Home /News /technology /

GOOD NEWS FOR WHATSAPP USERS NOW ADD LOCATION STICKER ON WHATSAPP STATUS KNOW HOW SS

WhatsApp Status: వాట్సప్ స్టేటస్ పెడుతుంటారా? ఈ ట్రిక్ మీకు తెలుసా?

WhatsApp Status: వాట్సప్ స్టేటస్ పెడుతుంటారా? ఈ ట్రిక్ మీకు తెలుసా?
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Status: వాట్సప్ స్టేటస్ పెడుతుంటారా? ఈ ట్రిక్ మీకు తెలుసా? (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Status | వాట్సప్ స్టేటస్ పెట్టేవారి కోసం మరిన్ని ఫీచర్స్ (WhatsApp Features) అందిస్తోంది వాట్సప్. రోజూ స్టేటస్ అప్‌డేట్ చేస్తూ యాక్టీవ్‌గా ఉండేవారిని ఈ ఫీచర్స్ ఆకట్టుకుంటాయి. స్టేటస్‌ని మరింత ఇంట్రెస్టింగ్ మార్చొచ్చు.

వాట్సప్ అందించిన పాపులర్ ఫీచర్స్‌లో స్టేటస్ (WhatsApp Status) ఫీచర్ కూడా ఒకటి. రోజూ స్టేటస్ అప్‌డేట్ చేసేవారు ఉంటారు. ఏ చిన్న విషయం ఉన్నా స్టేటస్ ద్వారా చెప్పాలనుకుంటారు. రోజులో నాలుగైదు సార్లు స్టేటస్ అప్‌డేట్ చేసేవాళ్లు ఉంటారు. ఇక స్టేటస్ అప్‌డేట్ చేయకపోయినా స్టేటస్‌లో ఎవరేమీ యాడ్ చేశారో చూసే అలవాటు కూడా చాలామందిలో ఉంటుంది. ఇలా వాట్సప్ స్టేటస్ ఫీచర్ పాపులర్ అయింది. అయితే వాట్సప్ స్టేటస్‌కు సంబంధించి అన్ని ట్రిక్స్ తెలిసినవారు తక్కువ. వాట్సప్‌లో ఇటీవల స్టేటస్ ఫీచర్‌కు మరిన్ని మెరుగులు దిద్దింది. యూజర్లు వాట్సప్ స్టేటస్‌లో లొకేషన్ కూడా యాడ్ చేయొచ్చు.

వాట్సప్ స్టేటస్‌లో లొకేషన్ యాడ్ చేయడం ఇన్‌స్టాగ్రామ్ స్టిక్కర్ ఐకాన్ (Instagram sticker icon) లాగా పనిచేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ లాగానే వాట్సప్ కూడా స్టిక్కర్ ఐకాన్ తీసుకొచ్చింది. మీరు మీ ప్రస్తుత లొకేషన్ లేదా ఏదైనా లొకేషన్‌ను స్టేటస్‌గా పెట్టొచ్చు. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. మరి మీ వాట్సప్ స్టేటస్‌లో లొకేషన్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకోండి.

Smartphone Offer: ఆ ఆఫర్ మళ్లీ వచ్చింది... ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్

ఆండ్రాయిడ్ యూజర్లు లొకేషన్ యాడ్ చేయాలి ఇలా


Step 1- ముందుగా వాట్సప్ ఓపెన్ చేయాలి.

Step 2- స్టేటస్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

Step 3- కెమెరా ఐకాన్ ఓపెన్ చేసి గ్యాలరీ నుంచి మీరు స్టేటస్ పెట్టాలనుకున్న ఫోటో లేదా వీడియో సెలెక్ట్ చేయాలి.

Step 4- పైన కనిపించే ఆప్షన్స్‌లో ఎమొజీ ఐకాన్ పైన క్లిక్ చేయాలి.

Step 5- అందులో Content Stickers సెక్షన్‌లో లొకేషన్, టైమ్ ఉంటాయి.

Step 6- లొకేషన్, టైమ్ రెండూ యాడ్ చేయొచ్చు.

Step 7- లొకేషన్ సెలెక్ట్ చేసిన తర్వాత లొకేషన్ సెర్చ్ చేసి యాడ్ చేయాలి.

ఐఫోన్ యూజర్లు కూడా దాదాపు ఇవే స్టెప్స్ ఫాలో కావాలి. అయితే వాట్సప్ స్టేటస్‌లో లొకేషన్ యాడ్ చేయాలంటే ముందుగా మీరు వాట్సప్ యాప్‌కు మీ లొకేషన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. లొకేషన్ మాత్రమే కాదు టైమ్, స్టిక్కర్స్, ఎమొజీ లాంటివి కూడా స్టేటస్‌లో ఇలాగే యాడ్ చేయొచ్చు. ఇకపై ఈ కొత్త ఫీచర్ ట్రైచేసి చూడండి.

WhatsApp: మీ వాట్సప్ మెసేజెస్ లీకవుతున్నాయని డౌటా? ఇలా చేయండి

వాట్సప్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫీచర్స్‌ని రిలీజ్ చేస్తూనే ఉంది. ఇటీవల రియాక్షన్స్ ఫీచర్‌ను యూజర్లకు అందించింది వాట్సప్. వాట్సప్‌లో ఏదైనా మెసేజ్‌కు రియాక్షన్స్ ద్వారా స్పందించవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌లో ఆరు రకాల రియాక్షన్స్ అందుబాటులో ఉన్నాయి. లైక్, లవ్, లాఫ్, సర్‌ప్రైజ్, సాడ్, థ్యాంక్స్ ఎమోజీలు ఉన్నాయి. ఏ మెసేజ్‌కి అయినా మీ రియాక్షన్‌ని వీటి ద్వారా తెలపొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Whatsapp, Whatsapp tricks

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు