GOOD NEWS FOR TWITTER USERS NOW MAKE MONEY WITH TWITTER SUPER FOLLOWS FEATURE SS GH
Twitter: ఇక ట్విట్టర్లో కూడా డబ్బులు సంపాదించొచ్చు... ఎలాగో తెలుసుకోండి
Twitter: ఇక ట్విట్టర్లో కూడా డబ్బులు సంపాదించొచ్చు... ఎలాగో తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)
Twitter Super Follows | ట్విట్టర్ యూజర్లకు గుడ్ న్యూస్. ట్విట్టర్ సూపర్ ఫాలోస్ (Twitter Super Follows) ఫీచర్ ద్వారా కంటెంట్ క్రియేటర్లు (Content Creators) డబ్బు సంపాదించొచ్చు. ఎలాగో తెలుసుకోండి.
సోషల్ మీడియాలో (Social Media) అంతా ఉచితం ఇది ఒకప్పుడు. అయితే ఇప్పుడు తరం మారింది. ఇప్పుడు ప్రీమియం కంటెంట్‌కు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. దీంతో డిఫరెంట్ కంటెంట్, ఎక్స్‌క్లూజివ్ కంటెంట్ కావాల్సిన వాళ్లు డబ్బులు ఇచ్చి మరీ చూస్తున్నారు. మరోవైపు, ఇది ఎంతో మందికి డబ్బులు సంపాదించుకునే వారధిలా మారింది. అలా యూట్యూబ్ (Youtube), ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల (OTT Platform) ద్వారా అనేక మంది డబ్బులు సంపాదిస్తున్న విషయాన్ని గమనించవచ్చు. చాలా మంది తమకు నచ్చిన విభాగాన్ని ఎంచుకొని యూట్యూబ్ వీడియోలు చేస్తూ డబ్బులు సంపాదించేస్తున్నారు. ఇలా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించేవారి సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగింది.
తాజాగా ట్విటర్ (Twitter) కూడా ఇలాంటి ఆలోచనే ఒకటి చేసింది. తమ యూజర్లు డబ్బులు సంపాదించే అవకాశాన్ని కల్పిస్తోంది. చాలా కాలంగా ఊరిస్తూ వచ్చిన ‘సూపర్ ఫాలోస్’ ఫీచర్‌ను అంతర్జాతీయంగా లాంచ్ చేసింది. అయితే, ట్విటర్లో ఈఫీచర్ అందరికీ అందుబాటులో ఉండదు. ట్విటర్లోఉండే కంటెంట్ క్రియేటర్స్ కోసం ఈ ‘సూపర్ ఫాలోస్’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అంటే వీరిని ఫాలో అవ్వాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలా డబ్బులు చెల్లించిన వారిని సూపర్ ఫాలోవర్స్ అంటారు. వారిని స్పెషల్ కంటెంట్ ఇస్తారు. దీని ద్వారా ట్విటర్ స్టార్స్ బాగానే డబ్బులు సంపాదించుకునే అవకాశం వస్తుంది. అయితే ఏ పోస్టు ఫాలోవర్లకు, ఏది సూపర్ ఫాలోవర్లకు అనేదిక్రియేటర్ ఎంచుకుంటారు. యాడ్స్, ప్రమోషన్స్ లాంటివి లేకుండా డబ్బులు సంపాదించుకునే సరికొత్త మార్గంగా దీన్ని ట్విట్టర్ పేర్కొంది.
నటులు, మేకప్ ఆర్టిస్ట్‌లు, క్రీడాకారులు, క్రీడా నిపుణులు తమకు సంబంధించిన స్పెషల్ వీడియోలు, బిహైండ్ ది సీన్స్ వీడియోలు పోస్ట్ చేయడం ద్వారా ట్విట్టర్లో డబ్బులు సంపాదించవచ్చు. వారి కోసమే ఈసూపర్ ఫాలవోర్స్నుఅందుబాటులోకి తెచ్చింది.దీంతోపాటు సోషల్ యాక్టివిస్ట్‌లు, జర్నలిస్ట్, మ్యూజిషీయన్, రైటర్స్, గేమర్స్, జ్యోతిషులు, బ్యూటీ ఎక్స్పర్ట్స్, కమెడియన్స్ లాంటివాళ్లు కూడా దీన్ని వాడొచ్చు.
అంతేకాకుండా సాధారణ ఫాలోవర్ల కంటే ముందే ఎర్లీ యాక్సెస్ బేసిస్‌లో కంటెంట్‌ను ముందుగా ఇవ్వొచ్చు అంటున్నారు. అయితే, ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే క్రియేటర్స్ ముందుగా మూడు డాలర్ల నుండి పది డాలర్ల వరకు ట్విట్టర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సూపర్ ఫాలోవర్స్ ఆప్షన్ ద్వారా క్రియేటర్స్ తమ ఫాలోవర్లకు ఇంకాస్త దగ్గరవ్వొచ్చని ట్విటర్ చెబుతోంది. దాని వల్ల వారి ఎంగేజ్మెంట్ కూడా పెరుగుతుందని పేర్కొంది. దాంతోపాటు డబ్బులు కూడా వస్తాయి. సూపర్ ఫాలోవర్ల కోసం యూనిక్ కంటెంట్‌ను క్రియేట్ చేసే దిశగా ట్విటర్ పావులు కదుపుతోంది. గత కొన్నేళ్లుగా ఈ ఫీచర్‌ను బీటా టెస్టింగ్ చేస్తూ వచ్చిన ట్విటర్... ఉత్తర అమెరికాలో కొంతమంది ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొచ్చింది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.