హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Airtel: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

Airtel: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం

Airtel: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం
(ప్రతీకాత్మక చిత్రం)

Airtel: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితం (ప్రతీకాత్మక చిత్రం)

Airtel Prepaid Plans | ఎయిర్‌టెల్ సరికొత్త రీఛార్జ్ ప్లాన్ ప్రకటించింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారికి డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం.

మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువగా వీడియోలు, సినిమాలు చూస్తుంటారా? మీరు డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తోంది ఎయిర్‌టెల్. రూ.401 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నవారు ఈ ఆఫర్ పొందొచ్చు. కొద్ది రోజుల క్రితం హాట్‌స్టార్ రీబ్రాండెడ్ వర్షన్ డిస్నీ+ హాట్‌స్టార్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5 లాంటి యాప్స్‌కు పోటీగా డిస్నీ+ హాట్‌స్టార్ వచ్చింది. డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ ఏడాది ప్లాన్ తీసుకోవాలంటే రూ.399 చెల్లించాలి. కానీ ఎయిర్‌టెల్ సబ్‌స్క్రైబర్లు రూ.401 రీఛార్జ్ చేసుకొని డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందొచ్చు. ఇందుకోసం అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇక ఎయిర్‌టెల్ రూ.401 ప్లాన్ విషయానికి వస్తే ఇది డేటా ప్యాక్. 28 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజుకు 3 జీబీ డేటా వాడుకోవచ్చు. కాలింగ్, ఎస్ఎంఎస్ బెనిఫిట్స్ మాత్రం ఉండవు. ఈ ప్లాన్‌తో రూ.399 విలువ గల ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. మీరు ఈ ప్లాన్‌ను ఒక ఏడాదిలో ఒకసారి మాత్రమే పొందే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఎయిర్‌టెల్ రూ.398 ప్లాన్‌పై అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Akshay Tritiya 2020: అక్షయ తృతీయ ఆఫర్స్... ఆన్‌లైన్‌లో బంగారు నగల అమ్మకాలు

LIC Policy Loan: ఎల్ఐసీ పాలసీ ఉందా? లోన్ తీసుకోవచ్చు ఇలా

LIC Home Loan: హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్ఐసీ హౌసింగ్

First published:

Tags: AIRTEL, Airtel recharge plans, Disney+ Hotstar, Hotstar

ఉత్తమ కథలు