హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Gmail: జీమెయిల్‌లో వచ్చే ఇమెయిల్స్ ఆటోమెటిక్‌గా డిలిట్ చేయొచ్చు ఇలా

Gmail: జీమెయిల్‌లో వచ్చే ఇమెయిల్స్ ఆటోమెటిక్‌గా డిలిట్ చేయొచ్చు ఇలా

Gmail: జీమెయిల్‌లో వచ్చే ఇమెయిల్స్ ఆటోమెటిక్‌గా డిలిట్ చేయొచ్చు ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Gmail: జీమెయిల్‌లో వచ్చే ఇమెయిల్స్ ఆటోమెటిక్‌గా డిలిట్ చేయొచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Gmail Tips | వేల సంఖ్యలో వచ్చిన ఇమెయిల్స్‌తో మీ జీమెయిల్ (Gmail) నిండిపోయిందా? ఈ మెయిల్స్ డిలిట్ చేయడానికి గంటలు గంటలు కూర్చోవాల్సిన అవసరం లేదు. జీమెయిల్‌లో ఈ టెక్నిక్‌తో మెయిల్స్ డిలిట్ చేయొచ్చు.

  జీమెయిల్ యూజర్లను ప్రధానంగా వేధించే సమస్య ఇమెయిల్స్‌తో ఇన్‌బాక్స్ నిండిపోవడం. జీమెయిల్ (Gmail) ఇన్‌బాక్స్‌లో పర్సనల్‌గా వచ్చే ఇమెయిల్స్‌తో పాటు అప్‌డేట్స్, సోషల్, ప్రమోషన్స్ సెక్షన్లలో మెయిల్స్ వస్తుంటాయి. స్పామ్ ఫోల్డర్ కూడా మెయిల్స్‌తో నిండిపోవడం గూగుల్ యూజర్లకు మరో సమస్య. ఈ మెయిల్స్‌ని డిలిట్ చేయడం ఓ పెద్ద సమస్య. కొందరైతే ఏళ్లకేళ్లు అలాగే ఇన్‌బాక్స్‌లో మెయిల్స్ వదిలేస్తూ ఉంటారు. వాటిని డిలిట్ చేయాలని కూడా ఆలోచించరు. మెయిల్స్ డిలిట్ చేయకుండా అలాగే వదిలేస్తే మరో సమస్య. జీమెయిల్ ఇచ్చిన స్టోరేజ్ (Gmail Storage) నిండిపోతుంది. కాబట్టి అవసరం లేని మెయిల్స్ డిలిట్ చేయకతప్పదు.

  జీమెయిల్‌లో వేల సంఖ్యలో వచ్చిన మెయిల్స్ డిలిట్ చేయాలంటే పెద్ద తలనొప్పే. ఇప్పుడా టెన్షన్ లేదు. జీమెయిల్ సరికొత్త ఫీచర్ అందిస్తోంది. ఫిల్టర్స్ ఫీచర్ ద్వారా ఆటోమెటిక్‌గా మెయిల్స్‌ని డిలిట్ చేయొచ్చు. స్టోరేజ్ ఫుల్ కాకుండా జాగ్రత్తపడొచ్చు. మరి జీమెయిల్‌లో ఆటోమెటిక్‌గా మెయిల్స్ డిలిట్ చేసే ఫీచర్‌ను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.

  Year Ender 2021: ఈ ఏడాది ఆండ్రాయిడ్‌లో 8 బెస్ట్ యాప్స్ ఇవే... మీ ఫోన్‌లో ఎన్ని ఉన్నాయి?

  Gmail Tips: జీమెయిల్‌లో ఫిల్టర్ క్రియేట్ చేయండి ఇలా


  Step 1- ముందుగా మీ కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేయండి.

  Step 2- సెర్చ్ బార్‌లో ఫిల్టర్స్ ఐకాన్ పైన క్లిక్ చేయండి.

  Step 3- ఈ ఐకాన్ కనిపించకపోతే సెట్టింగ్స్ సెక్షన్‌లో Filters and blocked addresses ట్యాబ్ సెలెక్ట్ చేయాలి.

  Step 4- ఆ తర్వాత Create a new filter బటన్ పైన క్లిక్ చేయాలి.

  Step 5- ఆ తర్వాత From సెలెక్ట్ చేయాలి.

  Step 6- ముఖ్యమైనవి కాని ఇమెయిల్ అడ్రస్ లేదా పేరు సెలెక్ట్ టైప్ చేయాలి.

  Step 7- ఉదాహరణకు మీకు ఫేస్‌బుక్ నుంచి వచ్చే ఇమెయిల్స్ అవసరం లేదనుకుంటే Facebook అని టైప్ చేయాలి.

  Step 8- వీలైనంతవరకు పేరు కాకుండా ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయడానికి ట్రై చేయాలి.

  Step 9- ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే ఆ మెయిల్ ఐడీ నుంచి వచ్చే మెయిల్స్ డిలిట్ అవుతాయి.

  Step 10- మెయిల్ ఐడీ ఎంటర్ చేసిన తర్వాత Create filter పైన క్లిక్ చేయాలి.

  Step 11- ఆ తర్వాత Delete it ఆప్షన్ సెలెక్ట్ చేయాలి.

  Step 12- ఆ తర్వాత మళ్లీ Create filter పైన క్లిక్ చేయాలి.

  Tecno Spark 8 Pro: రూ.10,000 బడ్జెట్‌లో టెక్నో స్పార్క్ 8 ప్రో రిలీజ్... ఫీచర్స్ ఇవే

  ఇక ఆ మెయిల్ ఐడీతో ఉన్న పాత మెయిల్స్ అన్నీ డిలిట్ అవుతాయి. రాబోయే ఇమెయిల్స్ కూడా ఆటోమెటిక్‌గా డిలిట్ అవుతాయి. మీరు క్రియేట్ చేసిన ఫిల్టర్ ప్రకారం మెయిల్స్‌ను డిలిట్ చేస్తుంది జీమెయిల్. మీరు క్రియేట్ చేసిన ఫిల్టర్స్‌ని డిలిట్ చేయొచ్చు. సెట్టింగ్స్‌లో Filters and blocked addresses సెక్షన్‌లో ఫిల్టర్స్‌ను ఎడిట్ చేయొచ్చు లేదా డిలిట్ చేయొచ్చు.

  ప్రతీ యూజర్‌కు గూగుల్ అకౌంట్‌లో 15జీబీ కోటా ఉంటుంది. జీమెయిల్, డ్రైవ్, ఫోటోస్ లాంటి గూగుల్ యాప్స్ అన్నింటికీ ఈ కోటా వర్తిస్తుంది. అంతకన్నా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే గూగుల్‌కు డబ్బులు చెల్లించాలి. 100జీబీ స్టోరేజ్ కోసం ఏటా రూ.1,100 చెల్లించాల్సి ఉంటుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: GMAIL, Google

  ఉత్తమ కథలు