news18-telugu
Updated: May 6, 2020, 11:09 AM IST
Vodafone: రోజూ 2జీబీ డేటా ఫ్రీగా ఇస్తున్న వొడాఫోన్... ఎవరికంటే
(ప్రతీకాత్మక చిత్రం)
వొడాఫోన్ యూజర్లకు శుభవార్త. లాక్డౌన్ కారణంగా ఇళ్లల్లో ఉంటున్న యూజర్లకు రోజూ ఉచితంగా 2జీబీ డేటా అందిస్తోంది వొడాఫోన్. ఇప్పటికే కొందరు యూజర్లకు రోజూ 2జీబీ డేటా క్రెడిట్ అవుతోంది. అంతేకాదు అన్లిమిటెడ్ కాలింగ్ ఫెసిలిటీ కూడా లభిస్తోంది. కేవలం 7 రోజులు మాత్రమే ఈ ఆఫర్ అందిస్తోంది వొడాఫోన్. అయితే ఈ బెనిఫిట్స్ కొద్ది మందికి మాత్రమే లభిస్తోంది. మరి మీకు కూడా ఈ బెనిఫిట్స్ లభిస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి 121363 నెంబర్‌కు డయల్ చేయాలి. మీరు ఈ ఆఫర్‌కు ఎలిజిబుల్ అయితే మీకు కంపెనీ నుంచి ఎస్ఎంఎస్ వస్తుంది. ఒకవేళ మీకు ఈ ఆఫర్ వర్తించకపోతే వాయిస్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది.
ఇక ఇప్పటికే వొడాఫోన్ ఐడియా డబుల్ డేటా ప్లాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.299, రూ.449, రూ.699 రీఛార్జ్ చేసిన వారికి డబుల్ డేటా లభిస్తుంది. ప్రతీ ప్లాన్‌పై రోజూ 4 జీబీ డేటా లభిస్తుంది. అన్లిమిటెడ్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. రూ.299 ప్లాన్ వేలిడిటీ 28 రోజులు, రూ.449 ప్లాన్ వేలిడిటీ 56 రోజులు. రూ.699 ప్లాన్ వేలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్స్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం వొడాఫోన్ వెబ్సైట్ లేదా యాప్ చూడండి.
ఇవి కూడా చదవండి:
Amazon Pay Later: కస్టమర్లకు వడ్డీ లేకుండా అప్పు ఇస్తున్న అమెజాన్
Xiaomi Mi 10: షావోమీ ఎంఐ 10 వచ్చేస్తోంది... మే 8న రిలీజ్
Prepaid Plans: జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ నుంచి మీకు బెస్ట్ ప్లాన్స్ ఇవే
Published by:
Santhosh Kumar S
First published:
May 6, 2020, 11:09 AM IST