Xiaomi: షావోమీ, రెడ్‌మీ ఫోన్లు వాడుతున్నారా? మీకు గుడ్ న్యూస్

Xiaomi MIUI 11 | యూజర్లకు ఇబ్బందిగా మారిన యాడ్స్ విషయంలో వెనక్కు తగ్గాలని, MIUI 11 అప్‌గ్రేడ్‌లో యాడ్స్ తగ్గించాలని షావోమీ నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: June 10, 2019, 9:41 AM IST
Xiaomi: షావోమీ, రెడ్‌మీ ఫోన్లు వాడుతున్నారా? మీకు గుడ్ న్యూస్
హాంకాంగ్‌కు చెందిన షావోమీకి భారత్‌ పెద్ద స్మార్ట్ ఫోన్ల మార్కెట్. 90 మిలియన్ల యూజర్లు ఉన్నారు.
  • Share this:
షావోమీ... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అతి తక్కువకాలంలోనే సంచలనాలు సృష్టించిన బ్రాండ్. ఇండియాలో షావోమీ, రెడ్‌మీ, పోకో సిరీస్ ఫోన్‌లను రిలీజ్ చేస్తోంది షావోమీ. షావోమీ స్మార్ట్‌ఫోన్లలో ఆ కంపెనీకి చెందిన యూజర్ ఇంటర్‌ఫేస్ MIUI ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అదనంగా మరిన్ని ఫీచర్లు అందించే ఇంటర్‌ఫేస్ ఇది. MIUI యూజర్లను బాగానే ఆకట్టుకుంటున్నా... అందులో ప్రధానంగా ఓ సమస్య ఉంది. అదే యాడ్స్. షావోమీ రిలీజ్ చేసిన అన్ని స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాడ్స్ కాస్త ఇరిటేటింగ్‌గా ఉంటాయి. ఈ యాడ్స్ తమకు తలనొప్పిగా మారాయని యూజర్లు అనేకసార్లు కంప్లైంట్స్ చేశారు కూడా. దయచేసి యాడ్స్ ఆపెయ్యాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. దీంతో షావోమీ కాస్త దిగివచ్చింది. త్వరలో ఈ యాడ్స్ సమస్యల్ని పరిష్కరిస్తామని షావోమీ కంపెనీ సీఈఓ లీ జున్ ప్రకటించారు.

యూజర్లకు ఇబ్బందిగా మారిన యాడ్స్ విషయంలో వెనక్కు తగ్గాలని, MIUI 11 అప్‌గ్రేడ్‌లో యాడ్స్ తగ్గించాలని షావోమీ నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగానే MIUI 11 అప్‌డేట్ రూపొందిస్తుంది. యూజర్లకు MIUI 11 అప్‌గ్రేడ్ అయిన తర్వాత ఇక యాడ్స్ వీలైనంత తక్కువగా కనిపిస్తాయి. అంతేకాదు... షావోమీ స్మార్ట్‌ఫోన్లల్లో వల్గర్ యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయన్న కంప్లైంట్స్ కూడా ఉన్నాయి. వాటిపైనా కంపెనీ దృష్టిపెట్టింది. అశ్లీలమైన, చికాకుపర్చే యాడ్స్ విషయంలో కఠిన చర్యలు తీసుకునే ఆలోచనలో ఉంది. వెబ్ బ్రౌజర్ ఇలాంటి యాడ్స్, నోటిఫికేషన్స్ పుష్ చేస్తుందని గుర్తించిన షావోమీ... వాటిని కంట్రోల్ చేసే పనిలో ఉంది. ఇదంతా పూర్తయ్యేసరికి కనీసం రెండు మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది.

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

UPI Apps: గూగుల్ పే, ఫోన్‌పే వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Mobile Insurance: మీ స్మార్ట్‌ఫోన్‌కు ఇన్స్యూరెన్స్ ఎందుకు అవసరమో తెలుసా?Credit Card: క్రెడిట్ కార్డులో ఈ 5 ఫీచర్లు మీకు తెలుసా?
Published by: Santhosh Kumar S
First published: June 10, 2019, 9:41 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading