WhatsApp to Telegram: వాట్సప్ ఛాట్స్‌ని టెలిగ్రామ్‌లోకి 30 సెకండ్లలో ట్రాన్స్‌ఫర్ చేయండి ఇలా

ప్రతీకాత్మక చిత్రం

WhatsApp to Telegram Chat export | మీరు వాట్సప్ నుంచి టెలిగ్రామ్‌లోకి మీ ఛాట్స్ ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ స్టెప్స్ ఫాలో అవండి.

  • Share this:
    వాట్సప్ కొత్త ప్రైవసీ రూల్స్ వివాదంతో కొంతమంది ఈ యాప్‌ను ఉపయోగించడం మానేశారు. వాట్సప్ బదులు టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్ ఉపయోగిస్తున్నారు. టెలిగ్రామ్, సిగ్నల్ యాప్స్ వాట్సప్ యూజర్లను ఆకట్టుకోవడానికి పోటీపడుతున్నాయి. వాట్సప్‌కు ప్రత్యామ్నాయంగా ఎక్కువమంది టెలిగ్రామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారని లెక్కలు చెబుతున్నాయి. అయితే వాట్సప్ నుంచి మారిపోతే అప్పటివరకు ఉన్న ఛాట్స్ పరిస్థితి ఏంటన్న అనుమానం సందేహం టెలిగ్రామ్ యూజర్లలో ఉంది. వాట్సప్ ఛాట్స్‌ని టెలిగ్రామ్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు. ఇందుకోసం టెలిగ్రామ్ కొత్త ఫీచర్ తీసుకొచ్చింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు ఈ ఫీచర్ ఉపయోగించుకోవచ్చు. మీ పాత ఛాట్స్ అన్నీ టెలిగ్రామ్‌లోకి చాలా సులువుగా మార్చుకోవచ్చు. వాట్సప్ మాత్రమే కాదు ఇతర ఛాటింగ్, మెసేజింగ్ యాప్స్ నుంచి టెలిగ్రామ్ యాప్‌లోకి ఛాట్స్ ట్రాన్స్‌ఫర్ చేయడం సులువే.

    అయితే సిగ్నల్ నుంచి టెలిగ్రామ్‌లోకి ఛాట్స్ ఎక్స్‌పోర్ట్ చేసే అవకాశం లేదు. టెలిగ్రామ్‌లోకి కేవలం వ్యక్తిగత ఛాట్స్, గ్రూప్ ఛాట్స్ మాత్రమే కాదు ఫోటోలు, వీడియోలు, స్టిక్కర్స్ ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు. ఈ ఫీచర్‌లో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే... మీరు మీ వాట్సప్ నుంచి ఎవరి ఛాట్స్‌ని టెలిగ్రామ్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేస్తే, వారి టెలిగ్రామ్‌లో కూడా ఛాట్స్ అప్‌డేట్ అవుతాయి. గ్రూప్ ఛాట్స్ కూడా ఇలాగే ఎక్స్‌పోర్ట్ అవుతుంది. మరి ఆండ్రాయిడ్ యూజర్లు తమ ఛాట్స్‌ని టెలిగ్రామ్‌లోకి ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలో తెలుసుకోండి.

    Realme X7 5G: రిలీజ్‌కు ముందే లీకైన ధరలు... రియల్‌మీ ఎక్స్7 5జీ ప్రైస్ ఇదే

    Poco M2: నిమిషానికి 5 ఫోన్లు కొనేస్తున్నారు... ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత ఏంటంటే


    WhatsApp to Telegram Chat export: వాట్సప్ నుంచి టెలిగ్రామ్‌కు ఛాట్స్ ఎక్స్‌పోర్ట్ చేయండిలా


    టెలిగ్రామ్ యూజర్లు ముందుగా యాప్ అప్‌డేట్ చేయాలి.
    ఆ తర్వాత వాట్సప్ ఓపెన్ చేయాలి.
    అందులో మీరు ఎవరి ఛాట్ ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటే వారి ఛాట్ విండో ఓపెన్ చేయాలి.
    రైట్ టాప్ కార్నర్‌లో త్రీ డాట్స్ క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత More పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత Export Chat పైన క్లిక్ చేయాలి.
    ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో Telegram సెలెక్ట్ చేయాలి.
    టెలిగ్రామ్ యాప్‌లో ఏ ఛాట్‌లోకి ఎక్స్‌పోర్ట్ చేయాలో వారి కాంటాక్ట్ నేప్ పైన క్లిక్ చేయాలి.
    అంతే... క్షణాల్లో వాట్సప్‌లోని ఛాట్స్ అన్నీ టెలిగ్రామ్‌లోకి వచ్చేస్తాయి.

    Jio New Plans: రోజూ 1.5జీబీ డేటా కావాలా? జియో ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ ఇవే

    Vivo Y31: వివో వై31 సేల్ మొదలైంది... డిస్కౌంట్ ఆఫర్స్ ఇవే

    ఇలా ఒక్కొక్కరి ఛాట్ ఇంపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఒకే ఛాట్ ఇంపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఐఓఎస్‌లో కూడా ఇవే స్టెప్స్ ఫాలో కావాలి. అయితే కాంటాక్ట్ పేరు సెలెక్ట్ చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. పొరపాటున వేరే కాంటాక్ట్ క్లిక్ చేస్తే మొత్తం ఛాట్ ఎక్స్‌పోర్ట్ అయ్యే అవకాశం ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published: