GOOD NEWS FOR WHATSAPP USERS SEND MONEY USING WHATSAPP PAYMENTS AND GET UP TO RS 105 CASHBACK SS
WhatsApp: వాట్సప్ నుంచి మూడు సార్లు క్యాష్‌బ్యాక్... రూ.105 పొందండి ఇలా
WhatsApp: వాట్సప్ నుంచి మూడు సార్లు క్యాష్‌బ్యాక్... రూ.105 పొందండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
WhatsApp | వాట్సప్ తమ యూజర్లకు క్యాష్‌బ్యాక్ ఇస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సార్లు వాట్సప్ నుంచి క్యాష్‌బ్యాక్ (WhatsApp Cashback Offer) పొందొచ్చు.
ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సప్ భారతదేశంలో పేమెంట్ సేవల్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. వాట్సప్ పేమెంట్స్ (WhatsApp Payments) పేరుతో ఇండియాలో పేమెంట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. వాట్సప్ పేమెంట్స్ ఉపయోగించేవారికి క్యాష్‌బ్యాక్ (WhatsApp Cashback) ఇస్తోంది వాట్సప్. ఇండియాలో గూగుల్ పే (Google Pay) సేవలు ప్రారంభం అయినప్పుడు కూడా ఇలాగే క్యాష్‌బ్యాక్స్‌తో కస్టమర్లను ఆకట్టుకుంది గూగుల్. ప్రస్తుతం గూగుల్ క్యాష్‌బ్యాక్స్ తగ్గించి రివార్డ్స్ ఎక్కువగా ఇస్తోంది. ఇక పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్స్ సేవల్లో పట్టు పెంచుకోవడం కోసం వాట్సప్ క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ప్రకటిస్తోంది.
వాట్సప్ పేమెంట్స్ ఉపయోగించినవారు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ముగ్గురు వేర్వేరు కాంటాక్ట్స్‌కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే రూ.35 చొప్పున క్యాష్‌బ్యాక్ ఇవ్వనుంది వాట్సప్. ఇలా మూడు సార్లు రూ.35 చొప్పున మొత్తం రూ.105 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. అయితే ఒకే యూజర్‌కు మూడు సార్లు డబ్బులు పంపిస్తే ఒకసారి మాత్రమే క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. వేర్వేరు యూజర్లకు వేర్వేరు సందర్భాల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. వాట్సప్ పేమెంట్స్ యూజర్ల ట్రాన్సాక్షన్ విజయవంతం అయిన తర్వాత రూ.35 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఈ ఆఫర్ పొందాలంటే కనీసం 30 రోజులుగా వాట్సప్ యూజర్ అయి ఉండాలి. వాట్సప్ పేమెంట్స్ సర్వీస్ యాక్టివేట్ చేసి ఉండాలి. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్ వివరాలు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక మీరు డబ్బులు పంపే వ్యక్తి కూడా వాట్సప్ యూజర్ అయి ఉండాలి. వాట్సప్ పేమెంట్స్ యాక్టివేట్ చేసి ఉండాలి. మరి వాట్సప్‌లో డబ్బులు ఎలా పంపాలో తెలుసుకోండి.
Step 1- ముందుగా వాట్సప్ ఓపెన్ చేయండి.
Step 2- త్రీ డాట్స్ పైన క్లిక్ చేయండి.
Step 3- Payments పైన క్లిక్ చేయండి.
Step 4- Send Payment పైన క్లిక్ చేయండి.
Step 5- ఆ తర్వాత మీరు డబ్బులు పంపాలనుకుంటున్న కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేయండి..
Step 6- వాళ్లు ఇప్పటికే వాట్సప్ పే రిజిస్టర్ చేసినట్టైతే మీకు గిఫ్ట్ ఐకాన్ కనిపిస్తుంది.
Step 7- ఒకవేళ గిఫ్ట్ ఐకాన్ కనిపించకపోతే వారిని వాట్సప్ పేమెంట్స్‌లో జాయిన్ కావాలని లింక్ పంపాలి.
Step 8- ఆ తర్వాత పేమెంట్ ప్రాసెస్ ప్రారంభించాలి.
Step 9- కాంటాక్ట్‌ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ పంపాలనుకుంటున్నారో ఎంటర్ చేయాలి.
మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకున్న మొత్తం మీ అకౌంట్ నుంచి డెబిట్ అయి వారి అకౌంట్లోకి వెళ్తుంది. మీకు రూ.35 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇలా ముగ్గురికి డబ్బులు పంపి మీరు మొత్తం రూ.105 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.