• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • GOOD NEWS FOR CULT FIT MEMBERS THIS POPULAR FITNESS CHAIN ANNOUNCED FREE COVID 19 VACCINES TO OFFLINE MEMBERS SS

Cult.Fit: కల్ట్ ఫిట్ సభ్యులకు గుడ్ న్యూస్... ఉచితంగా వ్యాక్సిన్

Cult.Fit: కల్ట్ ఫిట్ సభ్యులకు గుడ్ న్యూస్... ఉచితంగా వ్యాక్సిన్ (ప్రతీకాత్మక చిత్రం)

Cult.Fit | కల్ట్ ఫిట్ జిమ్ సభ్యులకు గుడ్ న్యూస్. దేశంలోని రెండు లక్షలకు పైగా జిమ్ సభ్యులకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది కల్ట్ ఫిట్.

  • Share this:
    భారతదేశంలో పాపులర్ ఫిట్‌నెస్ చెయిన్ అయిన Cult.fit తమ ఆఫ్‌లైన్ ఫిట్‌నెస్ మెంబర్స్ అందరికీ ఉచితంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇస్తామని ప్రకటించింది. రెండు లక్షలకు పైగా ఆఫ్‌లైన్ ఫిట్‌నెస్ మెంబర్స్‌కు ఉచితంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ ఇప్పిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా 20 పట్టణాల్లో కల్ట్ సెంటర్స్, జిమ్స్‌లో ఆఫ్‌లైన్ కల్ట్ పాస్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న కొత్త, పాత సభ్యులందరికీ ఇది వర్తిస్తుంది. హైదరాబాద్, విశాఖపట్నంతో పాటు ఇతర నగరాల్లోని కల్ట్ సభ్యులందరూ ఉచిత వ్యాక్సిన్ పొందేందుకు అర్హులు. ఇందుకోసం కల్ట్ ఫిట్ ఎంఫైన్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. వ్యాక్సిన్ డ్రైవ్ కోసం రిజిస్ట్రేషన్ జూన్ 16న ప్రారంభమవుతుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. జూన్ 24 నుంచి వ్యాక్సిన్ తీసుకోవచ్చు.

    Vivo Y73 offer: ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే బ్లూటూత్ స్పీకర్ ఫ్రీ

    Poco M3 Pro 5G: కాసేపట్లో పోకో ఎం3 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ సేల్... ధర రూ.13,499 మాత్రమే


    అయితే ఏ వ్యాక్సిన్ ఇస్తారన్నదానిపై న్యూస్18 టెక్ టీమ్‌కు Cult.fit క్లారిటీ ఇచ్చింది. కేవలం ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న పట్టణాల్లో ఆ వ్యాక్సిన్ మాత్రమే ఇచ్చే అవకాశం ఉంటుందని, రెండు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్న పట్టణాల్లో మాత్రం కల్ట్ ఫిట్ సభ్యులకు కోవాగ్జిన్, కోవీషీల్డ్‌లో ఏదో ఒకటి ఎంచుకునే ఛాయిస్ ఉంటుందని తెలిపింది. కల్ట్ ఫిట్ కేవలం తమ జిమ్ సభ్యులకు మాత్రమే ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తోంది. అయితే జిమ్ సభ్యుల కుటుంబ సభ్యులు, స్నేహితులు వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. కల్ట్ ఫిట్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు.

    Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ సేల్... ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్

    Realme X7 Max 5G: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,399 ధరకే కొనండి ఇలా

    కల్ట్ ఫిట్‌లో పనిచేసే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని 2021 ఏప్రిల్‌లో ప్రకటించింది కల్ట్ ఫిట్. ఆ ఉచిత వ్యాక్సిన్ నిర్ణయాన్ని తమ గ్రూపు సభ్యులందరికీ ప్రకటించింది. తమ కస్టమర్లకు ఇంత భారీ మొత్తంలో వ్యాక్సిన్ ఇప్పిస్తామని చెప్పిన మొదటి బ్రాండ్ తమదేనని కల్ట్ ఫిట్ వివరించింది.
    Published by:Santhosh Kumar S
    First published: