Windows 11: ఉచితంగా మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఓఎస్... డౌన్‌లోడ్ ఎలా చేయాలంటే

Windows 11: ఉచితంగా మైక్రోసాఫ్ట్ విండోస్ 11 ఓఎస్... డౌన్‌లోడ్ ఎలా చేయాలంటే

Windows 11 | మైక్రోసాఫ్ట్ ఇటీవల విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. విండోస్ 11 ఓఎస్‌ను ఎలా డౌన్‌లోడ్ చేయాలో తెలుసుకోండి.

  • Share this:
ఈ రోజుల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల వాడకం సాధారణమైపోయింది. వీటిని ఉపయోగిస్తున్నారంటే తప్పకుండా ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టం) గురించి ఐడియా ఉండే ఉంటుంది. ప్రపంచంలో చాలా వరకు విండోస్ OSనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటివరకు మైక్రోసాఫ్ట్ నుంచి విడుదలైన అన్ని ఓఎస్ లు విజయవంతమయ్యాయి. త్వరలో ఈ సంస్థ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంను విడుదల చేయనుంది. మీరు ఇప్పటికే విండోస్ 10ను ఉపయోగిస్తుంటే.. కొత్త ఓఎస్‌ను ఉచితంగా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. విండోస్ 10 మాదిరిగానే దీన్ని సులభంగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని రిక్వైర్మెంట్స్ అదనంగా ఉంటాయి. ప్రస్తుతానికి విండోస్ 11 ఓఎస్ రిలీజ్ డేట్‌పై స్పష్టత లేదు. ఈ ఏడాది చివర్లోగాని లేదా 2022 ప్రారంభంలో కానీ ఇది విడుదలయ్యే అవకాశముంది.

మీరు తుది వర్షన్ వచ్చే వరకు వేచి ఉండలేకపోతే ఈ విధానాన్ని అనుసరించాలి. ఇప్పటికే మీరు విండోస్ ఇన్ సైడర్ ప్రోగ్రాంలో మెంబర్ అయితే.. ఈ రోజే విండోస్ 11 ఇన్ సైడర్ ప్రివ్యూ బిల్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా విడ్జెట్లు, స్నాప్ లేఅవుట్లు, వర్చువల్ డెస్క్‌టాప్ లాంటి కొన్ని ప్రత్యేక ఫీచర్లను పరీక్షించవచ్చు. ఈ కొత్త సాఫ్ట్‌వేర్ గురించి మీరు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.

Dangerous Apps: స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్... వెంటనే ఈ 9 యాప్స్ డిలిట్ చేయండి

Nothing Ear 1: కాసేపట్లో నథింగ్ ఇయర్ 1 ఇయర్‌బడ్స్ ప్రీ-ఆర్డర్ సేల్

ముందుగా మీరు ప్రస్తుతం వాడుతున్న విండోస్ 10 పీసీ.. విండోస్ 11 ఫ్రీ అప్ గ్రేడ్‌కు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలంటే మైక్రోసాఫ్ట్ సైట్‌ను సందర్శించాలి. ఒకవేళ మీరు కొత్త కంప్యూటర్ తీసుకుంటే, ఆ పీసీని ఉచితంగా కొత్త ఓఎస్‌కు అప్ గ్రేడ్‌ చేసుకోవచ్చు.

విండోస్ 11 ఇన్ సైడర్ ప్రివ్యూ బిల్డ్‌ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి


మీరు విండోస్ ఇన్‌సైడర్ ప్రోగ్రాంలో మెంబర్ అయితే ఇప్పుడే విండోస్ 11 ఫస్ట్ ఇన్‌సైడర్ ప్రివ్యూను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ బీటా వెర్షన్లలో కొన్ని బగ్స్ ఉంటాయి. మీరు ప్రైమరీ డివైజ్‌లో బీటా వెర్షన్ డౌన్ లోడ్ చేయకూడదు. కేవలం టెస్టర్ డివైజ్ ఉంటే మాత్రమే డౌన్ లోడ్ చేసుకోవాలి. ఇప్పటికీ విండోస్ 11ను ప్రయత్నిద్దామనుకుంటున్నారా..? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

Oppo F17: రూ.16,990 విలువైన స్మార్ట్‌ఫోన్ రూ.1,990 ధరకే... ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వివరాలివే

Android Feature: స్మార్ట్‌ఫోన్ యూజర్ల కోసం కొత్త ఫీచర్... ఇక స్క్రీన్‌షాట్ తీయండి ఇలా

మీరు లైసెన్స్ కలిగిన విండోస్ 10ను డివైజ్‌లో వాడటంతో పాటు మీరు ఆ డివైజ్‌కు అడ్మినిస్ట్రేటరై ఉండాలి. విండోస్ ఇన్ సైడర్ ప్రోగ్రాంలో మెంబర్ కాకాపోతే జాయిన్ అయ్యేందుకు రిజిస్టర్ చేసుకోవాలి. లేదా విండోస్ ఇన్ సైడర్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. అనంతరం సెట్టింగ్స్‌లో అప్డేట్ అండ్ సెక్యురిటీ.. ఆ తరువాత విండోస్ ఇన్ సైడర్ ప్రోగ్రాంకు వెళ్లాలి. ఇక్కడ ‘పిక్ యాన్ అకౌంట్ టూ గెట్ స్టార్టెడ్’ ఆప్షన్‌ కింద, మీరు నమోదు చేసుకున్న మైక్రోసాఫ్ట్ అకౌంట్‌ను కనెక్ట్ చేయడానికి '+' ఎంచుకోండి.

ఇన్ సైడర్ ప్రివ్యూ బిల్డ్‌ను డెవలపర్ల కోసం అభివృద్ధి చేసిన ‘డెవ్ ఛానెల్‌’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత ప్రైవసీ స్టేట్మెంట్లు, షరతులు రివ్యూ చేసి కన్ఫార్మ్ పై, అనంతరం ‘రీస్టార్ట్ నౌ’పై క్లిక్ చేయాలి. రీస్టార్ట్ అయిన తర్వాత మీ డేటా సెట్టింగ్స్ సరైనవని నిర్ధారించుకోండి. తద్వారా మీరు ప్రివ్యూ బిల్డ్ లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అండ్ డయాగ్నోస్టిక్స్, ఫీడ్ బ్యాక్ విభాగానికి వెళ్లి, ‘ఆప్షనల్‌ డయాగ్నోస్టిక్ డేటా’ స్విచ్ ఆన్ చేయాలి. అనంతరం సెట్టింగ్స్ అండ్ అప్డేట్‌లో విండోస్ అప్డేట్‌కు వెళ్లాలి. చెక్ ఫర్ ద అప్డేట్స్ బటన్ క్లిక్ చేయాలి. ఎంచుకున్న సెట్టింగ్స్ ఆధారంగా తాజా ఇన్ సైడర్ ప్రివ్యూ బిల్డ్‌ను చూడాలి. ఆ తరువాత ఇతర విండోస్ అప్డేట్ల మాదిరిగానే డివైజ్‌ను అప్డేట్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published: