Home /News /technology /

GOOD NEWS FOR DIGILOCKER USERS YOU CAN SAVE INSURANCE POLICIES SOON IN DIGILOCKER SS GH

Digilocker: డిజిటల్ లాకర్‌లో ఇన్సూరెన్స్ పాలసీ... బీమా క్లెయిమ్స్ మరింత వేగంగా

Digilocker: డిజిటల్ లాకర్‌లో ఇన్సూరెన్స్ పాలసీ... బీమా క్లెయిమ్స్ మరింత వేగంగా
(ప్రతీకాత్మక చిత్రం)

Digilocker: డిజిటల్ లాకర్‌లో ఇన్సూరెన్స్ పాలసీ... బీమా క్లెయిమ్స్ మరింత వేగంగా (ప్రతీకాత్మక చిత్రం)

Digilocker | డిజీలాకర్ యూజర్లకు శుభవార్త. త్వరలో మీ ఇన్స్యూరెన్స్ పాలసీలను డిజీలాకర్‌లో భద్రపర్చుకోవచ్చు.

డిజిలాకర్లు అందుబాటులోకి వచ్చాక పలు కీలక డాక్యుమెంట్లను డిజిటల్ ఫామ్‌లో శాశ్వతంగా పదిలంగా దాచుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఈకోవలో వ్యక్తుల ప్రైవేటు డాక్యుమెంట్లను మరిన్ని చేర్చే పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇన్సూరెన్స్ రంగంలోని ఇలాంటి డిజిటల్ సర్టిఫికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇన్సూరెన్స్ సర్టఫికెట్లను ఎలక్ట్రానిక్ ఫార్మ్ లో దాచుకునే సౌలభ్యం త్వరలో అందుబాటులోకి రానుంది. డిజిటైజేషన్ కొత్త పుంతలు తొక్కుతున్న క్రమంలో ఫిజికల్ డాక్యుమెంట్లకంటే సాఫ్ట్ కాపీలను భద్రంగా డిజిటల్ లాకర్ లో దాచుకునే అవకాశం వచ్చింది. పైపెచ్చు ప్రపంచంలో ఏ మూలన మనం ఉన్నప్పటికీ ఈ డిజిటల్ లాకర్ లోని పత్రాలను చూడటం, ఉపయోగించుకోవటం వంటివి చేయచ్చు. పాలసీ హోల్డర్లకు సింపుల్ గా డాక్యుమెంట్లను భద్రపరచుకునేలా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవల్పమెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI ఇన్సూరెన్సు కంపెనీలు చర్యలు తీసుకోవాలంటూ కొత్త పాలసీని వెల్లడించింది. డిజిలాకర్ అంటే డిజిటల్ లాకర్ యాప్. మొబైల్ ఫోన్, కంప్యూటర్, ఐప్యాడ్ ఇలా దేంట్లోనైనా వీటిని ఓపన్ చేసుకోవచ్చన్నమాట. ఈ యాప్ ను ఈజీగా గూగుల్, యాపిల్ ప్లే, యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ATM: ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి కొత్త ఫీచర్... కార్డు, పిన్, ఓటీపీ అవసరం లేదు

Honda Activa 6G: ఒక్క రూపాయి చెల్లించకుండా హోండా యాక్టీవా 6జీ ఇంటికి తీసుకెళ్లండి

డిజిటల్ ఇండియాలో భాగం


డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఈ డిజిటల్ లాకర్ విధానాలను అతి త్వరలో అందుబాటులోకి తేనున్నారు. ఆథెంటిక్ డాక్యుమెంట్లు లేదా సర్టిఫికెట్లను ఇక మీరు సురక్షితంగా కాపాడుకునే వెసులుబాటు ఈ టెక్నాలజీ కల్పిస్తుంది. ఫిజికల్ డాక్యుమెంట్ల వినియోగాన్ని బాగా తగ్గించేలా ఇది సహకరిస్తుంది. అంతేకాదు పౌరులు చాలా ఈజీగా సర్వీసు డెలివరీల కోసం డిజిటల్ విధానాన్ని అనుసరించేలా మార్గం సుగమం చేసే డిజిటల్ లాకర్స్ కు మనదేశంలో మంచి డిమాండ్ కూడా ఉంది.

తెలంగాణ, ఏపీ నుంచి IRCTC Bharat Darshan టూరిస్ట్ ట్రైన్... రూ.10,000 ఖర్చుతో 10 రోజుల టూర్

IRCTC Bus Ticket booking: ఐఆర్‌సీటీసీ బస్ టికెట్ బుకింగ్‌పై మీకూ ఈ సందేహాలున్నాయా? సమాధానాలివే

కంప్లైంట్లు తగ్గుతాయి


డిజిటల్ లాకర్లు అందుబాటులోకి వస్తే కేవలం పాలసీ డాక్యుమెంట్ల భద్రత పెరగటమే కాదు.. నాకు పాలసీ కాగితాలు ఇంకా అందలేదు అన్న కంప్లైంట్లు కూడా పోతాయి. రియల్ టైంలో ఇవన్నీ ప్రాసెస్ అవుతాయి. క్లెయిమ్స్‌ను అత్యంత వేగంగా క్లియర్ చేసే సామర్థ్యం ఇన్సూరెన్సు కంపెనీలకు వస్తుంది. సెటిల్ మెంట్లు, వివాదాల పరిష్కారానికి ఇది మంచి షార్ట్ కట్ కూడా. మోసాలు వంటి వాటికి అవకాశాలు తక్కువ కనుక వినియోగదారుడికి భద్రత భరోసాను ఇవ్వచ్చు. మెరుగైన కస్టమర్ సర్వీసులు డిజిటల్ లాకర్ తో సాధ్యం. ఇందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు తమ ఐటీ సిస్టంను అప్ గ్రేడ్ చేసుకుంటున్నాయి. అంతేకాదు తమ కస్టమర్లకు డిజిలాకర్ సదుపాయం గురించి ఇన్సూరెన్స్ కంపెనీలు తప్పకుండా సమాచారం అందించేలా ఐఆర్డీఏఐ ఆదేశాలు ఇచ్చింది. National e-Governanace Division (NeGD) కింద కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ గైడ్ లైన్స్ ప్రకారం వినియోగదారుడికి డిజిలాకర్ ఉపయోగాలు, ఉపయోగించే విధానాలు అన్నీ ఇన్సూరెన్స్ కంపెనీలు సవివరంగా తెలియజేస్తూ అవసరమైన టెక్నికల్ సపోర్ట్ ను పౌరులకు అందించాల్సి ఉంటుంది.

ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్సు, కార్ రిజిస్ట్రేషన్, ఓటర్ ఐడీ, ప్యాన్ కార్డ్, స్కూల్ అండ్ కాలేజ్ సర్టిఫికెట్లు ఇతర డాక్యుమెంట్లు వంటి ప్రభుత్వం జారీచేసే డాక్యుమెంట్లను డిజిటల్ ఫార్మాట్ లో సేవ్ చేసుకునే సౌలభ్యం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: DigiLocker, Health Insurance, Insurance, Personal Finance

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు