హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Poco F2: బీ రెడీ... పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

Poco F2: బీ రెడీ... పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది

Poco F2: బీ రెడీ... పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది
(ప్రతీకాత్మక చిత్రం)

Poco F2: బీ రెడీ... పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తోంది (ప్రతీకాత్మక చిత్రం)

Poco F2 | ఇండియాలో పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసేందుకు పోకో ఇండియా కసరత్తు చేస్తోంది. త్వరలోనే రిలీజ్‌కు సంబంధించిన అప్‌డేట్స్ రానున్నాయి.

  పోకో ఎఫ్1... ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒకప్పుడు హాట్ కేక్‌లా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్. సాధారణంగా ఏ స్మార్ట్‌ఫోన్ అయినా ఓ ఆరు నెలల తర్వాత ఔట్ డేట్ అవుతుంది. కానీ పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌కు చాలాకాలం మార్కెట్‌లో డిమాండ్ కనిపించింది. ఇందుకు కారణం తక్కువ ధరలో అదిరిపోయే స్పెసిఫికేషన్స్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రావడమే. 2018 ఆగస్ట్‌లో రిలీజైన పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌లో ఫ్లాగ్‌షిప్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్‌తో రూపొందిన ఈ స్మార్ట్‌ఫోన్ అప్పట్లో రూ.20,000 ధరకే లభించింది. భారీ స్పెసిఫికేషన్స్‌తో తక్కువ ధరకే వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ చాలాకాలంపాటు ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంది. అప్పట్నుంచి పోకో ఎఫ్1 అప్‌గ్రేడ్ మోడల్ పోకో ఎఫ్‌2 ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూశారు పోకో ఫ్యాన్స్. కానీ పోకో ఇండియా నుంచి పోకో ఎక్స్2, పోకో ఎక్స్3, పోకో సీ3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రో, లేటెస్ట్‌గా పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ అయ్యాయి తప్ప పోకో ఎఫ్‌2 గురించి ఎలాంటి సమాచారం లేదు. కానీ పోకో ఎఫ్‌2 కోసం ఎదురుచూస్తున్నవారికి గుడ్ న్యూస్ వచ్చేసింది. త్వరలోనే ఇండియాలో పోకో ఎఫ్‌2 రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

  Smartphone: కొత్త ఫోన్ కొంటున్నారా? రూ.15,000 లోపు బెస్ట్ 10 స్మార్ట్‌ఫోన్స్ ఇవే...

  Prepaid Plans: రూ.300 లోపు Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్స్ ఇవేయా క

  పోకో, క్వాల్కమ్ త్వరలో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయని పోకో ఇండియా డైరెక్టర్ అనూజ్ శర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ రెండు సంస్థలు కలిసి పోకో ఎఫ్1 అప్‌గ్రేడ్ మోడల్ పోకో ఎఫ్2 రిలీజ్ చేయనున్నాయని అంచనాలు పెరిగాయి. రెండు వారాల్లో పోకో ఎఫ్2 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ప్రకటన రాబోతుందని భావిస్తున్నారు. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ రావచ్చని అంచనా. పోకో ఎఫ్2 5జీ స్మార్ట్‌ఫోన్ కావచ్చని భావిస్తున్నారు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 90Hz లేదా 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే లాంటి ప్రత్యేకతలు ఉండొచ్చు. ఇప్పటికే పోకో ఎఫ్1 తర్వాత ఇండియాలో X, M, C సిరీస్‌తో పోకో స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు పోకో ఎఫ్2 రిలీజ్ అయితే పోకో నుంచి F సిరీస్ కొనసాగే అవకాశముంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: 5G Smartphone, Mobile, Mobile News, Mobiles, POCO, POCO India, Smartphone, Smartphones

  ఉత్తమ కథలు