హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Realme V15 5G: రియల్‌మీ వీ15 5జీ ఇండియాకు వస్తోందా? ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలివే

Realme V15 5G: రియల్‌మీ వీ15 5జీ ఇండియాకు వస్తోందా? ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలివే

Realme V15 5G: రియల్‌మీ వీ15 5జీ ఇండియాకు వస్తోందా? ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలివే

Realme V15 5G: రియల్‌మీ వీ15 5జీ ఇండియాకు వస్తోందా? ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలివే

Realme V15 5G | రియల్‌మీ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.

చైనాలో రియల్‌మీ వీ15 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ స్మార్ట్‌ఫోన్‌కు చాలా ప్రత్యేకతలున్నాయి. మీడియాటెక్ డిమెన్సిటీ 800యూ ప్రాసెసర్, 5జీ కనెక్టివిటీ, ట్రిపుల్ కెమెరా సెటప్, 50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. మీడియాటెక్ డిమెన్సిటీ ప్రాసెసర్‌తో ఏ స్మార్ట్‌ఫోన్ ఇంకా ఇండియాలో రిలీజ్ రాలేదు. మరోవైపు ఇండియాలో మరిన్ని 5జీ స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ చేసేందుకు రియల్‌మీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా రియల్‌మీ వీ15 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో రిలీజ్ చేస్తుందన్న వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఇండియాలో రియల్‌మీ ఎక్స్7 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తామని కంపెనీ గతంలోనే ప్రకటించింది ఈ నెలాఖరులోగా రియల్‌మీ ఎక్స్7, రియల్‌మీ ఎక్స్7 ప్రో స్మార్ట్‌ఫోన్లు ఇండియాలో రిలీజ్ అవుతాయని భావిస్తున్నారు.

ఇక రియల్‌మీ వీ15 5జీ ప్రత్యేకతలు చూస్తే 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 8జీబీ వరకు ర్యామ్ ఆప్షన్స్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఇప్పటికే చైనాలో ప్రీ ఆర్డర్ మొదలైంది. జనవరి 14న ఓపెన్ సేల్ మొదలుకానుంది. మరి ఈ ఫోన్ ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఎప్పుడు లాంఛ్ అవుతుందో స్పష్టత లేదు. ఇప్పటికే ఇండియాలో లాంఛ్ చేసేందుకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS సర్టిఫికేషన్ లభించిందన్న వార్తలొస్తున్నాయి.

WhatsApp: వాట్సప్ వద్దా? అయితే 5 మెసేజింగ్ యాప్స్ ట్రై చేయొచ్చు

Jio New Plans: రోజూ 1.5జీబీ డేటా... రిలయెన్స్ జియో లేటెస్ట్ ప్లాన్స్ ఇవే

రియల్‌మీ వీ15 5జీ స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే

ర్యామ్: 6జీబీ, 8జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 128జీబీ

ప్రాసెసర్: మీడియాటెక్ డిమెన్సిటీ 800యూ

రియర్ కెమెరా: 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్

ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్

బ్యాటరీ: 4,310ఎంఏహెచ్ (50వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 10 + రియల్‌మీ యూఐ

సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్

కలర్స్: క్రిసెంట్ సిల్వర్, కోయ్, మిర్రర్ లేక్ బ్లూ

ధర:

6జీబీ+128జీబీ- సుమారు రూ.15,900

8జీబీ+128జీబీ- సుమారు రూ.22,700

First published:

Tags: 5G Smartphone, Android 10, Mobile, Mobile News, Mobiles, Realme, Realme UI, Smartphone, Smartphones

ఉత్తమ కథలు