యూట్యూబ్‌లో కంటెంట్ ద్వారా డబ్బు సంపాదించవచ్చనే సంగతి అందరికి తెలిసిందే. వీడియోలు, వ్లాగ్స్‌ను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తూ.. యాడ్స్ ద్వారా ఆదాయం పొందవచ్చు. ఇప్పటికే ఎంతోమంది ఔత్సాహికులు, మిలియన్ల మంది ఫాలోవర్లను సాధించడంతో పాటు.. మంచి సంపదను కూడా ఆర్జిస్తున్నారు. తాజాగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించేలా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 'సూపర్ థ్యాంక్స్' అనే ఈ ఫీచర్‌ను ఉపయోగించి యూట్యూబర్లు మరింత డబ్బు సంపాదించే అవకాశాన్ని కల్పించింది. ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో మంగళవారం ఈ కొత్త అప్‌డేట్‌ను సంస్థ ప్రారంభించింది.
ఇప్పటికే షార్డ్ వీడియో యాప్ టిక్ టాక్, ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్ ఫాంలు వీడియో కంటెంట్ క్రియేటర్ల కోసం భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ క్రమంలో యూట్యూబ్ కొత్త అప్‌డేట్లు, ఫీచర్లపై దృష్టి పెట్టింది. యూట్యూబర్లు వారి వీక్షకుల నుంచి డబ్బు సంపాదించే మార్గాల్లో సూపర్ థ్యాంక్స్ ఫీచర్ నాలుగోది అవుతుంది. అభిమానులు కృతజ్ఞత భావాన్ని తెలియజేయడానికి.. తమ అభిమాన యూట్యూబ్ ఛానెల్స్‌కు ఆర్థిక సాయం అందించడానికి సూపర్ థ్యాంక్స్ ఫీచర్‌ను ఫాలోవర్లు కొనుగోలు చేయవచ్చు. దీని విలువ 2 నుంచి 50 డాలర్ల వరకు ఉంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. దీని ద్వారా కంటెంట్ క్రియేటర్ల ఆదాయ మార్గాలు పెరగనున్నాయి.
Samsung Galaxy M21 2021: సాంసంగ్ గెలాక్సీ ఎం21 కొత్త మోడల్ వచ్చేసింది... ధర ఎంతంటే
Dual WhatsApp: స్మార్ట్‌ఫోన్‌లో ఈ సెట్టింగ్స్ మారిస్తే రెండు వాట్సప్ అకౌంట్స్ వాడుకోవచ్చు
ఈ ఫీచర్ 68 దేశాల్లో వేలాది మంది కంటెంట్ క్రియేటర్లకు అందుబాటులో ఉంటుంది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో అర్హత పొందిన కంటెంట్ క్రియేటర్లందరికీ ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. ఛానెల్ మెంబర్‌షిప్స్ ద్వారా అభిమానులు ప్రత్యేకమైన కంటెంట్ కోసం డబ్బు చెల్లించవచ్చు. లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్ వీడియోలో కూడా వీక్షకులు సూపర్ ఛాట్స్ కోసం డబ్బు చెల్లించేందుకు కామెంట్ విభాగంలో పిన్ చేయవచ్చు.
Unlimited Data Plans: అన్‌లిమిటెడ్ డేటా కావాలా? Jio, Airtel, Vi, BSNL ప్లాన్స్ ఇవే
Earphones: ఆ ఇయర్‌ఫోన్స్ ధర రూ.1,29,990... షాకయ్యారా? ఎందుకో తెలుసుకోండి
ఇటీవల సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కంటెట్ క్రియేటర్లపై దృష్టి సారించింది. 2022 చివరి నాటికి కంటెంట్ క్రియేటర్ల కోసం ఒక బిలియన్ డాలర్లు (దాదాపు రూ.7400 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. టిక్ టాక్, యూట్యూబ్ లాంటి వీడియో ప్లాట్‌ఫామ్స్‌తో పోటీ పడాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. పోటో షేరింగ్ నెట్‌వర్క్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ యాప్స్‌లో కొన్ని టార్గెట్లు, మైలురాళ్లను అధిగమించిన కంటెంట్ క్రియేటర్లకు బోనస్ చెల్లించడానికి.. కంటెంట్ ప్రొడ్యూస్ చేసే యూజర్లకు నిధులు సమకూర్చడానికి ఈ పెట్టుబడులను కేటాయిస్తున్నట్లు ఫేస్‌బుక్ పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Youtube