GOOD NEWS FOR SBI CARDHOLDERS GET RS 10000 WORTH BENEFITS ON STATE BANK OF INDIA CREDIT AND DEBIT CARDS IN AMAZON GREAT INDIAN FESTIVAL SALE SS
Amazon-SBI offer: ఎస్బీఐ కార్డుపై రూ.10,000 బెనిఫిట్స్... ఎలా పొందాలో తెలుసుకోండి
దీంతో బ్యాంకు వార్షిక ఎంసీఎల్ఆర్ 8.15 శాతం నుంచి 8.05 శాతానికి తగ్గనుంది. తద్వారా గృహ రుణాలపై వడ్డీరేటు తగ్గే అవకాశం ఉంది.
Amazon-SBI offers | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులతో ఏం కొన్నా 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. కనీసం రూ.3,000 షాపింగ్ చేయాల్సి ఉంటుంది.
మీ దగ్గర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉందా? అయితే మీకు శుభవార్త. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న విషయం తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఈ సేల్ సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెబిట్, క్రెడిట్ కార్డులతో ఏం కొన్నా 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. కనీసం రూ.3,000 షాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు ఈఎంఐలపైనా ఈ ఆఫర్స్ పొందొచ్చు. రూ.50,000 లోపు షాపింగ్ చేస్తే ఒక కార్డుపై గరిష్టంగా రూ.2,000 మాత్రమే తగ్గింపు లభిస్తుంది.రూ.50,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేస్తే ఆ తర్వాత ప్రతీ రూ.10,000 అదనంగా బోనస్ ఆఫర్ కింద రూ.2,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
ఉదాహరణకు మీరు రూ.5,000 షాపింగ్ చేస్తే 10% ఇన్స్టాంట్ డిస్కౌంట్ రూ.500 తగ్గింపు లభిస్తుంది.
మీరు రూ.35,000 షాపింగ్ చేస్తే ఇన్స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000 మాత్రమే లభిస్తుంది.
మీరు రూ.80,000 షాపింగ్ చేస్తే ఇన్స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000 + ఎస్బీఐ బోనస్ క్యాష్‌బ్యాక్ రూ.6,000 లభిస్తుంది.
మీరు రూ.1,10,000 షాపింగ్ చేస్తే ఇన్స్టాంట్ డిస్కౌంట్ రూ.2,000 + ఎస్బీఐ బోనస్ క్యాష్‌బ్యాక్ రూ.8,000 లభిస్తుంది.
రూ.50,000 కన్నా ఎక్కువ షాపింగ్ చేసేవాళ్లు రూ.8,000 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.
అంటే ఒక కార్డుపై మీరు గరిష్టంగా రూ.2,000 తగ్గింపుతో పాటు రూ.8,000 క్యాష్‌బ్యాక్ కలిపి మొత్తం రూ.10,000 బెనిఫిట్స్ పొందొచ్చు.
మీరు ఒకవేళ ఏవైనా ఆర్డర్స్ క్యాన్సిల్ చేసినా, రిటర్న్ చేసినా, తిరస్కరించిన ఈ ఆఫర్ వర్తించదు.
మీరు వస్తువు కొనే ముందే ఈ ఆఫర్ వర్తిస్తుందో లేదో ఓసారి సరిచూసుకోవాలి.
ఎస్బీఐ డెబిట్ ఈఎంఐ ట్రాన్సాక్షన్స్‌కు ఇన్స్టాంట్ డిస్కౌంట్ ఆఫర్ వర్తించదు.
క్యాష్‌బ్యాక్ 2020 జనవరి 5 లోగా మీ బ్యాంక్ అకౌంట్ లేదా కార్డ్ స్టేట్మెంట్లో క్రెడిట్ అవుతుంది.
Vivo S1: వివో ఎస్1 కొత్త వేరియంట్ రిలీజ్... ఎలా ఉందో చూడండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.