Home /News /technology /

GOOD NEWS FOR AIRTEL USERS GET EXTENDED VALIDITY UP TO 2020 APRIL 17 AND ADDITIONAL RS 10 TALKTIME SS

Airtel: ఎయిర్‌‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... బెనిఫిట్స్ ఇవే

Airtel: ఎయిర్‌‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... బెనిఫిట్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel: ఎయిర్‌‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్... బెనిఫిట్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Airtel | ఒకవేళ ఈ లాక్‌డౌన్ సమయంలో ఎవరి వేలిడిటీ అయినా పూర్తయ్యేలా ఉంటే లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు వేలిడిటీ లభించినట్టే.

    మీరు ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబరా? ఎయిర్‌టెల్ నెట్వర్క్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. సుమారు 8 కోట్ల మంది యూజర్లకు మేలు చేసే నిర్ణయం తీసుకుంది భారతీ ఎయిర్‌టెల్. ప్రతీ ఒక్కరి అకౌంట్‌లోకి రూ.10 జమ చేయనుంది. కాల్స్, మెసేజెస్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కరోనా వైరస్ ప్రభావం కారణంగా వలస కార్మికులు, దినసరి కూలీలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఎయిర్‌టెల్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదొక్కటే కాదు... 8 కోట్ల మంది ప్రీపెయిడ్ యూజర్లకు వేలిడిటీ కూడా పొడిగిస్తోంది ఎయిర్‌టెల్. లాక్‌డౌన్ సమయంలో వేలిడిటీ పూర్తై ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో ఎయిర్‌టెల్ వేలిడిటీని పొడిగించింది. వారికి రీఛార్జ్ చేయాలన్న టెన్షన్ లేకుండా చేసింది.

    ఒకవేళ ఈ లాక్‌డౌన్ సమయంలో ఎవరి వేలిడిటీ అయినా పూర్తయ్యేలా ఉంటే లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు వేలిడిటీ లభించినట్టే. వేలిడిటీని 2020 ఏప్రిల్ 17 వరకు పొడిగించింది కంపెనీ. ఔట్‌గోయింగ్ కాల్స్ చేయడంతో పాటు ఇన్‌కమింగ్ కాల్స్ స్వీకరించడంలో యూజర్లు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం లేదు. ఈ బెనిఫిట్స్ 8 కోట్ల మంది ప్రీపెయిడ్ యూజర్లకు ఈ బెనిఫిట్స్ లభిస్తాయని చెబుతోంది ఎయిర్‌టెల్. మరో 48 గంటల్లో ఈ బెనిఫిట్స్ యూజర్ల అకౌంట్లలో లభిస్తాయని అంటోంది.

    ఇవి కూడా చదవండి:

    Jio Recharge: జియో యూజర్లకు గుడ్ న్యూస్... రీఛార్జ్ ఇలా కూడా చేయొచ్చు

    EPF Account: ఈపీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక... ఈ విషయాలు మర్చిపోవద్దు

    Indian Railways: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్‌పై క్లారిటీ ఇచ్చిన రైల్వే
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: AIRTEL, Airtel recharge plans, Corona, Corona virus, Coronavirus, Covid-19, Lockdown

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు