హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Train Tickets: దసరా ట్రైన్‌లో టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో చెక్ చేయండిలా

Train Tickets: దసరా ట్రైన్‌లో టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో చెక్ చేయండిలా

Train Tickets: దసరా ట్రైన్‌లో టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో చెక్ చేయండిలా
(ప్రతీకాత్మక చిత్రం)

Train Tickets: దసరా ట్రైన్‌లో టికెట్ కన్ఫామ్ అయిందా? వాట్సప్‌లో చెక్ చేయండిలా (ప్రతీకాత్మక చిత్రం)

Train Tickets | రైల్వే ప్రయాణికులు ట్రైన్ టికెట్స్ బుక్ చేసిన తర్వాత పీఎన్ఆర్ స్టేటస్‌ను (PNR Status) వాట్సప్‌లో చెక్ చేయొచ్చు. ఈ ఫీచర్ కొత్తగా అందుబాటులోకి వచ్చింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

దసరా సెలవుల్లో ఊరెళ్లేందుకు రైలు టికెట్లు బుక్ (Train Tickets Booking) చేసుకున్నారా? మీరు బుక్ చేసిన రైలు టికెట్ ఇంకా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉందా? మీ ట్రైన్ టికెట్ కన్ఫామ్ అయిందో లేదో సింపుల్‌గా వాట్సప్‌లో తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీరు థర్డ్ పార్టీ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. వాట్సప్‌లోనే పీఎన్ఆర్ స్టేటస్ చెక్ (PNR Status Checking) చేయొచ్చు. ట్రైన్ టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటే పూటకు ఓసారి పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేయడం ప్రయాణికులకు అలవాటు. ఇందుకోసం థర్డ్ పార్టీ యాప్స్, వెబ్‌సైట్స్ ఉపయోగిస్తుంటారు. లేదా ఎస్ఎంఎస్ ద్వారా టికెట్ స్టేటస్ తెలుసుకుంటారు. అంతకన్నా ఈజీగా వాట్సప్‌లోనే పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేయొచ్చు.

ఐఆర్‌సీటీసీ ప్రయాణికుల కోసం ముంబైకి చెందిన రైలోఫై (Railofy) స్టార్టప్ ఈ ఫీచర్ అందిస్తోంది. రైల్వే ప్రయాణికులు వాట్సప్‌లో పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేయడం మాత్రమే కాదు, రియల్ టైమ్ ట్రైన్ జర్నీ వివరాలు తెలుసుకోవచ్చు. అంటే తాము ప్రయాణించాలనుకున్న రైలు సరిగ్గా ఏ స్టేషన్‌లో ఉందో, తమ స్టేషన్‌కు ఎప్పట్లోగా వస్తుందో వాట్సప్‌లో తెలుసుకోవచ్చు. దీనివల్ల వేర్వేరు యాప్స్ డౌన్‌లోడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు.

TSRTC Holiday Tour: టీఎస్ఆర్‌టీసీ బంపరాఫర్... సెలవుల్లో 12 గంటల్లో హైదరాబాద్ చుట్టేయండి

రైలోఫై వాట్సప్ ఛాట్‌బాట్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్, లైవ్ ట్రైన్ స్టేటస్, ఇంతకు ముందటి రైల్వే స్టేషన్, రాబోయే రైల్వే స్టేషన్, ప్రయాణ వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రయాణికులు 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్‌ను వాట్సప్ ఛాట్‌బాట్‌లో ఎంటర్ చేస్తే చాలు. పూర్తి వివరాలన్నీ తెలుస్తాయి. మరి రైలోఫై వాట్సప్ ఛాట్‌బాట్ ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

IRCTC Shirdi Tour: రూ.5,000 లోపే షిరిడీ, నాసిక్ టూర్ ... హైదరాబాద్ నుంచి స్పెషల్ ప్యాకేజీ

రైలోఫై వాట్సప్ ఛాట్‌బాట్ ఉపయోగించండి ఇలా

Step 1- ముందుగా మీ ఫోన్‌లో రైలోఫై వాట్సప్ ఛాట్‌బాట్ నెంబర్ +91-9881193322 సేవ్ చేయండి.

Step 2- మీ వాట్సప్ యాప్ ఓసారి అప్‌డేట్ చేయండి.

Step 3- వాట్సప్ ఓపెన్ చేసి కాంటాక్ట్ లిస్ట్‌లో రైలోఫై ఛాట్‌బాట్ నెంబర్ సెర్చ్ చేయండి.

Step 4- ఛాట్ విండో ఓపెన్ చేసి మీ 10 అంకెల పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయండి.

Step 5- ఆ పీఎన్ఆర్ నెంబర్‌కు సంబంధించిన వివరాలన్నీ వాట్సప్ మెసేజ్‌లో వస్తాయి.

రైల్వే ప్రయాణికులు పేటీఎం లాంటి యాప్స్ ఉపయోగించి కూడా పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేయొచ్చు. రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 కి కాల్ చేసి లైవ్ ట్రైన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అయితే స్మార్ట్‌ఫోన్ యూజర్లు వాట్సప్ యాప్ ఉపయోగిస్తుంటారు కాబట్టి ఇంకా ఈజీగా ట్రైన్ టికెట్ స్టేటస్, ఇతర వివరాలు తెలుసుకోవచ్చు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Indian Railways, IRCTC, Train tickets, Whatsapp

ఉత్తమ కథలు