Good News: మీ వాట్సప్‌‌ని కలర్‌ఫుల్‌గా మార్చే ఫీచర్ వచ్చేస్తోంది

WhatsApp Themes | వాట్సప్ యూజర్లకు కస్టమ్ థీమ్స్ లభించనున్నాయి. వాటిలో తమకు నచ్చిన థీమ్‌ని సెలెక్ట్ చేసుకొని వాట్సప్‌ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

news18-telugu
Updated: August 29, 2019, 10:14 AM IST
Good News: మీ వాట్సప్‌‌ని కలర్‌ఫుల్‌గా మార్చే ఫీచర్ వచ్చేస్తోంది
Good News: మీ వాట్సప్‌‌ని కలర్‌ఫుల్‌గా మార్చే ఫీచర్ వచ్చేస్తోంది (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: August 29, 2019, 10:14 AM IST
వాట్సప్ యూజర్లకు శుభవార్త. మీ వాట్సప్‌ని అద్భుతంగా మార్చే కొత్తకొత్త పీచర్లు రాబోతున్నాయి. వాట్సప్ వెబ్‌లో కూడా స్టిక్కర్స్, ఆల్బమ్స్ లాంటి ఫీచర్స్ తీసుకురాబోతోంది కంపెనీ. అంతేకాదు ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు వాట్సప్‌ మరింత కలర్‌ఫుల్‌గా మారబోతోంది. వాట్సప్ యూజర్లు త్వరలో తమకు నచ్చినట్టుగా థీమ్స్ మార్చుకోవచ్చు. వాట్సప్‌కు సంబంధించిన ప్రతీ సమాచారాన్ని ముందే ప్రపంచానికి తెలిపే WABetaInfo ఈ విషయాన్ని వెల్లడించింది. WABetaInfo సమాచారం ప్రకారం వాట్సప్ యూజర్లకు కస్టమ్ థీమ్స్ లభించనున్నాయి. వాటిలో తమకు నచ్చిన థీమ్‌ని సెలెక్ట్ చేసుకొని వాట్సప్‌ని మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చు.

వాట్సప్‌ను రకరకాల థీమ్స్‌తో కలర్‌ఫుల్‌గా మార్చేందుకు యూజర్లు ఇప్పటికే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తున్నారు. ప్లేస్టోర్‌లో ఇలాంటి యాప్స్ అనేకం ఉన్నాయి. ఒకవేళ వాట్సప్ స్వయంగా థీమ్స్ అందిస్తే థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించాల్సిన అవసరం లేదు. వాట్సప్ అందించే థీమ్స్‌లోనే ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్ యూజర్లకు ఎప్పట్లోగా అందుబాటులోకి వస్తుందో తెలియదు. మరోవైపు డార్క్ మోడ్ ఫీచర్ అందించేందుకు వాట్సప్ కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఉన్న టాప్ యాప్స్‌లో మనం డార్క్ మోడ్ చూడొచ్చు. వాట్సప్ కూడా తమ యూజర్లకు డార్క్ మోడ్ అందించనుంది. వాట్సప్ బీటా యూజర్లు డార్క్ మోడ్‌ను పరిశీలిస్తున్నారు.

Mi A3: అద్భుతమైన ఫీచర్లతో షావోమీ ఎంఐ ఏ3 రిలీజ్... ఎలా ఉందో చూడండి




ఇవి కూడా చదవండి:

Oppo Reno 2: ఒప్పో నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్స్ వచ్చేశాయి... ఫీచర్స్ ఇవే

Realme XT: రియల్‌మీ ఎక్స్‌టీ... 64 మెగాపిక్సెల్ కెమెరా స్మార్ట్‌ఫోన్... తొలిసారి ఇండియాలో రిలీజ్
Loading...
Smartphone: ఎంఐ ఏ3, రియల్‌మీ 5 ప్రో, మోటోరోలా వన్ యాక్షన్... ఈ మూడు ఫోన్లల్లో ఏది బెటర్?
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...