హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

WhatsApp: వాట్సప్‌లో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు... స్టెప్స్ ఇవే

WhatsApp: వాట్సప్‌లో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు... స్టెప్స్ ఇవే

WhatsApp: వాట్సప్‌లో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు... స్టెప్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp: వాట్సప్‌లో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు... స్టెప్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

WhatsApp | క్యాబ్ బుక్ చేయడానికి ప్రత్యేకంగా యాప్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సప్‌లోనే క్యాబ్ బుక్ (Cab Booking) చేసుకోవచ్చు. ఉబర్ ఈ సర్వీస్ ప్రారంభించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

ఒకప్పుడు వాట్సప్ కేవలం ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ మాత్రమే. కానీ ఇప్పుడు వాట్సప్ అనేక సేవలకు కేంద్రంగా మారుతోంది. బ్యాంకింగ్ సర్వీస్ నుంచి షాపింగ్ వరకు అన్ని రకాల సేవల్ని వాట్సప్‌లోనే పొందొచ్చు. వాట్సప్‌లో గ్రాసరీ ఆర్డర్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ (Bank Account Balance) చెక్ చేసుకోవచ్చు. డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ (Money Transfer) చేయొచ్చు. ఇలా అనేక రకాల సేవలు వాట్సప్‌లో అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా వాట్సప్‌లోనే క్యాబ్ బుక్ (Cab Booking) చేసుకునే సర్వీస్ ప్రారంభమైంది. ఉబర్ యాప్ యూజర్లు వాట్సప్‌లోనే ఈజీగా క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ అందించడానికి వాట్సప్‌తో చాలాకాలం క్రితమే ఒప్పందం చేసుకుంది ఉబర్.

వాట్సప్‌లో ఉబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొదట ఢిల్లీ-ఎన్‌సీఆర్, లక్నోలో వాట్సప్ ద్వారా ఉబర్ క్యాబ్ బుక్ చేసుకునే సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. త్వరలో దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. వాట్సప్ యూజర్లు సింపుల్ స్టెప్స్‌తో ఉబర్ క్యాబ్ బుక్ చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

WhatsApp: న్యూ ఇయర్‌కు ముందు షాక్... ఈ 49 స్మార్ట్‌ఫోన్లలో వాట్సప్ పనిచేయదు

వాట్సప్‌లో ఉబర్ క్యాబ్ బుక్ చేయండిలా

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో +91 7292000002 నెంబర్ సేవ్ చేయాలి.

ఆ తర్వాత వాట్సప్‌లో ఈ నెంబర్ ఓపెన్ చేసి Hi అని మెసేజ్ చేయాలి.

ఆ తర్వాత పికప్ అండ్ డ్రాప్ వివరాలు ఎంటర్ చేయాలి.

అందుబాటులో ఉన్న ఉబర్ క్యాబ్స్, ఫేర్ వివరాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.

మీరు కన్ఫామ్ చేస్తే క్యాబ్ బుక్ అవుతుంది.

బుకింగ్ కన్ఫర్మేషన్ వివరాలు వాట్సప్‌లోనే వస్తాయి.

Jio True 5G: ఏపీలో జియో ట్రూ 5జీ సేవలు... మీ స్మార్ట్‌ఫోన్‌లో వాడుకోండి ఇలా

బుకింగ్ చేసిన తర్వాత ఏవైనా మార్పులు ఉంటే వాట్సప్‌లోనే చేయొచ్చు. ట్రిప్ రిసిప్ట్ కూడా వాట్సప్ ద్వారా పొందొచ్చు. ప్రస్తుతం ఇంగ్లీష్, హిందీ భాషల్లో వాట్సప్ సేవల్ని అందిస్తోంది ఉబర్. త్వరలోనే మరిన్ని భాషల్లో సేవలు అందుబాటులోకి వస్తాయి. ఇదే కాదు ఇలా వాట్సప్‌లో అనేక సేవలు అందుబాటులోకి వచ్చాయి. ట్రైన్ టికెట్ బుక్ అయిందో లేదో వాట్సప్‌లో తెలుసుకోవచ్చు. ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి.

ముందుగా మీ ఫోన్‌లో రైలోఫై వాట్సప్ ఛాట్‌బాట్ నెంబర్ +91-9881193322 సేవ్ చేయండి.

మీ వాట్సప్ యాప్ ఓసారి అప్‌డేట్ చేయండి.

వాట్సప్ ఓపెన్ చేసి కాంటాక్ట్ లిస్ట్‌లో రైలోఫై ఛాట్‌బాట్ నెంబర్ సెర్చ్ చేయండి.

ఛాట్ విండో ఓపెన్ చేసి మీ 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయండి.

ఆ పీఎన్ఆర్ నెంబర్‌కు సంబంధించిన వివరాలన్నీ వాట్సప్ మెసేజ్‌లో వస్తాయి.

First published:

Tags: Cab services, Uber, Whatsapp

ఉత్తమ కథలు