GOOD NEWS FOR ONLINE SHOPPING LOVERS GOOGLE ADDS 5 INTERESTING FEATURES ON CHROME BROWSER TO HELP TO GET BEST PRICE WHILE SHOPPING SS GH
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ ఆఫర్స్ కోసం గూగుల్ క్రోమ్‌లో 5 ఫీచర్లు
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా? బెస్ట్ ఆఫర్స్ కోసం గూగుల్ క్రోమ్‌లో కొత్తగా 5 ఫీచర్లు
(ప్రతీకాత్మక చిత్రం)
Online Shopping Tips | మీరు ఆన్లైన్ షాపింగ్ ఎక్కువగా చేస్తుంటారా? ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ లాంటి ఇకామర్స్ (e-commerce) ప్లాట్‌ఫామ్స్‌లో ఆఫర్స్ కోసం వెతుకుతుంటారా? మీకోసం గూగుల్ క్రోమ్‌లో కొత్తగా 5 ఫీచర్స్ వచ్చాయి.
క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలు సమీపిస్తున్నాయి. ఈ సంబరాలు, వేడుకల కోసం అనేక సేల్స్, ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కాని, పండగ సీజన్లో షాపింగ్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంతే కాదు ధరలు కూడా ఎక్కువ చెల్లించాల్సిన సందర్భాలూ ఉంటాయి. ఈ సమస్యకు ఇప్పుడు టెక్నాలజీ ఫుల్స్టాప్ పెడుతోంది. ఇక ఆ చికాకులేవి లేకుండా టెక్నాలజీ దిగ్గజం గూగుల్ (Google) పరిష్కారాలు అందిస్తోంది. తన వెబ్ బ్రౌజర్ క్రోమ్‌లో (Google Chrome) గూగుల్ కొత్త ఫీచర్లు చేర్చింది. వీటి ద్వారా యూజర్లు చాలా సునాయాసంగా తమ షాపింగ్ పూర్తి చేసుకోవచ్చు.
గూగుల్ క్రోమ్‌లో కొత్తగా వచ్చిన ఈ ఫీచర్స్ ద్వారా ఏం కొనగదలిచారు, ఆర్డర్ చేసిన వస్తువులు ఎక్కడి వరకు వచ్చాయో సులభంగా ట్రాక్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్లు కేవలం అమెరికాలో అది కూడా ఆండ్రాయిడ్ ఫోన్లలోనే గూగుల్ విడుదల చేసింది. అతి తొందరలోనే iOS యూజర్లు కూడా ఈ ఫీచర్లు అందుబాటులోకి తెస్తామని గూగుల్ ప్రకటించింది.
గూగుల్ క్రోమ్‌లో కొత్తగా వచ్చిన ఆ ఫీచర్లు ఏంటో చూద్దాం రండి
ధరల తగ్గింపును తెలియజేసే ఫీచర్: ఆండ్రాయిడ్‌లోని క్రోమ్‌లో ఉన్న ఈ కొత్త ఫీచర్ ద్వారా ఒపెన్ ట్యాబ్స్ గ్రిడ్‌లో ఒక వస్తువు ధర తగ్గిన వెంటనే యూజర్లు దాన్ని చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాలోని ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. iOS యూజర్లకు ఇది అది త్వరలోనే చేరవకానుంది.
ఆఫ్‌లైన్ వస్తువుల కోసం ఆన్లైన్ సెర్చ్: ఇది ఒక వినూత్నమైన ఫీచర్. మీరు విండో షాపింగ్ చేస్తున్నారు. అక్కడ కనిపించిన ఒక వస్తువు మీ దృష్టిని ఆకర్షించింది. మీరు వెంటనే మీ ఆండ్రాయిడ్ ఫోన్లోని క్రోమ్ ఒపెన్ చేసి గూగుల్ లెన్స్ ఒపెన్ చేసేందుకు కెమెరా ఐకాన్‌పై క్లిక్ చేసిన మీ దృష్టిని ఆకర్షించిన వస్తువులను సెర్చ్ చేయవచ్చు.
కార్టులో ఉన్నవాటి ట్రాకింగ్: యూవర్ కార్ట్స్‌లో అనే కొత్త ఫీచర్ కొత్త ట్యాబ్‌పై కనిపిస్తుంది. ఇందులో యూజర్లు ఏదైనా సైటులో ఐటమ్స్ షాపింగ్ కార్టులో యాడ్ చేసినట్టు అయితే అవన్నీ యూవర్ కార్ట్స్‌లో కనిపిస్తాయి. వాటిని చూసి ఏవి అవసరమో, ఏవి వద్దో డిసైడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అమెరికాలో విండోస్, మ్యాక్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.
ఆటోమ్యాటిక్‌గా పాస్వర్డ్స్ క్రియేట్ చేయడం: ఈ సరికొత్త ఫీచర్ ద్వారా ప్రత్యేకమైన, సురక్షితమైన పాస్‌వర్డ్‌ను క్రోమ్ క్రియేట్ చేస్తుంది. ఆ లాగిన్ డిటెయిల్స్ సేవ్ చేసుకోవచ్చు. మరోసారి ఆ సైటును విజిట్ చేసినప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు.
సింపుల్ చెక్ ఔట్: ఆటోఫిల్ ద్వారా మీ అడ్రస్, పేమెంట్ సమాచారాన్ని సేవ్ చేసుకొని మీ చెక్ ఔట్ ప్రాసెస్‌ను గూగుల్ క్రోమ్ సులభతరం చేస్తుంది. చెక్ ఔట్ సమయంలో మీ బిల్లింగ్, షిప్పింగ్ వివరాలు ఆటోమ్యాటిక్‌గా ఫిల్ అయిపోతాయి. కొత్త ఫామ్‌లో మీరు ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసినప్పుడు దాన్ని సేవ్ చేయాలనుకుంటున్నారా అని క్రోమ్ అడుగుతుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.