Twitter Log In: ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక ఇలా కూడా లాగిన్ కావొచ్చు

Twitter Log In: ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్... ఇక ఇలా కూడా లాగిన్ కావొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)

Twitter Log In | ట్విట్టర్ యూజర్లకు శుభవార్త. ఇకపై మీరు గూగుల్ అకౌంట్, ఐఓఎస్ అకౌంట్‌తో లాగిన్ కావొచ్చు. ఎలాగో తెలుసుకోండి.

  • Share this:
కాలం మారుతున్న కొద్దీ డిజిటల్ ప్లాట్ ఫాంల మధ్య పోటీ పెరుగుతోంది. ఈ పోటీని తట్టుకునేలా తమ ప్లాట్ ఫాంలను యూజర్ ఫ్రెండ్లీగా మార్చేందుకు అన్ని సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. తాజాగా మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. లాగిన్ ఫీచర్లను మరింత సులభతరం చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై ట్విట్టర్ యూజర్లు యాపిల్ ఐడీ లేదా గూగుల్ అకౌంట్ ద్వారా కూడా ట్విట్టర్‌కు లాగిన్ కావచ్చు. ప్రస్తుతం బీటా స్టేజ్‌లో ఉన్న ఈ సర్వీస్ త్వరలోనే అందరికీ అందుబాటులోకి రానుంది. అయితే ఇప్పటికే ఉన్న యూజర్లు తమ గూగుల్ లేదా యాపిల్ అకౌంట్‌లు.. ట్విట్టర్‌తో అనుసంధానం చేసిన ఈమెయిల్ ఐడీలు ఒకేలా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ విభిన్నంగా ఉంటే లాగిన్ ఎర్రర్ చూపుతుంది.

Price Hike: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ కొనేవారికి షాక్... రెండు మోడళ్ల ధరలు పెంచిన షావోమీ

UMANG App: పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలా? ఉమాంగ్ యాప్‌లో అప్లై చేయండి

దీని గురించి మరిన్ని వివరాలను ట్విట్టర్ సపోర్ట్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఇందులో ట్విట్టర్ యూజర్లు ఎవరైనా తమ గూగుల్ లేదా యాపిల్ ఖాతా ద్వారా ట్విట్టర్లో లాగిన్ కావచ్చని చెప్పుకొచ్చింది. ప్రస్తుతానికి గూగుల్ లింక్ చేసిన అకౌంట్‌తో ట్విట్టర్ యాప్, ట్విట్టర్ వెబ్ రెండూ ఉపయోగించవచ్చు. అయితే యాపిల్ అకౌంట్ లింక్ చేస్తే మాత్రం కేవలం ఐఓఎస్ డివైజెస్‌లో ఉన్న యాప్‌లో మాత్రమే ఉపయోగించగలుగుతారు. త్వరలోనే వెబ్ వెర్షన్, వెబ్ యాప్, కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ట్విట్టర్ ప్రకటించింది.

Vivo Y72 5G: మీ పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేస్తే రూ.2,000 లోపే 5జీ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు... ఆఫర్ వివరాలివే

Smartphone: స్మార్ట్‌ఫోన్ పోయిందా? వెంటనే ఇలా చేయడం మర్చిపోవద్దు

ప్రస్తుతానికి గూగుల్ అకౌంట్‌తో లాగిన్ అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్, డెస్క్ టాప్ యాప్, వెబ్ బ్రౌజర్లలో ట్విట్టర్‌ను ఉపయోగించుకునే వీలుంది. దీని ద్వారా సైన్ అప్ ప్రక్రియ చాలా సులభతరమైంది. కేవలం ఈమెయిల్ అడ్రస్, పాస్ వర్డ్, పేరు, యూజర్ హ్యాండిల్ ఎంచుకుంటే సరిపోతుంది. కొత్తగా సైన్ అప్ అవ్వాలనుకునేవారికి ఇవన్నీ ట్విట్టర్ హోమ్ పేజీలోనే కనిపిస్తాయి. దీని తర్వాత యూజర్లు కేవలం తమ భాషను, స్మార్ట్‌ఫోన్ కాంటాక్ట్స్‌ను ఎంచుకుంటే సరిపోతుంది. అవసరం అనుకుంటే తమ గూగుల్ లేదా యాపిల్ అకౌంట్‌ను డిస్ కనెక్ట్ చేయడానికి కూడా వీలుంది. అయితే ప్రస్తుతం ఇది కేవలం వెబ్ వెర్షన్ ద్వారానే చేయడానికి వీలు ఉంది. త్వరలోనే అన్ని డివైజ్‌లకు ఈ సేవలను విస్తరించేందుకు ట్విట్టర్ ప్రయత్నిస్తోందట.
Published by:Santhosh Kumar S
First published: