Home /News /technology /

GOOD NEWS FOR CITIZENS NOW YOU CAN BOOK COVID 19 VACCINE SLOTS ON WHATSAPP KNOW HOW SS

Covid 19 Vaccine: వాట్సప్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్... ఇలా చేయండి

Covid 19 Vaccine: వాట్సప్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్... ఇలా చేయండి
(image: MyGovIndia)

Covid 19 Vaccine: వాట్సప్‌లో కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్... ఇలా చేయండి (image: MyGovIndia)

Covid 19 Vaccine | వాట్సప్ ద్వారా కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసే అవకాశం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. మరి వ్యాక్సిన్ స్లాట్ వాట్సప్‌లో ఎలా బుక్ చేయాలో తెలుసుకోండి.

    మీరు కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకోలేదా? వ్యాక్సిన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇక మీరు వాట్సప్‌లో కూడా కోవిడ్ 19 వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మరో కొత్త సర్వీస్ ఇది. కేంద్ర ఆరోగ్య శాఖ, మైగవ్‌ ఇండియాతో కలిసి వాట్సప్ ద్వారా వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్స్ బుక్ చేసే సేవల్ని ప్రారంభిస్తున్నట్టు వాట్సప్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ విల్ క్యాథ్‌కార్ట్ తెలిపారు. వాట్సప్‌లో మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్ ద్వారా మీకు దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్‌లో వ్యాక్సిన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అంతేకాదు... మీరు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రజలు తమకు దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్లు గుర్తించేందుకు, ఆ సెంటర్లలో స్లాట్స్ బుక్ చేసేందుకు వాట్సప్‌లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇంటర్‌ఫేస్ ఉపయోగపడుతుంది. దేశ పౌరుల సౌలభ్యం కోసం కొత్త శకానికి నాంది పలికామని, మీ ఫోన్లలో కేవలం కొన్ని నిమిషాల్లో వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేయొచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవియా తెలిపారు.

    Realme Buds Air 2: రూ.33 ధరకే రియల్‌మీ బడ్స్ ఎయిర్ 2... అసలు ధర రూ.3,299

    Realme X7 Max 5G: రూ.26,999 విలువైన ఈ స్మార్ట్‌ఫోన్ రూ.9,999 ధరకే కొనండి ఇలా


    వాట్సప్ ద్వారా వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేయడానికి ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్ నెంబర్ 9013151515 సేవ్ చేయాలి. ఆ తర్వాత ఆ నెంబర్ ఛాట్ విండో ఓపెన్ చేసి Book Slot అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. మీకు ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన 6 అంకెల ఓటీపీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీకు దగ్గర్లోని వ్యాక్సినేషన్ సెంటర్, వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటున్న తేదీ, పిన్ కోడ్, వ్యాక్సిన్ టైప్ సెలెక్ట్ చేయాలి. మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీరు స్లాట్ బుక్ చేసిన సమయానికి వ్యాక్సినేషన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చు.

    Wi-Fi Connection: అపరిచితులు మీ వైఫై కనెక్షన్ వాడుతున్నారా? ఇలా చేయండి

    Smartphone: రూ.10,000 లోపు స్మార్ట్‌ఫోన్ కొనాలా? 5 బెస్ట్ మోడల్స్ ఇవే


    ఇప్పటికే వ్యాక్సిన్ స్లాట్స్‌ని ప్రభుత్వానికి చెందిన కోవిన్ పోర్టల్, ఆరోగ్య సేతు యాప్, ఉమాంగ్ మొబైల్ యాప్‌లో బుక్ చేసే అవకాశం ఉంది. పేటీఎం యాప్‌లో కూడా వ్యాక్సిన్ స్లాట్స్ బుక్ చేయొచ్చు. ఇప్పుడు వాట్సప్‌లో కూడా వ్యాక్సిన్ స్లాట్ బుకింగ్ సదుపాయం రావడంతో ఈ పద్ధతి ఇంకా సులువైంది. వ్యాక్సిన్ తీసుకోవడం మాత్రమే కాదు... వాట్సప్ ద్వారా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సర్వీస్ ఆగస్ట్ 5న మొదలైంది. ఇప్పటికే 32 లక్షల సర్టిఫికెట్స్‌ని వాట్సప్ ద్వారా డౌన్‌లోడ్ చేయడం విశేషం.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Corona vaccination centres, Corona Vaccine, Covid vaccine, COVID-19 vaccine, Vaccination, Whatsapp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు