హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp Update: వాట్సప్ నుంచి కొత్త యాప్... ఇలా డౌన్‌లోడ్ చేయాలి

WhatsApp Update: వాట్సప్ నుంచి కొత్త యాప్... ఇలా డౌన్‌లోడ్ చేయాలి

WhatsApp Update: వాట్సప్ నుంచి కొత్త యాప్... ఇలా డౌన్‌లోడ్ చేయాలి
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Update: వాట్సప్ నుంచి కొత్త యాప్... ఇలా డౌన్‌లోడ్ చేయాలి (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp Update | వాట్సప్ నుంచి కొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. విండోస్ యూజర్ల కోసం ఈ కొత్త యాప్‌ను రూపొందించింది వాట్సప్.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

వాట్సప్ నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. 'డివైస్‌లను లింక్ చేయడం' సులభతరం చేసేందుకు వాట్సప్ కొత్త యాప్‌ను ప్రకటించింది. ఒక యూజర్ గరిష్టంగా నాలుగు డివైజ్‌లతో వాట్సప్‌ని లింక్ చేయొచ్చు. ఫోన్ ఆఫ్‌లైన్‌లో ఉన్నా ఛాట్స్ సింక్ అవుతాయి. ఇప్పుడు మీరు వాట్సప్‌ని నాలుగు పరికరాలకు లింక్ చేయవచ్చని, తద్వారా మీ ఫోన్ ఆఫ్‌లైన్‌లోకి వెళ్లినా మీ చాట్‌లు సింక్ చేయబడతాయని, ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయని వాట్సప్ తెలిపింది. డివైజ్‌ల లింక్ మరింత సులభతరం చేయడానికి, మేము విండోస్ కోసం పూర్తిగా కొత్త యాప్‌ని సృష్టించామని వివరించింది. వేగవంతమైన లోడింగ్, సుపరిచితమైన ఇంటర్‌ఫేస్‌తో, పరికరాల మధ్య చాటింగ్ అనుభవాన్ని ఎంజాయ్ చేయొచ్చని వాట్సప్ చెబుతోంది.

వాట్సప్ యూజర్లు కొత్త విండోస్ యాప్‌ని https://whatsapp.com/download లింక్‌లో డౌన్‌లోడ్ చేయొచ్చు. ఈ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఆండ్రాయిడ్ , ఐఓఎస్, విండోస్ యాప్స్ లింక్స్ వేర్వేరుగా కనిపిస్తాయి. విండోస్ లింక్ పైన క్లిక్ చేసి వాట్సప్ యాప్ డౌన్‌లోడ్ చేయొచ్చు. ఇక వాట్సప్ తాజాగా మరో రెండు ఫీచర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Vivo V27: వివో వీ27 సేల్ ప్రారంభం... ఇయర్‌ఫోన్స్ ఉచితం

వాట్సప్ గ్రూప్స్ కోసం కొత్త ఫీచర్స్ వచ్చాయి. వాట్సప్ గ్రూప్‌లో ఎవరు చేరాలన్నదానిపై అడ్మిన్లకు మరింత నియంత్రణ రాబోతోంది. గ్రూప్‌లో ఎవరు చేరాలో నిర్ణయించే సామర్థ్యాన్ని గ్రూప్ అడ్మిన్లకు లేటెస్ట్ ఫీచర్ అందిస్తుంది. అడ్మిన్ తమ గ్రూప్ ఇన్విటేషన్ లింక్‌ని షేర్ చేయడానికి లేదా వారి గ్రూప్‌ను కమ్యూనిటీలో చేరేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఇక ఏ గ్రూప్‌లో మీరు ఇతరులతో కామన్‌గా ఉన్నారో తెలుసుకోవడం కూడా సులభతరం చేస్తోంది వాట్సప్. ఇందుకోసం పేరుతో సెర్చ్ చేస్తే చాలు. రాబోయే వారాల్లో ఈ ఫీచర్లు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.

ఇక ఇంతకుముందే వాట్సప్ నుంచి కొత్త అప్‌డేట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో గ్రూప్‌లో సభ్యుల సంఖ్యను పెంచడం, గ్రూప్‌లో ఏ మెసేజ్‌నైనా డిలిట్ చేసే అధికారం గ్రూప్ అడ్మిన్లకు ఇవ్వడం లాంటి ఫీచర్స్ ఉన్నాయి. అంతేకాదు ఒరిజినల్ క్వాలిటీ ఫోటోలు, వీడియోలను ఒకేసారి 100 ఫైల్స్ షేర్ చేసే ఫీచర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ బీటా వర్షన్ యూజర్లకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.

Moto G73 5G: కాసేపట్లో మోటో జీ73 5జీ సేల్... 8GB ర్యామ్, సరికొత్త ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీ

వాట్సప్ యూజర్లు క్యూఆర్ కోడ్స్ ద్వారా ఛాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసే ఫీచర్ కూడా బీటా యూజర్లకు లభించింది. బీటా యూజర్లు ఈ ఫీచర్స్ టెస్ట్ చేసిన తర్వాత యూజర్లందరికీ ఫీచర్స్ అందుబాటులోకి వస్తాయి.

First published:

Tags: Smartphone, Whatsapp, Windows

ఉత్తమ కథలు