GOOD NEWS FOR ONEPLUS FANS ONEPLUS NORD CE2 5G TO LAUNCH ON THIS DATE SS
OnePlus: కొత్త వన్‌ప్లస్ నార్డ్ వచ్చేస్తోంది... రిలీజ్ ఎప్పుడంటే
OnePlus: కొత్త వన్‌ప్లస్ నార్డ్ వచ్చేస్తోంది... రిలీజ్ ఎప్పుడంటే
(image: OnePlus India)
OnePlus Upcoming Smartphone | వన్‌ప్లస్ ఫ్యాన్స్‌కు శుభవార్త. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 మోడల్ వచ్చే నెలలో రిలీజ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి.
బడ్జెట్ సెగ్మెంట్లో వన్‌ప్లస్ నుంచి నార్డ్ స్మార్ట్‌ఫోన్స్ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు స్మార్ట్ఫోన్లు ఇండియాలో రిలీజ్ అయ్యాయి. వన్‌ప్లస్ నార్డ్, వన్‌ప్లస్ నార్డ్ 2 (OnePlus Nord 2), వన్‌ప్లస్ నార్డ్ సీఈ (OnePlus Nord CE) మోడల్స్‌ని కంపెనీ రిలీజ్ చేసింది. వీటిలో వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలో వన్‌ప్లస్ నార్డ్ సీఈ మోడల్ రిలీజ్ కానుంది. ఈ రిలీజ్‌కు సంబంధించిన వివరాలను ఓ టిప్‌స్టర్ వెల్లడించారు. ఫిబ్రవరి 11న వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ మోడల్ రిలీజ్ కానుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 రిలీజ్‌కు సంబంధించి కంపెనీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. మొదట ఈ స్మార్ట్‌ఫోన్ నార్త్ అమెరికాలో లాంఛ్ కానుందని అంచనా. ఆ తర్వాత గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ అవుతుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది. ఒప్పో రెనో 7 ఎస్ఈ మోడల్‌ను వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 5జీ పేరుతో రిలీజ్ చేయొచ్చని భావిస్తున్నారు. చైనాలో రిలీజ్ అయిన ఒప్పో రెనో 7 ఎస్ఈ ఫీచర్స్ చూస్తే ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ+ అమొలెడ్ డిస్ప్లే ఉంది. 48మెగాపిక్సెల్ Sony IMX581 ప్రైమరీ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 5జీ నెట్వర్క్ సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ప్రస్తుతం ఉన్న రూమర్లు నిజమైతే వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 మోడల్లో ఇవే ఫీచర్స్ ఉంటాయి.
ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.22,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.27,999. వన్‌ప్లస్ నార్డ్ సీఈ2 కూడా దాదాపు ఇదే బడ్జెట్లో రిలీజ్ కావొచ్చు. ఈ కొత్త మోడల్ వచ్చిన తర్వాత వన్‌ప్లస్ నార్డ్ సీఈ అందుబాటులో ఉండకపోవచ్చు.
ఇక వన్‌ప్లస్ నార్డ్ 2 రిలీజ్ అయి చాలాకాలం అయింది. త్వరలో వన్‌ప్లస్ నార్డ్ 3 కూడా రిలీజ్ కానుంది. అంతేకాదు... వన్‌ప్లస్ నుంచి త్వరలో రూ.20,000 లోపు స్మార్ట్‌ఫోన్ రాబోతుందన్న వార్తలు కూడా ఉన్నాయి. రూ.20,000 లోపు సెగ్మెంట్లోకి వన్‌ప్లస్ అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరి వన్‌ప్లస్ నుంచి నార్డ్ 3, నార్డ్ సీఈ2 మోడల్స్ కాకుండా మరో స్మార్ట్‌ఫోన్ కూడా వస్తుందా లేదా చూడాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.