స్మార్ట్‌ఫోన్‌లో వీడియో కాల్స్ చేయాలంటే సెల్ఫీ కెమెరా ఆన్‌లో ఉండాలి. సెల్ఫీ కెమెరా లేకపోతే వీడియో కాల్స్ చేయలేరు. ఒకవేళ ల్యాప్‌టాప్‌లో వీడియో కాల్స్ చేయాలన్నా ల్యాప్‌టాప్‌కు కెమెరా ఉండాలి. ఇక డెస్క్‌టాప్ కంప్యూటర్లో వీడియో కాల్స్ చేయడానికి వెబ్ కెమెరా లేదా వెబ్‌క్యామ్ కావాలి. టీవీలో కూడా వీడియో కాల్స్ చేయొచ్చు. ఇందుకోసం వెబ్‌క్యామ్ కావాలి. కానీ వెబ్‌క్యామ్ లేకుండా టీవీ నుంచి వీడియో కాల్స్ చేయొచ్చు. జియోఫైబర్ యూజర్లకు రిలయెన్స్ జియో అందిస్తున్న అద్భుతమైన ఫీచర్ ఇది. ఎక్స్టర్నల్ కెమెరా లేదా వెబ్‌క్యామ్ లేకుండానే జియోఫైబర్ యూజర్లు టీవీల ద్వారా వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. 'కెమెరా ఆన్ మొబైల్' పేరుతో ఈ ఫీచర్ అందిస్తోంది.
Mi 11 Lite: ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.3,500 డిస్కౌంట్... ఆఫర్ వివరాలు ఇవే
Gas Cylinder offer: గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై రూ.900 క్యాష్‌బ్యాక్... మూడుసార్లు ఆఫర్ పొందండి ఇలా
జియోజాయిన్ యాప్ ద్వారా 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్ వాడుకోవచ్చు. గతంలో జియోకాల్ పేరుతో ఉన్న యాప్ జియోజాయిన్గా మారింది. జియోజాయిన్ యాప్‌ను ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్‌లు ఉన్నవారు ఈ యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. ఈ యాప్ ఉపయోగించి జియోఫైబర్వాయిస్ ద్వారా వీడియో కాల్స్ చేయొచ్చు. జియో ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు లభించే కాలింగ్ సపోర్ట్ ఇది. స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కెమెరా వెబ్క్యామ్లాగా పనిచేస్తుంది. టీవీలో వీడియో కనిపిస్తుంది. 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్‌ను చాలాకాలంగా టెస్ట్ చేస్తోంది జియోఫైబర్. ఈ ఫీచర్ సక్సెస్ కావడంతో యూజర్లకు రిలీజ్ చేసింది.
Jio Recharge: జియో రీఛార్జ్ చేస్తే క్యాష్‌బ్యాక్... ఆఫర్ వివరాలు తెలుసుకోండి
UMANG App: పీఎఫ్ డబ్బులు డ్రా చేయాలా? ఉమాంగ్ యాప్‌లో అప్లై చేయండి
స్మార్‌ఫోన్‌లోని కెమెరాను ఉపయోగించి టీవీ ద్వారా వీడియో కాల్స్ చేయడానికి ముందుగా 10 అంకెల జియోఫైబర్ నెంబర్‌ను జియోజాయిన్ యాప్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత జియోజాయిన్ యాప్ సెట్టింగ్స్‌లో 'కెమెరా ఆన్ మొబైల్' ఫీచర్ ఎనేబుల్ చేయాలి. ఇక మీరు మీ టీవీ నుంచి వీడియో కాల్స్ చేయొచ్చు. వీడియో కాల్స్ క్లారిటీ బాగా ఉండటానికి మోడెమ్‌లో 5GHz వైఫై బ్యాండ్ ఆన్ చేయాలి. 2.4GHz బ్యాండ్‌లో కూడా వీడియో కాల్స్ చేయొచ్చు. జియోజాయిన్ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లో డౌన్లోడ్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Jio, JioFiber, Reliance Jio