హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Zomato: కోల్‌కతా రసగుల్లా, లక్నో కబాబ్... జొమాటోలో ఆర్డర్ చేసి హైదరాబాద్‌కి తెప్పించుకోవచ్చు

Zomato: కోల్‌కతా రసగుల్లా, లక్నో కబాబ్... జొమాటోలో ఆర్డర్ చేసి హైదరాబాద్‌కి తెప్పించుకోవచ్చు

Zomato: కోల్‌కతా రసగుల్లా, లక్నో కబాబ్... జొమాటోలో ఆర్డర్ చేసి హైదరాబాద్‌కి తెప్పించుకోవచ్చు
(image: Zomato)

Zomato: కోల్‌కతా రసగుల్లా, లక్నో కబాబ్... జొమాటోలో ఆర్డర్ చేసి హైదరాబాద్‌కి తెప్పించుకోవచ్చు (image: Zomato)

Zomato Intercity Legends | జొమాటో యూజర్లు ఎక్కడ ఉన్నా దేశంలోని ఎక్కడి నుంచైనా పుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. జొమాటో లేటెస్ట్‌గా ఇంటర్‌సిటీ లెజెండ్స్ (Intercity Legends) పేరుతో సర్వీస్ ప్రారంభమైంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

మీరు ఢిల్లీ లేదా బెంగళూరులో ఉంటున్నారా? హైదరాబాద్ బిర్యానీ మిస్ అవుతున్నారా? జొమాటోలో ఆర్డర్ చేసి హైదరాబాద్ నుంచి బిర్యానీ (Hyderabad Biryani) తెప్పించుకోవచ్చు. మీరు హైదరాబాద్‌లో ఉన్నారా? కోల్‌కతా రసగుల్లా తినాలనిపిస్తుందా? జొమాటో యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ చేస్తే చాలు. మీ ఇంటికి కోల్‌కతా రసగుల్లా వచ్చేస్తుంది. ఇలా మీరు ఎక్కడ ఉన్నా సరే, ఏ ప్రాంతం నుంచైనా ఫుడ్ తెప్పించుకోవచ్చు. ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ అయిన జొమాటో (Zomato) ఇంటర్‌సిటీ ఫుడ్ డెలివరీ సిస్టమ్ ప్రారంభించింది. జొమాటో ప్రారంభించిన ఈ పైలట్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంటర్‌సిటీ లెజెండ్స్ (Intercity Legends) పేరుతో జొమాటో కొత్తగా ఈ సర్వీస్ ప్రారంభించింది.

ఇంటర్‌సిటీ లెజెండ్స్ ప్రాజెక్ట్ ద్వారా జొమాటో భారతదేశంలోని పలు ప్రాంతాల్లోని ఐకానిక్ డిషెస్‌ని దేశంలోని ఎక్కడి కస్టమర్లకైనా అందించనుంది. హైదరాబాద్ బిర్యానీ, కోల్‌కతా రసగుల్లా, లక్నో కబాబ్స్, బెంగళూరు మైసూర్ పాక్, ఓల్డ్ ఢిల్లీ బటర్ చికన్, జైపూర్ ప్యాజ్ కచోరీ... ఇలా ఏ ప్రాంతంలోని విశిష్టమైన ఆహారాన్నైనా జొమాటో కస్టమర్లు తాము ఉన్నచోటికే తెప్పించుకోవచ్చు. జొమాటో యాప్‌లో ఇంటర్‌సిటీ లెజెండ్స్ పేరుతో ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్‌లోకి వెళ్లి ఫుడ్ ఆర్డర్ చేస్తే చాలు. మీరు కోరుకున్న స్పెషల్ ఫుడ్ మీరు కోరుకున్న అడ్రస్‌కు వస్తుంది.

దూరప్రాంతాల నుంచి వచ్చే ఫుడ్ పార్సిల్ కాబట్టి పార్శిల్ రావడానికి కొన్ని గంటల సమయం పడుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని ఆహారపదార్థాలు రావడానికి 24 గంటల సమయం కూడా పట్టొచ్చు. స్వీట్స్ లాంటివాటికైతే 24 గంటల సమయం పట్టినా ఇబ్బందేమీ లేదు. కానీ బిర్యానీ, ఇతర డిషెస్ ఎక్కువ గంటల సమయం పడితే ఫుడ్ ఫ్రెష్‌గా ఎలా ఉంటుందో చూడాలి.

ఇంటర్‌సిటీ లెజెండ్స్‌తో మీరు ఎక్కడ ఉన్నా సరే కోల్‌కతా రసగుల్లా, హైదరాబాద్ బిర్యానీ, బెంగళూరు మైసూర్ పాక్, లక్నో కబాబ్, ఓల్డ్ ఢిల్లీ బటర్ చికెన్, జైపూర్ ప్యాజ్ కచోరీ ఆర్డర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు అని జొమాటో సీఈఓ దీపీందర్ గోయల్ బ్లాగ్‌లో వివరించారు. పార్శిళ్లను ఫ్లైట్‌లో లేదా రోడ్డు మార్గంలో డెలివరీ చేయనుంది జొమాటో. ఫుడ్‌ని రెస్టారెంట్ ఫ్రెష్‌గా రీయూజబుల్, ట్యాంపర్ ప్రూఫ్ కంటైనర్లలో ప్యాక్ చేస్తుందని, ఫ్లైట్‌లో పార్శిల్ వచ్చినప్పుడు సురక్షితంగా ఉంటుందని, మొబైల్ రిఫ్రిజిరేషన్ టెక్నాలజీతో ఫుడ్ భద్రంగా ఉంటుందని, ఫ్రీజ్ చేయడం లేదా ప్రిజర్వేటీవ్స్ యాడ్ చేయాల్సిన అవసరం ఉండదని దీపీందర్ గోయల్ తెలిపారు.

ప్రస్తుతం ఈ సర్వీస్ గుర్గావ్, సౌత్ ఢిల్లీలో మాత్రమే ప్రారంభమైంది. త్వరలో మిగతా ప్రాంతాలకు కూడా ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ ప్రారంభం కానుంది.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Food delivery, Hyderabad biryani, Zomato

ఉత్తమ కథలు