HOME »NEWS »TECHNOLOGY »good news for paytm phonepe google pay and other mobile wallet users reserve bank of india extends deadline for kyc updation ss

Good News: పేటీఎం, ఫోన్‌పే యూజర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్

Good News: పేటీఎం, ఫోన్‌పే యూజర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్
Good News: పేటీఎం, ఫోన్‌పే యూజర్లకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్ (ప్రతీకాత్మక చిత్రం)

Good News | అప్పట్లోగా మీ వ్యాలెట్‌కు కేవైసీ పూర్తి చేయకపోతే మాత్రం ఆ తర్వాత వ్యాలెట్ పనిచేయదు. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు కూడా ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది.

  • Share this:
    మీరు పేటీఎం వాడుతున్నారా? లేదా ఫోన్‌పే ఉపయోగిస్తున్నారా? వీటితో పాటు అమెజాన్ పే, గూగుల్ పే లాంటి పేమెంట్ వ్యాలెట్స్ ఏవైనా మీ ఫోన్‌లో ఉన్నాయా? మొబైల్ వ్యాలెట్ వాడుతున్నారు సరే... కేవైసీ పూర్తి చేశారా? మొబైల్ వ్యాలెట్స్‌కు ఆగస్ట్ 31 లోగా కేవైసీ పూర్తి చేయకపోతే సెప్టెంబర్ 1 నుంచి వ్యాలెట్స్ పనిచేయవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గతంలో తెలిపింది. ఆ గడువు ముగిసింది. తమ వ్యాలెట్ పనిచేయదేమో అన్న ఆందోళన యూజర్లలో ఉండగా ఆర్‌బీఐ శుభవార్త చెప్పింది. పేటీఎం, ఫోన్‌పే, అమెజాన్ పే లాంటి వ్యాలెట్స్‌లో కేవైసీ పూర్తి చేయడానికి 2020 ఫిబ్రవరి 29 వరకు గడువు పొడిగించింది. ఇప్పటివరకు కేవైసీ పూర్తిచేయని మొబైల్ వ్యాలెట్ కంపెనీలకు ఇక 2020 ఫిబ్రవరి 29 వరకు గడువు ఉంది.

    వ్యాలెట్ కేవైసీ పూర్తి చేయడానికి కంపెనీలకు అవకాశం కల్పిస్తూ ఆర్‌బీఐ గడువు పొడిగించడం ఇదే మొదటిసారి కాదు. ఈసారి ఏకంగా 6 నెలల గడువు పెంచింది. ఒకవేళ అప్పట్లోగా మీ వ్యాలెట్‌కు కేవైసీ పూర్తి చేయకపోతే మాత్రం ఆ తర్వాత వ్యాలెట్ పనిచేయదు. ఆ తర్వాత ఎలాంటి పొడిగింపు కూడా ఉండదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. పేటీఎం, ఫోన్‌పే లాంటి మొబైల్ వ్యాలెట్ కంపెనీలు యూజర్లతో కేవైసీ చేయించడం తలనొప్పిగా మారింది. ఇందుకోసం అదనంగా సిబ్బందిని నియమించుకోవాల్సి వస్తోంది. అయితే యూజర్లు స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా కేవైసీ పూర్తి చేయొచ్చు. కానీ యూజర్లు కేవైసీ గురించి పెద్దగా పట్టించుకోకపోవడం మొబైల్ వ్యాలెట్ కంపెనీలకు సమస్యగా మారింది.



    Motorola One Action: మోటోరోలా వన్ యాక్షన్ వచ్చేసింది... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    August Smartphones: ఆగస్ట్‌లో రిలీజైన 10 కొత్త స్మార్ట్‌ఫోన్స్ ఇవే... ఫీచర్స్ తెలుసుకోండి

    Redmi Note 8 Pro: నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 8 ప్రో... ప్రత్యేకతలివే

    WhatsApp Features: ఈ 4 ఫీచర్లు వస్తే మీ వాట్సప్ అదిరిపోవడం ఖాయం
    Published by:Santhosh Kumar S
    First published:September 03, 2019, 10:27 IST

    टॉप स्टोरीज