Home /News /technology /

GOOD NEWS FOR WHATSAPP USERS SOON WHATSAPP GROUP ADMINS CAN DELETE ANYONES MESSAGE IN GROUP SS

WhatsApp: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త... మీ కోసమే ఈ ఫీచర్

WhatsApp: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త... మీ కోసమే ఈ ఫీచర్
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు శుభవార్త... మీ కోసమే ఈ ఫీచర్ (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp | వాట్సప్ గ్రూప్ అడ్మిన్లకు ఇప్పటికే అనేక ఫీచర్స్ (WhatsApp Features) వచ్చాయి. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రిలీజ్ చేస్తోంది వాట్సప్. ఇప్పటికే కొందరు యూజర్లు ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నారు.

మెటా సంస్థకు చెందిన వాట్సప్ నుంచి మరో అద్భుతమైన ఫీచర్ (WhatsApp Features) వచ్చేసింది. వాట్సప్ నిత్యం కొత్త కొత్త ఫీచర్స్‌ని టెస్ట్ చేస్తూ ఉంటుంది. వాటిని ముందుగా బీటా యూజర్లకు రిలీజ్ చేసి ఆ తర్వాత యూజర్లందరికీ విడుదల చేస్తోంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను వాట్సప్ తీసుకొచ్చింది. సాధారణంగా వాట్సప్ గ్రూప్‌లో ఎవరైనా మెసేజ్ చేస్తే ఆ మెసేజ్‌ను ఇతరులు డిలిట్ చేయలేరు. ఎవరైతే మెసేజ్ చేశారో వాళ్లే ఆ మెసేజ్ డిలిట్ చేయొచ్చు. అయితే వాట్సప్ తీసుకొచ్చిన కొత్త ఫీచర్‌తో గ్రూప్ అడ్మిన్లకు ఎవరి మెసేజ్‌నైనా డిలిట్ చేసే అధికారం లభిస్తోంది. ఈ విషయాన్ని వాట్సప్ ఫీచర్స్ గురించి ఎప్పటికప్పుడు తెలిపే WABetaInfo వెల్లడించింది.

వాట్సప్ గ్రూప్‌లో వచ్చే మెసేజెస్ ఒక్కోసారి గ్రూప్ సభ్యుల మధ్య అభిప్రాయబేధాలకు కారణం అవుతుంటాయి. కొన్నిసార్లు వాట్సప్ గ్రూప్స్‌లో వచ్చే మెసేజెస్ గ్రూప్ అడ్మిన్లను చిక్కుల్లో పడేస్తుంటాయి. వారిని జైలుకు కూడా పంపిస్తుంటాయి. అందుకే గ్రూప్ అడ్మిన్లకు వాట్సప్ గ్రూప్‌పై మరింత కంట్రోల్ తీసుకొచ్చేందుకు వాట్సప్ లేటెస్ట్‌గా ఈ ఫీచర్ రూపొందించింది. ఇప్పటికే ఈ ఫీచర్ బీటాటెస్టర్లకు అందుబాటులోకి వచ్చేసింది.

Realme Pad X: రియల్‌మీ ట్యాబ్ సేల్ ప్రారంభం... ఎస్‌బీఐ కార్డుతో రూ.2,000 డిస్కౌంట్

మీరు వాట్సప్ బీటా టెస్టర్ అయితే మీ యాప్ అప్‌డేట్ చేసి ఈ ఫీచర్ ఉపయోగించవచ్చు. మీరు ఏదైనా గ్రూప్ అడ్మిన్‌గా ఉన్నట్టైతే ఆ గ్రూప్‌లో వచ్చే ఏ మెసేజ్‌నైనా డిలిట్ చేసే అధికారం మీకు లభిస్తుంది. మీకు ఈ ఫీచర్ వచ్చిందో లేదో తెలుసుకోవాలనుకుంటే, మీరు అడ్మిన్‌గా ఉన్న గ్రూప్‌లో ఏదైనా మెసేజ్‌ను లాంగ్ ప్రెస్ చేయండి. డిలిట్ చేసే ఆప్షన్ కనిపిస్తే మీకు ఈ ఫీచర్ లభించినట్టే. గ్రూప్ అడ్మిన్లు ఏదైనా మెసేజ్ డిలిట్ చేస్తే ఆ విషయం ఆ గ్రూప్‌లో ఉన్నవారందరికీ తెలుస్తుంది.

ఇక వాట్సప్ ఇటీవల మెసేజెస్ డిలిట్ చేసే టైమ్ లిమిట్‌ను రెండు రోజుల 12 గంటల వరకు పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు కేవలం ఒక గంట లిమిట్ మాత్రమే ఉండేది. ఇవే కాదు... మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని టెస్ట్ చేస్తోంది వాట్సప్. వాట్సప్ త్వరలో అఫీషియల్ ఛాట్ ఏర్పాటు చేయనుంది. వాట్సప్ రిలీజ్ చేయబోయే కొత్త ఫీచర్స్ గురించి, వాట్సప్ టిప్స్, ట్రిక్స్ గురించి వెరిఫైడ్ ఛాట్‌లో సమాచారం అందించనుంది.

Mobile Offer: తొలిసారి రూ.10,000 లోపే ఈ స్మార్ట్‌ఫోన్ సేల్... 6GB వరకు ర్యామ్, 50MP కెమెరా, 5,000mAh బ్యాటరీ



వాట్సప్ స్టేటస్‌లో టెక్స్‌ట్, ఫోటో, వీడియో మాత్రమే కాదు, వాయిస్ నోట్స్‌ని కూడా అప్‌డేట్ చేసే అవకాశం రాబోతోంది. ఈ ఫీచర్‌కు వాయిస్ స్టేటస్ అని పేరు పెట్టింది వాట్సప్. కొద్ది రోజుల క్రితం వాట్సప్ మెసేజెస్‌కి ఎమోజీస్‌తో రియాక్ట్ అయ్యే ఫీచర్ రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆరు ఎమోజీస్ మాత్రమే ఉన్నా త్వరలో మరిన్ని ఎమోజీస్ రానున్నాయి. త్వరలో రెండు మొబైల్స్‌లో ఒకే వాట్సప్ అకౌంట్ ఓపెన్ చేసేలా మార్పులు చేయబోతోంది వాట్సప్.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Whatsapp, Whatsapp tricks

తదుపరి వార్తలు