Home /News /technology /

GOOD NEWS FOR RAILWAY PASSENGERS RAILTEL LAUNCHES HIGH SPEED PREPAID WI FI SERVICE AT 4000 RAILWAY STATIONS KNOW ABOUT PLANS SS

RailTel Free Wifi: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు ఫ్రీ వైఫై... ఆ తర్వాత ఎంత చెల్లించాలంటే

RailTel: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు ఫ్రీ వైఫై... ఆ తర్వాత ఎంత చెల్లించాలంటే
(ప్రతీకాత్మక చిత్రం)

RailTel: రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలు ఫ్రీ వైఫై... ఆ తర్వాత ఎంత చెల్లించాలంటే (ప్రతీకాత్మక చిత్రం)

RailTel Free Wifi | రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. రైల్వే స్టేషన్‌లో 30 నిమిషాలపాటు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. ఆ తర్వాత డ్బులు చెల్లించాలి. ప్లాన్స్ వివరాలు ఇవే.

    దేశంలోని 4,000 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్ ప్రీపెయిడ్ ఇంటర్నెట్ అందిస్తున్నట్టు భారతీయ రైల్వేకు చెందిన రైల్‌టెల్ సంస్థ ప్రకటించింది. దేశంలోని మొత్తం 5,950 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం ఉంది. ఇందులో ప్రీపెయిడ్ వైఫై సదుపాయం 4000 స్టేషన్లలో లభిస్తుంది. వేర్వేరు స్టేషన్లలో స్పీడ్ వేర్వేరుగా ఉంటుంది. 1 ఎంబీపీఎస్ నుంచి 34 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ లభిస్తుంది. రైల్వే స్టేషన్లలో ఎవరైనా ఉచితంగా వైఫై ఉపయోగించుకోవచ్చు. మొదట 30 నిమిషాలు ఉచితంగా వైఫై వాడుకోవచ్చు. ఆ తర్వాత డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం వేర్వేరు ప్లాన్స్ ప్రకటించింది రైల్‌టెల్. స్మార్ట్‌ఫోన్‌లో ఓటీపీ బేస్డ్ వెరిఫికేషన్ ద్వారా వైఫై అందిస్తోంది రైల్‌టెల్. మొదటి 30 నిమిషాలు ఉచితం. ఆ తర్వాత డబ్బులు చెల్లించాలి.

    WhatsApp: వాట్సప్ కొత్త ఫీచర్స్... మెసేజెస్, ఫోటోస్ మాయమైపోతాయి ఇలా

    Samsung Galaxy A32: సాంసంగ్ నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్... గెలాక్సీ ఏ32 ప్రత్యేకతలివే

    రైల్‌టెల్ ప్లాన్స్ చూస్తే ఒక రోజులో 5జీబీ డేటా వాడుకోవడానికి రూ.10 చెల్లించాలి. ఒక రోజు 10జీబీ డేటాకు రూ.15, ఐదు రోజులకు 10జీబీ డేటాకు రూ.20, ఐదు రోజులు 20జీబీ డేటాకు రూ.30 చెల్లించాలి. ఇక 10 రోజులకు 20జీబీ డేటా కోసం రూ.40 చెల్లించాలి. 10 రోజులకు 30 జీబీ డేటా కోసం రూ.50 చెల్లించాలి. 30 రోజులకు 60 జీబీ డేటా కోసం రూ.70 చెల్లించాలి. ప్రయాణికులు తమ అవసరాలకు తగ్గట్టుగా ఈ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. నెట్ బ్యాంకింగ్, ఇ-వ్యాలెట్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయొచ్చు. రైల్‌టెల్ లెక్కల ప్రకారం ప్రతీ నెల 3 కోట్ల మంది యూజర్లు రైల్వేస్టేషన్లలో వైఫై ఉపయోగిస్తున్నారు. పెయిడ్ వైఫై సర్వీస్ ద్వారా రైల్‌టెల్‌కు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల మధ్య ఆదాయం లభిస్తోంది.

    Prepaid Plans: 84 రోజుల వేలిడిటీ కావాలా? Jio, Airtel, Vi అందిస్తున్న ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే

    Realme Narzo 30A: కాసేపట్లో రియల్‌మీ నార్జో 30ఏ సేల్... ధర రూ.8,999 నుంచి... ఆఫర్స్ ఇవే

    ప్రస్తుతం 4000 రైల్వే స్టేషన్లలో పెయిడ్ వైఫై ప్రారంభించింది రైల్‌టెల్. మొదట ఉత్తర్‌ప్రదేశ్‌లోని 20 రైల్వే స్టేషన్లలో ప్రయోగాత్మకంగా పెయిడ్ వైఫైని లాంఛ్ చేసింది. అక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ప్రీపెయిడ్ వైఫై సర్వీస్ ప్రారంభించింది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Indian Railway, Indian Railways, Irctc, Railways, Train, Wifi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు