OnePlus తిరిగి వచ్చింది! ఇటీవలే తన 9వ వార్షికోత్సవం జరుపుకున్న ఈ టెక్నాలజీ కంపెనీ, OnePlus 11 5G, OnePlus Buds Pro 2, మరియు “మరిన్ని OnePlus ప్రోడక్ట్‌ల శ్రేణి”ని లాంఛ్ చేయడానికి 2023, ఫిబ్రవరి 7న న్యూఢిల్లీలో ఆఫ్‌లైన్, గ్లోబల్ లాంఛ్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఆ ప్రోడక్ట్‌ల శ్రేణి ఏమిటా అని అందరికి ఆత్రుతగా ఉంది. అదనపు ఆకర్షణ ఏమిటంటే, ఈ ఈవెంట్ భారతదేశంలో ఈ కంపెనీ 2019 తర్వాత నిర్వహిస్తున్న మొట్టమొదటి ఈవెంట్!
సోషల్ మీడియాలో OnePlus 11 5G గురించి టీజర్లు చూస్తునే ఉన్నాం, ఇది అందమైన ఫోన్ అనేది ఒప్పుకుని తీరాల్సిన విషయం. సొగసైన స్టైలింగ్‌తో పాటు దీని ప్రత్యేకమైన ఫీచర్ వెనుక ఉన్న భారీ కెమెరా బంప్, దీనిలో మూడు కెమెరా మాడ్యూల్‌లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి, ఇంకా ఉత్సాహకరమైన విషయం Hasselblad బ్రాండింగ్. వంపులు తిరిగిన అలర్ట్ స్లైడర్, ఆహా ఏమి సొగసు!
OnePlus ఒక టెక్నాలజీ బ్రాండ్‌గా తనకి మద్దతునిచ్చే అభిమానుల ఆదరణ ఆధారంగా మలచుకుంది. వారికి వచ్చిన ఫీడ్‌బ్యాక్ పరిగణించి దాని ఆధారంగా డిజైన్ ప్రాసెస్ మార్చడం వీరి ప్రత్యేకత, అలర్ట్ స్లైడర్‌ను మళ్ళీ పరిచయం చేయడమే దీనికి నిదర్శనం. Hasselblad కూడా మంచి విషయం, ఇది ఫోన్ కెమెరా క్యాప్చర్ చేసిన చిత్రాల రంగులను మరింత ఆకర్షణీయం చేయడానికి Hasselblad మరియు OnePlus మళ్ళీ కలిసి పనిచేస్తున్నాయి అని నిదర్శనం.
మీకు గుర్తుండే ఉంటుంది, Hasselblad-ట్యూన్డ్ రంగులు OnePlus ఇది వరకే తీసుకువచ్చిన మోడల్స్‌లో సహజమైన, కంటితో చూస్తే కనిపించే అసలైన రంగులు అందించి, ఫోటో తీయడాన్ని ఒక అందమైన అనుభూతిగా మలిచింది. అదనంగా, ఫోటోగ్రాఫర్లు మరింత ప్రత్యేకమైన మరియు ఆసక్తికరమైన చిత్రాలను తీయడానికి అనుకూలంగా X-ప్యాన్ మోడ్ కూడా ఉండేది.
OnePlus 11 5G మరియు Buds Pro 2 విషయానికి వస్తే, ఈ సమయంలో వీటి గురించి మనకి అంతగా తెలియదు. OnePlus, అప్‌గ్రేడ్ అయిన టెక్నాలజీ మరియు పనితీరుతో మనల్ని “క్లౌడ్ 9” నుండి “క్లౌడ్ 11”కు తీసుకెళ్తామనే భరోసా ఇచ్చింది. నిజానికి వారు తమ వేగం మరియు సున్నితమైన పనితీరు స్థాయిని పెంచుతున్నాం అని చెప్తున్నారు. దానిపై మనకి ఎలాంటి సందేహాలు అవసరం లేదు, ఎందుకంటే, OnePlus ఫోన్‌లు ఎప్పుడూ కూడా లేటెస్ట్ మరియు అద్భుతమైన హార్డ్‌వేర్‌ను అందించి, ప్రతీ సారి అద్భుతమైన పనితీరును అందిస్తుంది.
బడ్స్ ఒక రహస్యం. ఇదివరకటి Bud Proలానే, మనకి మరింత మెరుగైన, ఫుల్-బాడీడ్, స్టూడియో నాణ్యత ఉన్న ఆడియో మరియు “అత్యంత స్పష్టత” లభిస్తుంది అనే భరోసా అందిస్తుంది. మనం కొత్త Buds అందించే అనుభవం విషయంలో అత్యంత ఉత్సాహంగా ఉంది.
లాంఛ్ ఈవెంట్ దగ్గర ఏమి జరిగినా, మేము OnePlus, ప్రీమియం బిల్డ్, అధిక-పనితీరు హార్డ్‌వేర్ అందించే ‘నిరంతరం కొత్తదనం’ అనే మంత్రానికి కట్టుబడి ఉంటుంది అని నమ్ముతున్నాం. OnePlus ఎల్లప్పుడూ ఆ విషయంలో నిరాశ పరచదు!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Oneplus, Smartphone