అమెజాన్ ప్రైమ్ వీడియో తొలిసారిగా ఇండియాలో మొబైల్ ఓన్లీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ప్రకటించింది. ఇలా మొబైల్ ఓన్లీ ప్లాన్స్ ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ప్లాన్స్ లేవు. నెలకు రూ.89 చెల్లిస్తే చాలు ప్రైమ్ వీడియోలోని కంటెంట్ మొత్తం అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. వారిలో ఎక్కువ మంది మొబైల్‌లో ఉపయోగించేవారే ఎక్కువ. అంతేకాదు... ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లలోనే కంటెంట్ చూసున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మొబైల్ ఓన్లీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ రూపొందించింది అమెజాన్ ప్రైమ్ వీడియో. ప్రస్తుతం ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు నెలకు రూ.89 ధరకు మొబైల్ ఓన్లీ ప్లాన్ అందిస్తున్నట్టు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది.
Xiaomi Mi 10i: తొలి సేల్‌లో 1,00,000 స్మార్ట్‌ఫోన్స్ అమ్మిన షావోమీ... ఈ మోడల్ ప్రత్యేకత ఇదే
Jio New Plans: రోజూ 1.5జీబీ డేటా... రిలయెన్స్ జియో లేటెస్ట్ ప్లాన్స్ ఇవే
Announcing the worldwide-first launch of Prime Video Mobile Edition in India!
Mobile-only access to all Amazon Originals, movies and shows. Mobile Edition (ME) will be available starting today for @airtelindia prepaid customers! This is Prime Video built for ME. #PrimeVideoME pic.twitter.com/fKjv46IyZL
— amazon prime video IN (@PrimeVideoIN) January 13, 2021
అమెజాన్ ప్రైమ్ వీడియో నుంచి మొబైల్ ఓన్లీ ప్లాన్ రావడం ఇదే తొలిసారి. ఇంతకుముందు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రత్యర్థి అయిన నెట్‌ఫ్లిక్స్ ఇలాంటి ప్లాన్ ప్రకటించింది. నెలకు రూ.199 ధరకు మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను 2019 జూలైలో ప్రకటించింది నెట్‌ఫ్లిక్స్. ఇతర దేశాల్లో కూడా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇలాంటి ప్లాన్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఓన్లీ ప్లాన్‌ను ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఈ ప్లాన్ ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. ఎయిర్‌టెల్ నెట్వర్క్ ఉపయోగిస్తున్న ప్రీపెయిడ్ కస్టమర్లు నెలకు రూ.89 చెల్లించి అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఓన్లీ ప్లాన్ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఈ ప్లాన్ అందిస్తున్నా త్వరలో ఇతర కస్టమర్లకు కూడా ఇదే ప్లాన్ అందించే అవకాశముంది.
Aadhaar Card: మీ ఆధార్ కార్డుకు ఏ ఫోన్ నెంబర్ లింక్ చేశారు? 2 నిమిషాల్లో తెలుసుకోండిలా
Samsung Galaxy M02s: కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసిన సాంసంగ్... ధర రూ.10,000 లోపే
అమెజాన్ 30 రోజుల ఫ్రీ ట్రయల్ కూడా అందిస్తోంది. ఆ తర్వాత కస్టమర్లకు నాలుగు వేర్వేరు ప్లాన్స్ ఉంటాయి. ఈ ప్లాన్స్ రూ.89 నుంచి రూ.349 వరకు ఉంటాయి. ప్రతీ 28 రోజులకు అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్స్ టెలికాం సర్వీస్‌తో కలిపి ఉంటాయి. రూ.89 ప్లాన్‌తో ప్రైమ్ వీడియోతో పాటు 6జీబీ డేటా అదనంగా లభిస్తుంది. రూ.299 ప్రీపెయిడ్ బండిల్ తీసుకుంటే ప్రైమ్ వీడియోతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజూ 1.5జీబీ డేటా లభిస్తుంది. రూ.131 రీఛార్జ్ చేస్తే ప్రైమ్ మెంబర్‌షిప్ పూర్తిగా లభిస్తుంది. అంటే ఫ్రీ షిప్పింగ్, ప్రైమ్ మ్యూజిక్, ఇతర ప్రైమ్ బెనిఫిట్స్ అన్నీ లభిస్తాయి. రూ.349 రీఛార్జ్ చేస్తే ప్రైమ్ మెంబర్‌షిప్ పూర్తిగా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్స్ అన్నీ 28 రోజుల వేలిడిటీతో వస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AIRTEL, Airtel recharge plans, Amazon, AMAZON INDIA, Amazon prime