మీరు అంతరిక్షంలోకి వెళ్లలేకపోయినా మీ పేరును అంతరిక్షంలోకి పంపొచ్చు. అంతరిక్ష ప్రియుల కోసం నాసా (NASA) ఓ అద్భుత కార్యక్రమాన్ని ప్రారంభించింది. మీ పేరును చంద్రుని చుట్టూ తిప్పే అవకాశాన్ని అందిస్తోంది. ఇందుకోసం అమెరికాకు చెందిన స్పేస్ ఏజెన్సీ ఓ వెబ్‌సైట్ కూడా ప్రారంభించింది. అందులో మీ పేరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. ఫ్లాష్ డ్రైవ్‌లో మీ పేరును అంతరిక్షంలోకి నాసా పంపించినుంది. చంద్రుని పైన పరిశోధనలు చేసేందుకు నాసా ఓ ప్రాజెక్ట్ ఆర్టెమిస్ (Artemis) ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా త్వరలో ఆర్టెమిస్ 1 మానవరహిత మిషన్‌ను ప్రారంభించనుంది. ఈ రాకెట్ చంద్రుని చుట్టూ తిరుగుతూ స్పేస్ లాంఛ్ సిస్టమ్‌ను పరీక్షించనుంది. చంద్రునిచుట్టూ తిరగబోయే ఆర్టెమిస్ 1 మానవరహిత అంతరిక్షనౌకలో మీ పేరును కూడా పంపొచ్చు.
చంద్రుని కక్ష్యలోకి పంపబోయే ఆర్టెమిస్ 1 మానవరహిత అంతరిక్షనౌకలో మీ పేరు పంపాలనుకుంటే నాసా వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తైన తర్వాత ఫ్లాష్ డ్రైవ్‌లో మీ పేరును లోడ్ చేసి అంతరిక్షంలోకి పంపిస్తుంది. https://www.nasa.gov/send-your-name-with-artemis/ వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీ పేరు, పిన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే చాలు. బోర్డింగ్ పాస్ క్రియేట్ అవుతుంది.
Jio Hotstar Plans: ఈ జియో ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
We’re getting ready for #Artemis I — and we want to take you with us.
Add your name to the upcoming mission and it will be flown aboard the @NASA_Orion spacecraft as it orbits the Moon: https://t.co/DBmI3axfyH pic.twitter.com/KnoQaiyJcj
— NASA Artemis (@NASAArtemis) March 2, 2022
ఆర్టెమిస్ 1 మానవరహిత మిషన్ విజయవంతం అయిన తర్వాత చంద్రునిపైకి తొలి మహిళను పంపాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. అంతకన్నా ముందు మానవరహిత అంతరిక్షనౌకను చంద్రుని చుట్టూ తిప్పనుంది. ఆర్టెమిస్ 1 మానవరహిత మిషన్ ఇప్పటికే లాంఛ్ కావాల్సింది. కానీ పలు కారణాలతో వాయిదా పడుతూవస్తోంది. షెడ్యూల్ ప్రకారం 2021 నవంబర్‌లోనే లాంఛింగ్ జరగాల్సి ఉంది. కానీ ఈ ఏడాది మేలో ఈ మిషన్ లాంఛ్ చేయాలని నాసా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మిషన్ లాంఛ్ అయిన తర్వాత వచ్చే డేటాను సైంటిస్టులు, ఇంజనీర్లు పరిశీలించనున్నారు.
ఈ పరీక్ష విజయవంతం అయిన తర్వాత చంద్రునిపైకి తొలి మహిళను పంపనుంది నాసా. చంద్రుని మీద అడుగు పెట్టిన తర్వాత అక్కడ కాలనీలు ఏర్పాటు చేయాలని నాసా భావిస్తోంది. మానవులు ఎక్కువ కాలం అక్కడ ఉండటంతో పాటు అంగారక గ్రహం సహా సౌర వ్యవస్థలోని ఇతర మిషన్లను పంపడానికి చంద్రుడుని వేదికగా చేసుకోనుంది. ఇప్పటికే నాసా రెడ్ ప్లానెట్‌పై అధ్యయనం చేయడానికి, నమూనాలను సేకరించడానికి పర్సివరెన్స్ రోవర్, ఇంజెన్యుటీ ఛాపర్‌లను పంపింది. 2026 కన్నా ముందే మానవులతో కూడిన ఫ్లైట్ చంద్రుడిపై ల్యాండ్ చేయాలనుకుంటుంది నాసా.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.