప్. పాస్‌పోర్ట్ హోల్డర్ల పూర్తి వివరాలు, వేలి ముద్రలు ఆ చిప్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఒకవేళ చిప్ పాడైతే పాస్‌పోర్ట్ ఆథెంటికేషన్‌ కుదరదు. ఫిజికల్ పాస్‌పోర్టులోనే ఈ చిప్ ఉంటుంది. కేవలం కొన్ని సెకన్లలోనే చిప్‌లోని వివరాలు రీడ్ చేయొచ్చు. ఇందులో ఉన్న డేటాను రీడ్ చేయొచ్చు తప్ప, ఎవరూ రైట్ చేయడానికి కుదరదు.



e-passport features, what is e-passport, e-passport security features, chip enabled e-passport, chip passport, ఇ-పాస్‌పోర్ట్ ఫీచర్స్, ఇ-పాస్‌పోర్ట్ సెక్యూరిటీ, చిప్ పాస్‌పోర్ట్

ఇది కూడా చదవండి: WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

ఇ-పాస్‌పోర్టులతో ఇమ్మిగ్రేషన్ కౌంటర్ల దగ్గర వెరిఫికేషన్ ప్రక్రియ ఇంకా సులువుగా, వేగంగా పూర్తవుతుంది. చిప్‌లో 64 కేబీ మెమొరీ ఉంటుంది. అందులో 30 ప్రయాణాలకు సంబంధించిన సమాచారం స్టోర్ అవుతుంది. పాస్‌పోర్టుపై ఉండే పేరు, ఇతర వివరాలన్నీ థిక్ ఫాంట్‌తో ఉంటాయి. అమెరికా ప్రభుత్వ ల్యాబరేటరీలో మొదటిసారిగా ఇ-పాస్‌పోర్ట్‌ను పరీక్షించారు.
Loading...
ఇది కూడా చదవండి: Paytm Offer: డబ్బులు లేకపోయినా పేటీఎంలో రూ.60,000 షాపింగ్

నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్(NIC), ఐఐటీ-కాన్పూర్ సంయుక్తంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌తో ఇ-పాస్‌పోర్ట్స్ జారీ చేస్తారు. ఇ-పాస్‌పోర్ట్స్ తయారీ కోసం కావాల్సిన ఎలక్ట్రానిక్ కాంటాక్ట్‌లెస్ ఇన్‌లేస్ సేకరించేందుకు నాసిక్‌లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌కు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. NIC డైరెక్టర్ జనరల్ నేతృత్వంలోని టెక్నికల్ కమిటీ చిప్‌లో ఉండాల్సిన సమాచారానికి సంబంధించి కొన్ని నియమనిబంధనల్ని రూపొందించనుంది. నాసిక్‌లోని ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్‌‌లో ప్రయోగాత్మకంగా ఇ-పాస్‌పోర్ట్ తయారీ, సెక్యూరిటీ ఫీచర్స్ పరిశీలన పూర్తైన తర్వాత ఇ-పాస్‌పోర్ట్ జారీ మొదలవుతుంది.

ఇవి కూడా చదవండి:

IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...

WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ ఇలాగే ఉండబోతోంది
First published: January 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626