Vodafone Idea: ఆ ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.50 డిస్కౌంట్ ప్రకటించిన వొడాఫోన్ ఐడియా

Vodafone Idea: ఆ ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.50 డిస్కౌంట్ ప్రకటించిన వొడాఫోన్ ఐడియా (ప్రతీకాత్మక చిత్రం)

Vodafone Idea | మీరు వొడాఫోన్ ఐడియా-Vi కస్టమరా? చాలాకాలంగా రీఛార్జ్ చేయట్లేదా? సరికొత్త ఆఫర్ ప్రకటించింది వొడాఫోన్ ఐడియా-Vi.

  • Share this:
    వొడాఫోన్ ఐడియా-Vi కస్టమర్లకు శుభవార్త. ఓ ప్రీపెయిడ్ ప్లాన్‌పై డిస్కౌంట్ ప్రకటించింది కంపెనీ. రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌పై రూ.50 డిస్కౌంట్ ప్రకటించింది. గత 90 రోజులుగా రీఛార్జ్ చేయనివారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్ చేస్తే ప్రతీ రోజు 1.5జీబీ మొబైల్ డేటా లభిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. అన్‌లిమిటెడ్ కాల్స్ చేయొచ్చు. ఈ ప్లాన్‌లో వీకెండ్ రోల్ ఓవర్ డేటా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే వారంలో మొదటి ఐదు రోజులు మీరు ఉపయోగించని డేటాను వీకెండ్‌లో ఉపయోగించుకోవచ్చు. ఉదాహరణకు మొదటి ఐదు రోజులు రోజూ 1.5జీబీ డేటా చొప్పున మొత్తం 7.5జీబీ డేటా లభిస్తుంది. మీరు అందులో 2.5జీబీ డేటా మాత్రమే ఉపయోగించారనుకుందాం. మిగతా 5జీబీ డేటాను వీకెండ్‌లో ఉపయోగించుకోవచ్చు. అంటే శని, ఆదివారాల్లో లభించే 3జీబీ డేటాతో పాటు అదనంగా 5జీబీ డేటా వాడుకోవచ్చు. ఇక వీఐ మూవీస్, టీవీ లాంటివాటిని యాక్సెస్ చేయొచ్చు. రూ.249 ప్లాన్‌ను రూ.50 డిస్కౌంట్‌తో రీఛార్జ్ చేయాలంటే కస్టమర్లు MyVi.in వెబ్‌సైట్ లేదా, వీఐ యాప్‌లో లాగిన్ అయిన తర్వాత రికమండెడ్ ప్లాన్స్ సెక్షన్‌లో ఆఫర్ వివరాలు చెక్ చేయాలి.

    Poco M3: రూ.10,000 లోపే 6GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్... పోకో ఎం3 ప్రత్యేకతలు ఇవే

    New Smartphones in 2021: కొత్త ఫోన్ కొనాలా? 2021లో రిలీజైన స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే వొడాఫోన్ ఐడియా యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 5జీబీ వరకు అదనంగా డేటా లభిస్తుంది. రూ.149 రీఛార్జ్ చేస్తే 2జీబీ డేటా, రూ.199 రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా, రూ.219 రీఛార్జ్ చేస్తే 2జీబీ డేటా, రూ.249 రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా, రూ.399 రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా, రూ.599 రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా, రూ.1499, రూ.2599 ప్రీపెయిడ్ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే 50జీబీ డేటా అదనంగా లభిస్తుంది. అయితే ఈ ఆఫర్ వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో పొందినవారికి మాత్రమే అడిషనల్ డేటా ఆఫర్ వర్తిస్తుంది. ఇక ఇటీవల వూట్ సెలెక్ట్ ప్రీమియం కంటెంట్‌ను తమ కస్టమర్లకు ఉచితంగా అందిస్తోంది వొడాఫోన్ ఐడియా. సాధారణంగా వూట్ సెలెక్ట్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే నెలకు రూ.99, ఏడాదికి రూ.399 చెల్లించాల్సి ఉంటుంది.
    Published by:Santhosh Kumar S
    First published: