HOME »NEWS »TECHNOLOGY »good news for video lovers vr option is arrived in youtube

వీడియో లవర్స్‌కి గుడ్‌న్యూస్... యూట్యూబ్‌లో ‘VR’ ఆప్షన్...

వీడియో లవర్స్‌కి గుడ్‌న్యూస్... యూట్యూబ్‌లో ‘VR’ ఆప్షన్...
నమూనా చిత్రం

వీక్షకుల కోసం ‘వీఆర్’ ఆప్షన్ తీసుకొచ్చిన యూట్యూబ్... ఖర్చు లేకుండా వర్చువల్ రియాలిటీ ఆస్వాదించే అద్భుత అవకాశం...

  • Share this:
    సంచలన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి సృష్టించిన అద్భుత దృశ్యకావ్యం ‘బాహుబలి’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘వీఆర్’ టెక్నాలజీని కూడా వాడుకున్నాడు జక్కన్న. మాహిష్మతి రాజ్యం సెట్స్‌కు సంబంధించిన వివరాలను తెలుపుతూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశాడు రాజమౌళి. వీఆర్ బాక్స్‌లో పెట్టుకుని చూస్తే సెట్స్‌లోకి వెళ్లి, ప్రత్యేక్షంగా చూస్తున్నట్టే ఉంటుంది. మనం ఎటు తిరిగితే అటు వైపు ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి. ఇంతటి టెక్నాలజీని ఆస్వాదించే అవకాశం అందరికీ దక్కలేదు. వీఆర్ సెట్‌అప్ కొనలేక బాధపడిన వారికి... ఇప్పుడు ఆ అనుభూతిని ఉచితంగా ఆస్వాదించవచ్చు.

    అవును... యూట్యూబ్‌లో ‘వీఆర్’ ఆప్షన్ వచ్చేసింది. ఏ వీడియోనైనా వర్చువల్ రియాలిటీ చూసే అద్భుత అవకాశం యూట్యూబ్ వీక్షకులకు అందిస్తోంది. రూ. 200 నుంచి రూ. 2000 దాకా విలువ చేసే ‘వీఆర్ బాక్సులు’ ఉంటే చాలు... వీడియో చూడడంలో కొత్త అనుభూతిని ఆస్వాదించవచ్చు. వీఆర్ బాక్స్‌లో మొబైల్ పెట్టుకుని, వీడియో ప్లే చేస్తే మనం ఎటు తిరిగితే అటు వైపు ఉన్న దృశ్యాలు కనిపిస్తాయి. ‘బాహుబలి’ లాంటి యుద్ధ సన్నివేశాలైతే మన కళ్ల ముందే జరుగుతున్న ఫీలింగ్ తెప్పించడం ఈ వీఆర్ టెక్నాలజీ ప్రత్యేకత. సొంతంగా ‘వీఆర్ బాక్స్’ సెటప్ తయారుచేసుకోవడం ఎలాగో కూడా యూట్యూబ్‌లో వీడియోలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే పైసా ఖర్చు లేకుండా సరికొత్త టెక్నాలజీని ఎంజాయ్ చేయవచ్చు.

    Published by:Ramu Chinthakindhi
    First published:November 28, 2018, 18:02 pm

    टॉप स्टोरीज