GOOD NEWS FOR THOSE WHO WANT TO BUY A SMARTPHONE ONEPLUS 9 SERIES PHONES AT RS 5 THOUSAND DISCOUNT GH VB
OnePlus 9 5G: స్మార్ట్‌ఫోన్ కొనాలనుకొనే వారికి గుడ్‌న్యూస్.. వన్‌ప్లస్ 9 సిరీస్ ఫోన్లపై రూ. 5 వేల డిస్కౌంట్..
ప్రతీకాత్మకచిత్రం
భారత మార్కెట్లో వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ మార్చి 31న అధికారికంగా విడుదల కానుంది. అయితే, దీని లాంచింగ్‌కు ముందే, కంపెనీ మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వన్‌ప్లస్ 9 ప్రో ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
వన్‌ప్లస్(OnePlus) లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ 10 ప్రో లాంచింగ్‌కు సమయం ఆసన్నమైంది. భారత మార్కెట్లో వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్(Smart Phone) మార్చి 31న అధికారికంగా విడుదల కానుంది. అయితే, దీని లాంచింగ్‌కు ముందే, కంపెనీ(Company) మరో అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. వన్‌ప్లస్ 9 ప్రో(One Plus 9 Pro) ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో మోడళ్లు భారత మార్కెట్లో రూ. 5,000 తక్కువ ధరకే లభిస్తాయి. వన్‌ప్లస్ 9 5G కొత్త ధరలు ఇప్పటికే కంపెనీ వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ఇండియా పోర్టల్‌లో అప్డేట్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ వేరియంట్లను రూ. 5,000 డిస్కౌంట్ పై కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 9 కొత్త ధర
వన్‌ప్లస్ 9 5G బేస్ మోడల్ 8GB RAM మోడల్‌పై రూ. 5 వేల ధర తగ్గింది. తద్వారా ఇది కేవలం రూ. 44,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. 12GB RAM టాప్-ఎండ్ మోడల్ రూ. 49,999 వద్ద అందుబాటులో ఉంటుంది. వన్‌ప్లస్ 9 5G మొత్తం మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
వన్‌ప్లస్ 9 ప్రో కొత్త ధర
వన్‌ప్లస్ 9 ప్రో ధర కూడా రూ. 5,000 మేర తగ్గింది. తద్వారా 8GB RAM బేస్ మోడల్ రూ. 59,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. దీని టాప్- ఎండ్ మోడల్ రూ. 64,999 ధర వద్ద లభిస్తుంది. అమెజాన్, వన్‌ప్లస్ వెబ్సైట్ల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు.
వన్‌ప్లస్ 10 ప్రో ధర (అంచనా)
వన్‌ప్లస్ 9 ప్రో సక్సెసర్‌గా వస్తున్న వన్‌ప్లస్ 10 ప్రో 5G అమ్మకాలు మార్చి 31 నుంచి ప్రారంభం కానున్నాయి. దీన్ని అమెజాన్ లేదా వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అయితే, వన్‌ప్లస్ 10 ప్రో ధర ఇంకా వెల్లడికాలేదు. కానీ, ఇది దాదాపు రూ. 66,999 ప్రారంభమయ్యే అవకాశం ఉందని లీకేజీలను బట్టి తెలుస్తోంది. ఇది 9 ప్రో లాంచింగ్ ధరతో పోలిస్తే కొంచెం ఎక్కువనే చెప్పవచ్చు. ప్రస్తుతం, ఆన్లైన్లో లీకైన వివరాల ప్రకారం, 12GB RAM కలిగిన టాప్-ఎండ్ మోడల్ రూ.71,999 వద్ద లభించే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ S22 సిరీస్, ఐక్యూ 9 ప్రో, ఐఫోన్ 13 ఫోన్లకు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది.
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్లు (అంచనా)
వన్‌ప్లస్ 10 ప్రో స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, ఇది స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌సెట్‌పై పనిచేస్తుంది. దీనిలో 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేను అందించనుంది. ఈ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 50 -మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో వస్తుంది. దీనిలోని 5000mAh బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతిస్తుంది. ఇది ఆక్సిజన్ ఓఎస్‌పై రన్ అవుతుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.