రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. జియో ప్లాన్స్‌పై మీరు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. రిలయన్స్ జియో ఇటీవల ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ (Prepaid Plans) ధరల్ని పెంచిన సంగతి తెలిసిందే. వీటిలో మూడు ప్రీపెయిడ్ ప్లాన్స్‌పై క్యాష్‌బ్యాక్ అందిస్తోంది జియో. రూ.299, రూ.666, రూ.719 ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే 20 శాతం జియోమార్ట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. రిలయన్స్ జియో కస్టమర్లు ప్రతీ రోజూ రూ.200 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ క్యాష్‌బ్యాక్‌ను జియో రీఛార్జ్, జియోమార్ట్, రిలయన్స్ స్మార్ట్, ఆజియో, రిలయన్స్ ట్రెండ్స్, రిలయన్స్ డిజిటల్, నెట్‌మెడ్స్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌పై ఉపయోగించుకోవచ్చు. మరి జియోమార్ట్ క్యాష్‌బ్యాక్ లభించే ప్లాన్స్‌పై ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసుకోండి.
Jio Rs 299 Plan: జియో రూ.299 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 56జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, లాంటి జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఈ ప్లాన్‌పై 20 శాతం జియోమార్ట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Infinix Note 11: ఇన్ఫీనిక్స్ నోట్ 11 సేల్ మొదలైంది... ఆఫర్ ధర రూ.11,999 మాత్రమే
Jio Rs 666 Plan: జియో రూ.666 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 126జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, లాంటి జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఈ ప్లాన్‌పై 20 శాతం జియోమార్ట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Jio Rs 719 Plan: జియో రూ.719 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. మొత్తం 168జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉచితం. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు వాడుకోవచ్చు. జియో టీవీ, జియో సినిమా, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్, లాంటి జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. ఈ ప్లాన్‌పై 20 శాతం జియోమార్ట్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.
Android Apps: మరో 7 యాప్స్‌లో జోకర్ మాల్‌వేర్... మీ ఫోన్‌లోంచి వెంటనే డిలిట్ చేయండి
ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసిన కస్టమర్లకు జియోమార్ట్ క్యాష్‌బ్యాక్ వారి అకౌంట్లలో మూడు రోజుల్లో క్రెడిట్ అవుతుంది. జియో యూజర్లు క్యాష్‌బ్యాక్ పొందాలంటే జియో వెబ్‌సైట్ లేదా మైజియో యాప్‌లో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో రీఛార్జ్ చేస్తే క్యాష్‌బ్యాక్ వర్తించదు. కేవలం పైన వివరించిన మూడు ప్లాన్స్‌కు మాత్రమే 20 శాతం వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. ఇతర ప్లాన్స్‌కు ఈ ఆఫర్ లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, JioMart, Reliance Jio