Home /News /technology /

GOOD NEWS FOR YOUTUBE MUSIC APP USERS SMART DOWNLOAD FEATURE WILL AUTOMATICALLY DOWNLOAD YOUR FAVOURITE SONGS SS

YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ యూజర్లకు గుడ్ న్యూస్... స్మార్ట్ డౌన్‌లోడ్ ఫీచర్ వాడుకోండి ఇలా

YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ యూజర్లకు గుడ్ న్యూస్... స్మార్ట్ డౌన్‌లోడ్ ఫీచర్ వాడుకోండి ఇలా

YouTube Music: యూట్యూబ్ మ్యూజిక్ యూజర్లకు గుడ్ న్యూస్... స్మార్ట్ డౌన్‌లోడ్ ఫీచర్ వాడుకోండి ఇలా

YouTube Music | యూట్యూబ్ మ్యూజిక్ యాప్ వాడేవారికోసం సరికొత్త ఫీచర్ వచ్చేసింది. స్మార్ట్ డౌన్‌లోడ్ (Smart Download) ఫీచర్‌ను రిలీజ్ చేసింది యూట్యూబ్ మ్యూజిక్. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

    భారతదేశంలో మ్యూజిక్ స్ట్రీమింగ్ సేవలకు ఫుల్ డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మార్కెట్లోకి యూట్యూబ్ 2019లో అడుగుపెట్టింది. ఇండియాలో యూట్యూబ్ మ్యూజిక్ (YouTube Music) పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న పాపులర్ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో యూట్యూబ్ మ్యూజిక్ ఒకటి. చాలావరకు యాప్స్ ఆర్టిస్ట్ ఒరిజినల్స్, లేబుల్ ఆల్బమ్స్ లాంటి సేవల్ని అందిస్తుంటాయి. యూట్యూబ్ మ్యూజిక్ మాత్రం మ్యూజిక్ కవర్స్ ద్వారా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఆడియన్స్ ప్లేలిస్ట్ ఫీచర్ కూడా అందిస్తోంది. యూజర్లు పాటల్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆఫ్‌లైన్‌లో వినొచ్చు. ఇప్పుడు స్మార్ట్ డౌన్‌లోడ్ పేరుతో మరో అద్భుతమైన ఫీచర్ అందిస్తోంది యూట్యూబ్ మ్యూజిక్.

    యూట్యూబ్ మ్యూజిక్ స్మార్ట్ డౌన్‌లోడ్ ఫీచర్‌తో మీరు ఎక్కువగా వినే పాటలు ఆటోమెటిక్‌గా డౌన్‌లోడ్ అవుతాయి. డౌన్‌లోడ్ అయిన పాటలు స్మార్ట్‌ఫోన్‌లో మెమొరీ కార్డ్ ఉంటే అందులోకి వెళ్తాయి. లేకపోతే ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్‌లోకి వెళ్తాయి. అయితే ఈ ఫీచర్ వాడుకోవాలంటే సెట్టింగ్స్ మార్చాల్సి ఉంటుంది. ఇలాగో తెలుసుకోండి.

    Samsung Galaxy M52: ఈ సాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.8,000 డిస్కౌంట్... అమెజాన్‌లో ఆఫర్

    YouTube Music: స్మార్ట్ డౌన్‌లోడ్ ఫీచర్ వాడుకోండి ఇలా


    Step 1- ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో యూట్యూబ్ మ్యూజిక్ యాప్ ఓపెన్ చేయండి.

    Step 2- టాప్ రైట్ కార్నర్‌లో ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేసి Settings ఓపెన్ చేయండి.

    Step 3- సెట్టింగ్స్‌లో Library and downloads క్లిక్ చేయండి.

    Step 4- ఆ తర్వాత షో డివైస్ ఫైల్స్ ఆప్షన్ ఎనేబుల్ చేయండి.

    Step 5- ఆ తర్వాత Smart downloads ఆప్షన్ ఎనేబుల్ చేయాలి.

    Step 6- ఇక ఆటోమెటిక్‌గా పాటలు డౌన్‌లోడ్ అవుతాయి.

    Vivo V23 5G: వివో వీ23 సేల్ మొదలైంది... రూ.2,500 డిస్కౌంట్, మరిన్ని ఆఫర్స్

    యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో స్మార్ట్ డౌన్‌లోడ్ ఫీచర్‌తో 500 వరకు పాటల్ని డౌన్‌లోడ్ చేయొచ్చు. మీ ఫేవరెట్, మోస్ట్ ప్లేడ్ సాంగ్స్ అన్నీ డౌన్‌లోడ్ అవుతాయి. మీరు వైఫై నెట్వర్క్‌కి కనెక్ట్ అవగానే పాటలు డౌన్‌లోడ్ అవుతాయి. డౌన్‌లోడ్ అయిన పాటల్లో మీకు నచ్చనివి ఉంటే Remove Download ఆప్షన్ ద్వారా డిలిట్ చేయొచ్చు. మీరు యూట్యూబ్‌లో వీడియోస్‌ని లైక్ చేస్తే చాలు. ఆ పాటలు యూట్యూబ్ మ్యూజిక్‌లో డౌన్‌లోడ్ అవుతాయి. మొత్తం ప్లేలిస్ట్ కూడా డౌన్‌లోడ్ చేయొచ్చు. ప్లేలిస్ట్ పైన ట్యాప్ చేసి డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Music, Youtube

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు