Home /News /technology /

GOOD NEWS FOR SCOOTER LOVERS NEW HONDA ACTIVA IN THE MARKET IF YOU SEE THE PRICE AND FEATURES YOU WILL BUY IT UMG GH

Honda scooter: గేర్‌లెస్ స్కూటర్.. మార్కెట్‌లోకి హోండా లేటెస్ట్ స్కూటీలు.. ట్రైల్ వేస్తే వదులుకోరు అంతే..!

స్కూటర్‌ లవర్స్ కు గుడ్ న్యూస్ .. మార్కెట్ లోకి కొత్త  హొండా యాక్టివా .. ధర , ఫీచర్స్ చూస్తే కొనేస్తారంతే !

స్కూటర్‌ లవర్స్ కు గుడ్ న్యూస్ .. మార్కెట్ లోకి కొత్త హొండా యాక్టివా .. ధర , ఫీచర్స్ చూస్తే కొనేస్తారంతే !

హోండా(Honda) హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) నుంచి త్వరలో మరో కొత్త స్కూటర్ రానుంది. కంపెనీ సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలు వెల్లడించింది. కొత్త గేర్‌లెస్ స్కూటర్‌(Scooters)ను హోండా తాజాగా టీజ్ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
గేర్‌లెస్ స్కూటర్లు(Scooter) కొనాలనుకునే వారు ముందుగా ఆరాతీసేది.. హోండా(Honda) లేటెస్ట్ స్కూటీల గురించే. యాక్టివా సిరీస్‌లో వచ్చే స్కూటీలు అంత పాపులర్ అయ్యాయి. అయితే హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) నుంచి త్వరలో మరో కొత్త స్కూటర్ రానుంది. కంపెనీ సోషల్ మీడియా ద్వారా ఈ వివరాలు వెల్లడించింది. కొత్త గేర్‌లెస్ స్కూటర్‌ను హోండా తాజాగా టీజ్ చేసింది. టీజర్ ఫోటోలో.. కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడైన టూవీలర్ యాక్టివా 6G (Activa 6G) లాంటి మందమైన ఫ్రంట్ పార్ట్ మాత్రమే కనిపిస్తోంది. దీని మోడల్ నేమ్‌ను హోండా వెల్లడించలేదు. దీంతో ఇప్పటికే ఉన్న యాక్టివా 6G స్కూటర్‌కు కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను తీసుకొస్తుందా..? లేదా తదుపరి జనరేషన్‌గా యాక్టివా 7G మోడల్‌ను పరిచయం చేయాలని భావిస్తోందా..? అనే విషయాలపై ప్రస్తుతానికి స్పషత లేదు.

హోండా యాక్టివా 7G
యాక్టివా 5Gని లాంచ్ చేసిన రెండు సంవత్సరాల తర్వాత, 2020 జనవరిలో హోండా యాక్టివా 6Gని ఇండియాలో లాంచ్ చేసింది. ఒకవేళ హోండా కంపెనీ ఇదే టైమ్‌లైన్‌ను ఫాలో అవుతుంటే.. యాక్టివా 7G (Activa 7G) మోడల్‌ను పరిచయం చేయడానికి ఇది సరైన సమయం కావచ్చు. ఈ నెక్స్ట్-జెన్ మోడల్‌లో హోండా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, అల్లాయ్ వీల్స్ మొదలైన వాటితో సహా కొన్ని కాస్మెటిక్ మార్పులు, కొత్త ఫీచర్ల(Features)ను అందించే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Weight Loss: మీరు ఈ డైట్ ఫాలో అయ్యారంటే చాలు.. దెబ్బకు బరువు తగ్గుతారు !



హోండా యాక్టివా 6G స్పెషల్ ఎడిషన్
హోండా ఎప్పటికప్పుడు పొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో స్పెషల్ లేదా లిమిటెడ్ ఎడిషన్ వెర్షన్స్‌ను పరిచయం చేస్తుంది. కొద్ది రోజుల క్రితం కంపెనీ హోండా డియో స్పోర్ట్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. ఇవి పరిమిత సంఖ్యలోనే అమ్మకానికి వచ్చాయి. యాక్టివా 6G విషయంలో కూడా కంపెనీ ఇదే విధానాన్ని ఫాలో కావచ్చు. అమ్మకాలను పెంచుకోవడానికి హోండా కంపెనీ పండుగ సీజన్‌లో కొన్ని కాస్మెటిక్ అప్‌డేట్స్‌తో యాక్టివా 6Gకి అప్‌డేటెడ్ వెర్షన్‌ను ఎడిషన్‌ను ప్రవేశపెట్టవచ్చు. ఇదే కరెక్ట్ అయితే, కొత్త స్కూటర్ యాక్టివా 6G స్పెషల్ ఎడిషన్‌గా మార్కెట్లోకి రావచ్చు.



యాక్టివా 6G ధర, స్పెసిఫికేషన్లు
హోండా యాక్టివా 6G స్కూటర్ 109.51cc, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, PGM ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ మోటార్ 8,000 RPM వద్ద 7.68 bhp పవర్‌ను, 5,500 RPM వద్ద 8.84 Nm గరిష్ట టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇంజన్ CVTతో వస్తుంది. ప్రస్తుతం దీని ధర రూ.72,400 నుంచి రూ.74,400 వరకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీగా ఉంది. హోండా కొత్తగా ఏ స్కూటర్‌ను లాంచ్ చేస్తుందనే వివరాలు మరికొన్ని రోజుల్లో బయటకు రానున్నాయి.
Published by:Mahesh
First published:

Tags: Ev scooters, Honda, New features, Price

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు