LG Wireless solutions: గుడ్‌న్యూస్.. ఎలక్ట్రిక్ స్కూటర్లకు వైర్‌లెస్ చార్జింగ్.. ఎలాగంటే..

ప్రతీకాత్మక చిత్రం

బూషన్‌లో ప్రస్తుతం ఐదు పార్కింగ్ జోన్లలో 20 వైర్లెస్ ఛార్జింగ్ కిక్ స్పాట్లు అందుబాటులో ఉన్నట్లు LG సంస్థ స్పష్టం చేసింది. వాటిని వైర్లెస్ ఛార్జింగ్ రిసీవర్ ప్యాడ్‌లతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది.

  • Share this:
భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా విద్యుత్ వాహనాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. సింగిల్ ఛార్జింగ్ తో ఎక్కువ దూరం ప్రయాణించే సామర్థ్యాన్ని పొందుపరిచేలా ఆటో సంస్థలు వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే త్వరలో వీటికి వైర్లెస్ ఛార్జింగ్ సదుపాయాన్ని తీసుకురానుంది దక్షిణ కొరియా టెక్ దిగ్గజం LG. మొబైల్ ఫోన్లకే వైర్లెస్ ఛార్జర్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్న తరుణంలో విద్యుత్ స్కూటర్లకు ఈ తరహా ఛార్జర్లను తయారు చేయాలని సంస్థ భావిస్తోంది. తాజాగా పశ్చిమ సియోల్ సమీపంలోని బూషన్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కేంద్రాలను ప్రారంభించినట్లు స్పష్టం చేసింది. ఇందుకు స్థానిక ఎలక్ట్రిక్ స్కూటర్ల షేరింగ్ సర్వీస్ సంస్థ కిక్ గోయింగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. సియోల్, ఇతర ప్రాంతాల్లో వచ్చే ఆరు నెలల్లో వీటిని విస్తరించాలని ఈ రెండు కంపెనీలు నిర్ణయించాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ల వైర్లెస్ ఛార్జింగ్ సొల్యుషన్స్ కు సంబంధించిన భద్రత, వినియోగం లాంటి ఇతర అంశాలను కంపెనీలు పరిగణనలోకి తీసుకోనున్నాయి.

ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇచ్చేవారికి ధరలో రాయితీ..
బూషన్‌లో ప్రస్తుతం ఐదు పార్కింగ్ జోన్లలో 20 వైర్లెస్ ఛార్జింగ్ కిక్ స్పాట్లు అందుబాటులో ఉన్నట్లు LG సంస్థ స్పష్టం చేసింది. వాటిని వైర్లెస్ ఛార్జింగ్ రిసీవర్ ప్యాడ్‌లతో ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ స్కూటర్ షేరింగ్ సేవల్లో సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, ఎక్కువ మంది యూజర్లను తీసుకురావడానికి ఈ పరిష్కారాలు సరిపోతాయని రెండు సంస్థలు ఆశిస్తున్నాయి. వైర్లెస్ ఛార్జింగ్ స్టేషన్ల కోసం స్కూటర్లను తిరిగి ఇచ్చే వినియోగదారులకు ధర తగ్గింపును అందించాలని ప్రస్తుతం వారు యోచిస్తున్నారు.

పర్సనల్ మొబిలిటీ బిజినెస్‌కు సంబంధించి కిక్ గోయింగ్ మరింత సమషితత్వాన్ని(Synergy) సృష్టించేలా దృష్టి పెడుతున్నామని LG వైర్లెస్ పవర్ కన్సోర్టియం బోర్డు మెంబర్ ఒకరు స్పష్టం చేశారు. స్థానిక స్టార్టప్స్ నిర్వహిస్తున్న కిక్ గోయింగ్ 2018 సెప్టెంబరులో విద్యుత్ స్కూటర్ షేరింగ్ సర్వీసులను ప్రారంభించింది. తక్కువ సమయంలోనే 1.2 మిలియన్ల సబ్ స్క్రైబర్లను పొందింది.

గతంతో పోలిస్తే విద్యుత్ స్కూటర్ల తయారీ ఇటీవల కాలంలో విరివిగా పెరిగింది. పర్యావరణహితమైన ఈ వాహనాలు యువతను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా మెట్రోలు, పట్టణాల్లో ఉండేవారు వీటిపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. స్వల్ప గమ్యాలను చేరేందుకు ఇవి బాగా ఉపయోగపడుతున్నాయని భావిస్తున్నారు. ఈ కారణంగా ప్రస్తుత నగరవాసులు విద్యుత్ స్కూటర్ల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: