దిగ్గజ టెక్ సంస్థ మెటా పరిధిలోని వాట్సప్ వరుసగా లేటెస్ట్ ఫీచర్‌లను అందిస్తోంది. ఈ కంపెనీ అందించనున్న కొత్త అప్‌డేట్స్ లిస్ట్‌లో మరో ఫీచర్ చేరింది. దీని ద్వారా వినియోగదారులకు చాట్ బ్యాకప్ కష్టాలను తొలగించనుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు సులువుగా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని వాట్సప్ కల్పించనుంది. త్వరలోనే ‘చాట్ ట్రాన్స్‌ఫర్’(Chat Transfer) అనే ఫీచర్‌ని అందించేందుకు సిద్ధమవుతోంది. ఈ ‘చాట్ ట్రాన్స్‌ఫర్’ ఫీచర్ అంటే ఏంటి? ఇదెలా పనిచేస్తుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.
చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ ద్వారా వినియోగదారులు సులువుగా మెసేజ్‌లను స్టోర్ చేసుకోవచ్చు. దీని ద్వారా యూజర్లు తమ చాట్ హిస్టరీని ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మరో ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కేవలం లోకల్ నెట్‌వర్క్ ద్వారానే ఈ టాస్క్ కంప్లీట్ చేయవచ్చు. తద్వారా యూజర్లు తమ మెసేజ్‌లను సులువుగా భద్రపరుచుకోవచ్చు.
WhatsApp: ఉబర్ క్యాబ్ వాట్సప్‌లో బుక్ చేయొచ్చు ఇలా
చాట్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్‌ని వినియోగించడానికి వాట్సప్ ప్రత్యేక పద్ధతిని తీసుకురానుంది. ఓ క్యూఆర్(QR Code) ద్వారా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయగలిగేలా ఫీచర్‌ని ఎనేబుల్ చేయనుంది. యూజర్లు తమ డేటాని ఏ స్మార్ట్‌ఫోన్‌కి సెండ్ చేయాలని అనుకుంటున్నారో.. ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. దీంతో ప్రస్తుతం వినియోగిస్తున్న డివైజ్ నుంచి చాట్ హిస్టరీ కొత్త డివైజ్‌లోకి బదిలీ అవుతుంది. దీనికి ఎలాంటి క్లౌడ్ సర్వీసును వినియోగించాల్సిన అవసరం లేదు.
సాధారణంగా వాట్సప్ మెసేజ్‌లను, డేటాను భద్రపరుచుకోవాలంటే బ్యాకప్ చేసుకోవాల్సిందే. అలా చేసుకుంటేనే ఇతర ఫోన్‌లో మళ్లీ ఆ డేటాను డౌన్‌లోడ్ చేసుకోగలం. అయితే ఇది కొందరికి కాస్త శ్రమతో కూడుకున్న పని. సమయం కూడా వృథా అవుతుంటుంది. ఓపికగా కొత్త డివైజ్‌లోకి డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆ డేటాను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇకపై ఈ ఇబ్బందులు ఉండవు. ‘చాట్ ట్రాన్స్‌ఫర్’ దీనికి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది. యూజర్లు తమ డేటాను డ్రైవ్‌లోకి, క్లౌడ్ సర్వీసుల్లోకి అప్‌లోడ్ చేయాల్సిన పని ఉండదు. కేవలం వేరే డివైజ్‌ల్లోకి ట్రాన్స్‌ఫర్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. కొత్త ఫోన్‌ని కొనుగోలు చేసినప్పుడు, వేరే ఫోన్‌లో వాట్సప్ లాగిన్ అయినప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
Samsung Galaxy F04: రూ.8,000 లోపు సాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ ... ఫీచర్స్ ఇవే
వాట్సప్ బీటాఇన్ఫో(WAbetainfo) ప్రకారం.. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. భవిష్యత్తులో తీసుకొచ్చే అప్డేట్‌లలో భాగంగా ఈ ఫీచర్ అందించనున్నారు. మరోవైపు వాట్సప్ ప్రాక్సీ(Proxy) ఫీచర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు విధించిన సందర్భాల్లో కూడా వాట్సప్ వినియోగించుకునేలా ప్రాక్సీ ఫీచర్ పని చేస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Android, Ios, Smartphone, Whatsapp