వన్‌ప్లస్ 10 ప్రో లాంచింగ్ సందర్భంగా.. వినియోగదారులకు ఓ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రో మార్కెట్లోకి రాక ముందే.. దీన్ని గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది.
చైనీస్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్(OnePlus) భారత మార్కెట్లో దూసుకుపోతోంది. ఇదే వేగంతో వన్‌ప్లస్10 ప్రో పేరుతో ఈ నెలాఖరులోగా మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే ఈ ఫోన్ చైనాలో(China) అందుబాటులోకి వచ్చింది. దీంతో, భారత్‌కు(India) ఎప్పుడు వస్తుందా అని వన్‌ప్లస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో, ఎట్టకేలకు వన్‌ప్లస్ 10 ప్రో(OnePlus 10 Pro) లాంచింగ్‌కు సంబంధించిన టీజన్ను విడుదల చేసింది కంపెనీ. దీని స్పెసిఫికేషన్లను టీజ్ చేసింది. మరోవైపు, వన్‌ప్లస్ 10 ప్రో లాంచింగ్ సందర్భంగా.. వినియోగదారులకు ఓ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. వన్‌ప్లస్ 10 ప్రో మార్కెట్లోకి రాక ముందే.. దీన్ని గెలుచుకునే అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి గల యూజర్లు వన్‌ప్లస్‌కు చెందిన ‘ది ల్యాబ్’లో చేరి వన్‌ప్లస్ 10 ప్రో పర్ఫార్మెన్స్ ఎలా ఉందో స్వయంగా చూడవచ్చు. తద్వారా, ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌పై రివ్యూ రాయడం మాత్రమే కాదు.. దీన్ని గెలుచుకోవచ్చు. ఆసక్తి గల వారు మార్చి 26లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వన్‌ప్లస్ తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.
"మా ప్రియమైన వినియోగదారులను ‘ది ల్యాబ్’లో చేరడానికి స్వాగతిస్తున్నాం. భారత మార్కెట్లోకి రిలీజ్ కాకముందే వన్‌ప్లస్ 10 ప్రోలోని ఫీచర్లను ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం కల్పిస్తున్నాం. టెక్ ఔత్సాహికులు, స్మార్ట్ఫోన్ల పట్ల అపారమైన జ్ఞానం, అభిరుచి ఉన్న ఎవరైనా ఈ చొరవలో భాగం కావచ్చు.” అని వన్‌ప్లస్ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. వన్‌ప్లస్ ల్యాబ్ టెస్ట్‌లో భాగం కావడానికి వన్‌ప్లస్ 10 ప్రో ప్రోడక్ట్ పేజీలో ఫారమ్‌ను సబ్మిట్ చేయాల్సిఉంటుంది.
అప్లికేషన్లో భాగంగా మీ ఫోన్ ఫోటోలు, రివ్యూ వీడియోలకు సంబంధించిన లింక్‌లను షేర్ చేయాలని వన్‌ప్లస్ కోరుకుంటోంది. వన్‌ప్లస్ కమ్యూనిటీ సమీక్షకులు మాత్రమే ఈ లింక్‌లను యాక్సెస్ చేయగలరు. మార్చి 28న వన్‌ప్లస్ 10 ప్రో 5G ల్యాబ్ సమీక్షకుల పేర్లను కంపెనీ ప్రకటిస్తుంది. అదే తేదీన సెలెక్టెడ్ రివ్యూయర్లకు వన్‌ప్లస్ ఫోన్లను డెలివరీ చేస్తుంది. ఫోన్ అన్బాక్సింగ్ మార్చి 31న జరుగుతుంది. ఏప్రిల్ 1 నుండి ల్యాబ్ రివ్యూ ప్రారంభమవుతుంది.
వన్‌ప్లస్ సంస్థ నుంచి రిలీజ్ కానున్న సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రో. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ డేట్‌పై కంపెనీ ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. వచ్చే వారంలో దీనిపై స్పష్టతరానుంది. హాసెల్‌బ్లాడ్ కెమెరాలతో వస్తున్న రెండో ఫోన్ ఇదే కావడం విశేషం. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో పనిచేస్తుంది. దీని వెనుకవైపు కెమెరా మాడ్యూల్తో కూడిన డిజైన్‌ను అందించింది. ఇది 120Hz AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక, దీని ధరపై కంపెనీ ఇంకా స్పష్టతనివ్వలేదు.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.