హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్స్... రోజూ 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్స్... రోజూ 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్స్... రోజూ 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్
(ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plans: జియో నుంచి రెండు కొత్త ప్లాన్స్... రోజూ 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ (ప్రతీకాత్మక చిత్రం)

Jio New Plans | జియో నుంచి రెండు కొత్త ప్లాన్స్ వచ్చేశాయి. ఎక్కువగా మొబైల్ డేటా వాడేవారికోసం రోజూ 2.5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, ఇతర బెనిఫిట్స్‌ని ఈ ప్లాన్స్ అందిస్తాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

రిలయన్స్ జియో (Reliance Jio) యూజర్లకు అలర్ట్. జియో నుంచి మరో రెండు కొత్త ప్లాన్స్ వచ్చాయి. ప్రత్యేకమైన బెనిఫిట్స్‌తో రెండు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Recharge Plans) ప్రకటించింది జియో. రూ.349, రూ.899 ప్లాన్స్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్స్‌పై రోజూ 2.5జీబీ డేటా లభిస్తుంది. ప్రతీ రోజూ ఎక్కువ మొబైల్ డేటా ఉపయోగించేవారికి ఈ ప్లాన్స్ ఉపయోగపడతాయి. జియో నుంచి రోజూ 1జీబీ, 1.5జీబీ, 2జీబీ డేటా లభించే ప్లాన్స్ ఉన్నాయి. అయితే రోజూ ఈ డేటా పూర్తిగా వాడేవారికి అదనంగా డేటా అవసరం ఉంటుంది. కాబట్టి అలాంటి యూజర్లు రోజూ 2.5జీబీ డేటా ఇచ్చే రూ.349, రూ.899 ప్లాన్స్ రీఛార్జ్ చేయొచ్చు. మరి ఏ ప్లాన్‌లో ఎలాంటి బెనిఫిట్స్ లభిస్తాయో తెలుసుకోండి.

Jio Rs 349 Plan: జియో రూ.349 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 30 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 2.5జీబీ డేటా లభిస్తుంది. అంటే 30 రోజుల్లో 75జీబీ డేటా వాడుకోవచ్చు. వీటితో పాటు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోసినిమా, జియోటీవీ, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ యాప్స్‌కి యాక్సెస్ కూడా లభిస్తుంది. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్నవారికి 5జీ డేటా లభిస్తుంది.

UPI Scam: యూపీఐ పేమెంట్స్‌లో భారీగా మోసాలు... ఈ టిప్స్ గుర్తుంచుకోండి

Jio Rs 899 Plan: జియో రూ.899 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 90 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 2.5జీబీ డేటా లభిస్తుంది. అంటే 90 రోజుల్లో 225జీబీ డేటా వాడుకోవచ్చు. వీటితో పాటు రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియోసినిమా, జియోటీవీ, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ యాప్స్‌కి యాక్సెస్ కూడా లభిస్తుంది. 5జీ నెట్వర్క్ అందుబాటులో ఉన్నవారికి 5జీ డేటా లభిస్తుంది.

ఇక రిలయన్స్ జియో హ్యాపీ న్యూ ఇయర్ 2023 పేరుతో రెండు ప్రీపెయిడ్ ప్లాన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రూ.2,023, రూ.2,999 ప్లాన్స్ పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్స్‌పై లభించే బెనిఫిట్స్ తెలుసుకోండి.

Tecno Phantom X2 Pro: ప్రపంచంలోనే తొలిసారి ముడుచుకుపోయే కెమెరాతో స్మార్ట్‌ఫోన్ ... విశేషాలివే

Jio Rs 2,023 Plan: జియో రూ.2,023 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 252 రోజుల వేలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 2.5జీబీ డేటా లభిస్తుంది. అంటే 252 రోజుల్లో 630జీబీ డేటా వాడుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియోసినిమా, జియోటీవీ, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ యాప్స్‌కి యాక్సెస్ కూడా లభిస్తుంది. కొత్త యూజర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

Jio Rs 2,999 Plan: జియో రూ.2,999 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 365 రోజుల వేలిడిటీ లభిస్తుంది. దీంతో పాటు అదనంగా 23 రోజుల వేలిడిటీ పొందొచ్చు. రోజూ 2.5జీబీ డేటా చొప్పున మొత్తం 912.5జీబీ డేటా వాడుకోవచ్చు. అదనంగా మరో 75జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. జియోసినిమా, జియోటీవీ, జియోసెక్యూరిటీ, జియోక్లౌడ్ యాప్స్‌కి యాక్సెస్ కూడా లభిస్తుంది. కొత్త యూజర్లకు ప్రైమ్ మెంబర్‌షిప్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

First published:

Tags: Jio, Reliance Jio

ఉత్తమ కథలు