హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme X7 Pro: రియల్‌మీ ఎక్స్7 స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి... రిలీజ్ ఎప్పుడంటే

Realme X7 Pro: రియల్‌మీ ఎక్స్7 స్మార్ట్‌ఫోన్స్ వచ్చేస్తున్నాయి... రిలీజ్ ఎప్పుడంటే

Realme X7 Pro Series | రియల్‌మీ ఎక్స్7 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు ఇండియాకు వచ్చేస్తున్నాయి. రియల్‌మీ ఎక్స్7, రియల్‌మీ ఎక్స్7 ప్రో ప్రత్యేకతలు తెలుసుకోండి.

  రియల్‌మీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రియల్‌మీ ఎక్స్7, రియల్‌మీ ఎక్స్7 ప్రో స్మార్ట్‌ఫోన్ల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీ కూడా టీజర్లతో ఊరిస్తోంది తప్ప రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు. దీంతో రియల్‌మీ ఫ్యాన్స్ ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. టీజర్ల మీద టీజర్లు విడుదలవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరుగుతోంది. ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు రిలీజ్ అయ్యాయి. చైనాలో రిలీజ్ అయిన ఫోన్లు కాబట్టి స్పెసిఫికేషన్స్ గురించి అందరికీ తెలిసినదే. మరి ఇండియన్ వేరియంట్లలో ఏవైనా మార్పులు ఉంటాయో లేదో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. రియల్‌మీ ఎక్స్7, రియల్‌మీ ఎక్స్7 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఫిబ్రవరి 4న రిలీజ్ కానున్నాయన్న వార్తలొస్తున్నాయి. అయితే డేట్ ఇంకా కన్ఫామ్ కాలేదు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో టీజర్ కూడా కనిపించింది. రియల్‌మీ ఎక్స్ సిరీస్‌లో ఇండియాకు రాబోతున్న స్మార్ట్‌ఫోన్స్ ఇవి. రెండూ 5జీ స్మార్ట్‌ఫోన్లే. మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే, 4500ఎంఏహెచ్, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

  Flipkart: స్మార్ట్‌ఫోన్ ఏడాది వాడిన తర్వాత 100 శాతం మనీబ్యాక్... ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన ఆఫర్

  WhatsApp: ఈ రెండు సెట్టింగ్స్ మారిస్తే మీ వాట్సప్ సేఫ్... ఇలా మార్చేయండి

  రియల్‌మీ ఎక్స్7 స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.4 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే

  ర్యామ్: 8జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 800

  రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్‌రైట్ సెన్సార్

  ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

  బ్యాటరీ: 4500ఎంఏహెచ్

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  WhatsApp Calls: ఈ ట్రిక్ తెలిస్తే వాట్సప్ కాల్స్ కూడా రికార్డ్ చేయొచ్చు

  LG K42: రెండేళ్ల వారెంటీతో ఎల్‌జీ కే42 స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర ఎంతంటే

  రియల్‌మీ ఎక్స్7 ప్రో స్పెసిఫికేషన్స్

  డిస్‌ప్లే: 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే

  ర్యామ్: 6జీబీ, 8జీబీ

  ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ, 256జీబీ

  ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 1200

  రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్ + 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ పోర్ట్‌రైట్ సెన్సార్

  ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా

  బ్యాటరీ: 4500ఎంఏహెచ్ (65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

  ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ

  సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

  ధర: ప్రారంభ ధర సుమారు రూ.25,000

  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు